అన్వేషించండి

Anupama Trolls Mahesh: అనుపమ, మహేష్‌ని ట్రోల్‌ చేసిందా? - ఆ కామెంట్స్‌ ఆయనను ఉద్దేశించి చేసినవా? నిజమెంతా!

Anupama parameswaran: అనుపమ పరమేశ్వరన్‌ మహేష్‌ బాబును ట్రోల్‌ చేసిందంటూ సోషల్‌ మీడయాలో ప్రచారం జరుతుంది. దీంతో అనుపమ మహేష్‌ ఫ్యాన్స్‌ ఫైర్ అవుతున్నారు. ఇంతకి అసలు విషయం ఏంటంటే..

Is Anupama Trolls Mahesh Babu: హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎప్పుడు గాసిప్‌, కాంట్రవర్సీలకు దూరంగా ఉండే ఆమె 'టిల్లు స్వ్కేర్‌'తో ఫుల్‌ ట్రోల్‌కు గురైంది. ఇందులో ఆమె రెచ్చిపోయి మరి రొమాన్స్, గ్లామర్‌ షో చేసిందంటూ అంతా ఆమెను విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో తన పాత్ర గురించి 'టిల్లు స్వ్కేర్‌'లో ఆమె వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. నేను మనిషేనా అని, నటిగా తన ఫ్యాన్స్‌ని అలరించాలనుకుంటున్నానంటూ 'టిల్లు స్వ్కేర్‌' అందాలు ఆరబోతపై వివరణ ఇచ్చింది. అయితే ఇప్పుడు అవే కామెంట్స్‌ హాట్‌టాపిక్‌గా నిలిచాయి.

ఇవి ఆమె సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబును ఉద్దేశించి చేసిందంటూ ఆమె కామెంట్స్‌పై నెగిటివ్‌ ప్రచారం చేయడం మొదలు పెట్టారు. అంతేకాదు అనుమప మహేష్‌ను ట్రోల్‌ చేస్తుందంటూ తప్పుడు ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఇంతకి అసలు విషయం ఏంటంటే. సిద్దూ జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ 'టిల్లు స్వ్కేర్‌'. డీజే టిల్లుకు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీ మార్చి 29న రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా 'టిల్లు స్వ్కేర్‌' టీం మీడియాతో ఇంటారాక్ట్‌ అయ్యింది. ఈ ప్రెస్‌ మీట్‌లో అనుపమ కూడా పాల్గొంది. ఈ సందర్భంగా ఆమెకు విలేకరుల నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. 'ఇంతకాలం ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపించిన మీరు ఈ సినిమాలో అంతా గ్లామర్‌ షో చేయడానికి కారణం ఏంటీ?' అని ప్రశ్నించారు.

'టిల్లు స్వ్కేర్‌' ప్రెస్ మీట్ లో ఇలా 

దీనికి ఆమె స్పందిస్తూ.. "మీరు రోజు ఒకే కూరతో అన్నం తిట్టారా? ఒక రోజు పప్పు, మిగతా రోజులు ఏదోక కర్రీతో తింటారు కదా? రోజూ ఒకే కూర తింటే బోర్‌ కొట్టదా? అలాగే నాకు కూడా. నేను మీలా మనిషినే. ఎప్పుడూ ఒకే పాత్రల్లో నటించాలంటే నాకూ బోర్‌ కొడుతుంది. అందుకే మారాలి అనుకున్నా. నన్ను నేను నటిగా ప్రూవ్‌ చేసుకోవాంటే కొత్త కొత్త పాత్రలు, వైవిధ్యమైన కథలు చేయాలనుకుంటున్నా. అందుకే 'టిల్లు స్వ్కేర్‌' ద్వారా మీకు కొత్త అనుపమని పరిచయం చేయాలనుకున్నారు" అంటూ కాస్తా ఘాటుగా రిప్లై ఇచ్చింది. అయితే ఆమె కామెంట్స్‌ కొందరు యాంటీ ఫ్యాన్స్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకు ఆపాదిస్తున్నారు. అనుపమ మహేష్‌ను ఉద్దేశించి ఈ కామెంట్స్‌ చేసిందంటూ ప్రచారం మొదలుపెట్టారు. అంతేకాదు అనుపమ కామెంట్స్‌తో అయినా మహేష్‌ బాబు మారాలంటూ నెగిటివ్‌ ప్రచారం చేస్తున్నారు. కారణం.. 2015 నుంచి 2020 వరకు మహేష్‌ చేసిన సినమాలన్ని ఒకే జానర్‌లో వచ్చినవే.

అన్ని సినిమాల్లోనూ ఆయన అదే లుక్‌ మెయింటైన్‌ చేస్తూ వస్తున్నారని, సినిమా సినిమాకు వైవిధ్యతను చూపించడం లేదంటూ గతంలో ఆయనపై విమర్శలు కూడా వచ్చాయి.  'శ్రీమంతుడు', 'బ్రహ్మోత్సవం','స్పైడర్','భరత్ అనే నేను', 'మహర్షి'తో పాటు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాల వరకు ఆయన చిత్రాల్లో పెద్దగా కొత్తదనం కనిపించాలేదు. అన్ని ఒకే జానర్లో వచ్చినవే. దాంతో కొందరు యాంటీ ఫ్యాన్స్‌ అనుపమ కామెంట్స్‌ని మహేష్‌కి ఆపాదిస్తున్నారు. కానీ, ఆమె వ్యాఖ్యలు కేవలం తనపై వస్తున్న ట్రోల్స్‌కి మాత్రమే సమాధానం చెప్పింది. ఇది ఆమె కామెంట్స్‌లో స్పష్టం కనిపించింది. అంతేకాదు మహేష్‌ బాబును ఉద్దేశించి చేసినవి కాదని తేలిపోయింది. కానీ ఎందుకొ కానీ, కొందరు ఆమె వ్యాఖ్యలను తప్పుబడుతూ మహేష్‌ని ట్రోల్‌ చేస్తుందంటూ అనుపమ కామెంట్స్‌ని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.  మరి ఇకనైన ఇలాంటి తప్పుడు ప్రచారంకు ట్రోలర్స్‌ చెక్‌ పెడుతారో లేదో చూడాలి!  

Also Read: ఏపీ రాజకీయాలు, సీఎం జగన్‌పై '30 ఇయర్స్‌ ఇండస్ట్రీ' పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget