Nawazuddin Siddiqui: మొన్నటి వరకు భర్తను తిట్టిపోసిన ఆలియా - ఇప్పుడేమో ఇలా, అవాక్కవుతున్న బి-టౌన్!
Nawazuddin Siddiqui: బాలీవుడ్ నటుడు నవాజుద్ధిన్ సిద్ధిఖీ గురించి పరిచయం అవసరం లేదు.ఆయన ప్రొఫెషనల్ లైఫ్ అందరికి సుపరిచితమే. అలాగే ఆయన పర్సనల్ లైఫ్, భార్యతో గొడవలు కూడా అందరికి తెలిసిందే.
Nawazuddin Siddiqui Patched Things Up With Wife Aaliya: బాలీవుడ్ నటుడు నవాజుద్ధిన్ సిద్ధిఖీ గురించి పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ విలక్షణ నటుడైన ఇటీవల వెంకటేషన్ 'సైంధవ్' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన ప్రొఫెషనల్ లైఫ్ అందరికి సుపరిచితమే. అలాగే ఆయన పర్సనల్ లైఫ్, భార్యతో గొడవలు కూడా అందరికి తెలిసిందే. మొన్నటి వరకు నవాజుద్ధిన్ సిద్ధిఖీ ఆయన భార్యకు మధ్య విపరీతమైన గొడవలు జరిగాయి. వీరిద్దర గొడవలు రచ్చకు కూడా ఎక్కాయి. బహిరంగంగా ఎన్నోసార్లు భర్తపై ఆరోపణలు చేసింది ఆలియా. అంతేకాదు విడాకులు కూడా కావాలంటూ దరఖాస్తు చేసుకున్నారు.
మొన్నటి వరకు భర్తతో గొడవలు, విభేదాలు
తరచూ భర్తపై ఏదోక ఆరోపణలు చేస్తూ తమ వైవాహిక జీవితంలోని కలతలను అందరి ముందు పెట్టింది. పదే పదే నవాజుద్దీన్ టార్గెట్ చేస్తూ పోస్ట్‌లు పెట్టేసింది. పిల్లలను తనని పట్టించుకోకుండా మరోకరితో రిలేషన్‌లో ఉన్నాడంటూ ఆరోపణలు కూడా చేసింది. కానీ, భార్య ఆరోపణలపై ఏనాడు నవాజుద్ధిన్ పెదవి విప్పలేదు. ఆమె చేసే రచ్చను సైలెంట్‌గా చూస్తూ ఉన్నాడు కానీ, ఏనాడు భార్యపై తిరిగి ఆరోపణలు చేయలేదు. అయితే మొన్నటి వరకు భర్తను తిట్టిపోసిన ఆలియా మై ట్రూ లవ్ ప్రేమ కురిపిచింది. ఈ మేరకు ఆమె ఓ పోస్ట్ షేర్ చేసింది. ఇది చూసి అంతా షాక్ అవతున్నారు. మొన్నటి వరకు భర్తను తిట్టిపోస్తూ ఆయన పరువును బజారు పెడిసిన ఆమె ఇప్పుడేంటి అతడి పొగడ్తలతో ముంచెత్తుందంటూ అంటూ ఆమె పోస్ట్‌పైనే చర్చించుకుంటున్నారు.
View this post on Instagram
మళ్లీ కలిసిపోయారా?
తిరిగి భర్తతో కలిసిపోయిందా?, విడాకులతో తీసుకుని విడిపోతుందనుకున్న ఈ జంట తిరిగి కలిసిపోతున్నారా? అంటున్నారు. ఇంతకి ఆలియా పోస్ట్‌లో ఏముందంటే. తన పిల్లలు, భర్త నవాజుద్ధీన్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. తమ 14 ఏళ్ల వైవాహిక బందానికి విషెస్ తెలుపుతూ పోస్ట్ చేసింది. 'వివాహ బంధానికి 14 ఏళ్లు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మై వన్ అండ్ ఓన్లీ చీర్స్' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఆమె పోస్ట్‌పై ఇంతవరకు నవాజుద్ధీన్ స్పందించకపోవడం గమనార్హం. కానీ, ఆమె పోస్ట్ చూసి అంతా అవాక్కావుతున్నారు. భర్తతో పబ్లిక్‌గా గోడవలు, అవమానాలు తర్వాత మళ్లీ అతడితో కలిసిపోవాలనుకుంటుందా? అని ముక్కున వెలేసుకుంటున్నారు.
Also Read: అనుపమ, మహేష్‌ని ట్రోల్ చేసిందా? - ఆ కామెంట్స్ ఆయనను ఉద్దేశించి చేసినవా? నిజమెంతా!
పైగా పోస్ట్‌లో తన ఏకైక ప్రేమికుడు అనడం మరింత విడ్డూరంగా ఉందంటున్నారు. ఎందుకంటే భర్తతో విడిపోవాలని నిశ్చియించుకున్న ఆలియా పిల్లలతో సహా ఇంటి నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఒంటరికి ఉంటున్న ఆమె ఆ మధ్య మళ్లీ ప్రేమలో పడినట్టుగా ఓ హింట్ ఇచ్చింది. గుర్తు తెలియని వ్యక్తితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ తన జీవితంలోకి మళ్లీ ఆనందం వచ్చిందంటూ పరోక్షంగా చెప్పింది. కానీ అతనెవరనేది కనిపించకుండ జాగ్రత్త పడింది. అంటే మరో వ్యక్తితో పెళ్లికి రెడీ అన్నట్టు ఆ పోస్ట్‌తో అందరికి హింట్ ఇచ్చింది. ఆ తర్వాత పోస్ట్ డిలిట్ చేసింది.ఇక ఆమె తాజా పోస్ట్ చూస్తుంటే మాత్రం విడాపోవాలనుకున్న ఈ జంట మళ్లీ ఒక్కటవుతున్నారని తెలుస్తోంది. దీంతో మరోసారి ఈ కాంట్రవర్స్ కపుల్ వార్తల్లో నిలిచారు.