News
News
X

Dimple Hayathi In RamaBanam : 'రామబాణం'లో బాలిక - భైరవిగా డింపుల్ హయతి

Gopichand's Ramabanam Movie Update : గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'రామబాణం'. ఇందులో డింపుల్ హయతి హీరోయిన్. ఈ రోజు ఆవిడ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

FOLLOW US: 
Share:

మ్యాచో హీరో గోపీచంద్ (Gopichand) హీరోగా శ్రీవాస్ (Sriwass) దర్శకత్వంలో రూపొందుతున్న హ్యాట్రిక్ సినిమా 'రామబాణం' (Ramabanam Movie). 'లక్ష్యం', 'లౌక్యం' విజయాల తర్వాత హీరో, దర్శకుడు కలయికలో వస్తున్న సినిమా. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో డింపుల్ హయతి హీరోయిన్. ఈ రోజు ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
 
'భైరవి'గా డింపుల్ హయతి!
Dimple Hayathi First Look - RamaBanam : మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు 'రామబాణం' సినిమాలో హీరోయిన్ డింపుల్ హయతి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. భైరవి పాత్రలో ఆమె నటిస్తున్నట్లు తెలిపారు. ఫస్ట్ లుక్, విడుదల చేసిన వీడియో చూస్తే... మోడ్రన్ అమ్మాయిగా డింపుల్ నటించినట్లు తెలుస్తోంది. ఆమె డ్రస్సింగ్ పద్దతిగా ఉంది. చేతిలో గో ప్రో కెమెరా ఉంది. క్యాబ్ దిగడం, ఆ కెమెరా చూస్తే... సంథింగ్ స్పెషల్ అన్నట్టు ఉంది.

Also Read వెయ్యి కోట్ల సినిమాకు అయినా సరే 'ఆమె' కావాలి - ఆడదే ఆధారం 

మే 5న 'రామబాణం'
Ramabanam Release On May 5th : 'రామబాణం' సినిమాను మే 5న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. 'బాగా చదవండి. పరీక్షలు ఇంకా బాగా రాయండి. వేసవి సెలవుల్లో కలుద్దాం' అంటూ రిలీజ్ డేట్ పోస్టర్ మీద పేర్కొన్నారు. అందులో గోపీచంద్ స్టిల్ చూస్తే... చేతిలో ఆయుధంతో కనిపించారు. కత్తి కొత్తగా ఉంది. ఆల్రెడీ విడుదల చేసిన 'విక్కీస్ యారో' వీడియో గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అది గమనిస్తే...  

'రామబాణం' వీడియో గ్లింప్స్ చూస్తే... మొదట స్టైలిష్ సూట్‌లో గోపీచంద్ మాస్ ఎంట్రీ ఇచ్చారు. ఫైట్ సీన్ ద్వారా ఆయనను దర్శకుడు శ్రీవాస్ చూపించారు. ఆ తర్వాత మరో నాలుగు డ్రస్సుల్లో హీరో కనిపించారు. లాస్ట్ షాట్ తప్పిస్తే... మిగతా నాలుగు డ్రస్సుల్లోనూ మాంచి హీరోయిజం చూపించారు. ఈ సినిమాలో ఫైట్స్ ఎలా ఉంటాయి? అనేది హింట్ ఇచ్చారు. కమర్షియల్ సినిమా అనే ఫీలింగ్ కలిగింది.

సోషల్ ఇష్యూస్ టచ్ చేస్తూ...
'రామబాణం'లో కమర్షియల్ హంగులు మాత్రమే కాదు... ఓ సోషల్ ఇష్యూ కూడా ఉందని సమాచారం. ప్రస్తుత సమాజంలో జనాలు ఎదుర్కొంటున్న ఒక సామాజిక సమస్యను స్పృశిస్తూ దర్శకుడు శ్రీవాస్ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ఇందులో హీరోయిజంతో పాటు ఎమోషనల్ సీన్స్, ఫ్యామిలీ బాండింగ్ కూడా ఉందట. అవి ట్రైలర్ లేదంటే విడుదలకు ముందు ఆ సోషల్ ఇష్యూ ఏంటనేది రివీల్ చేసే అవకాశం ఉంది. 'రామ బాణం'లో విక్కీ పాత్రలో గోపీచంద్ నటిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ రోజు ఆయన క్యారెక్టర్ ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ విడుదల చేశారు. యాక్షన్ ఎపిసోడ్ నుంచి ఈ స్టిల్ విడుదల చేసినట్లు అర్థం అవుతోంది. గోపీచంద్ (Gopichand Ramabanam First Look)కు యాక్షన్ హీరో ఇమేజ్ ఉంది. దానిని దృష్టిలో పెట్టుకుని శ్రీవాస్ మాంచి యాక్షన్ సీక్వెన్సులు డిజైన్ చేసినట్లు ఉన్నారు. 

Also Read 'కెజియఫ్' కామెంట్స్ గొడవ - వెంకటేష్ మహా ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ఆయనకు అసలు పాయింట్ అర్థమవుతోందా?

ఇది గోపీచంద్ 30వ సినిమా. 'కార్తికేయ 2', 'ధమాకా' సినిమాలతో విజయాలు అందుకున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న తాజా చిత్రమిది. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. జగపతి బాబు, ఖుష్బూ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. 

Published at : 08 Mar 2023 01:20 PM (IST) Tags: gopichand Dimple Hayathi Ramabanam Movie

సంబంధిత కథనాలు

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Robert Downey Jr: ఆ హీరో నమిలేసిన చూయింగ్ గమ్ రూ. 45 లక్షలా? ఏం చేసుకుంటారు నాయనా?

Robert Downey Jr: ఆ హీరో నమిలేసిన చూయింగ్ గమ్ రూ. 45 లక్షలా? ఏం చేసుకుంటారు నాయనా?

Balagam Censored Dialogue: సెన్సార్‌కు ముందు, సెన్సార్ తర్వాత - ‘బలగం’లోని ఆ డైలాగ్ లీక్ చేసిన ప్రియదర్శి

Balagam Censored Dialogue: సెన్సార్‌కు ముందు, సెన్సార్ తర్వాత - ‘బలగం’లోని ఆ డైలాగ్ లీక్ చేసిన ప్రియదర్శి

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?

Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ రిలీజ్ - అందంతో కట్టిపడేస్తోన్న సమంత

Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ రిలీజ్ - అందంతో కట్టిపడేస్తోన్న సమంత

టాప్ స్టోరీస్

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్