By: ABP Desam | Updated at : 06 Apr 2023 08:44 AM (IST)
'ఆదిపురుష్' సినిమాలో హనుమంతునిగా దేవదత్తా నాగే
ప్రభు శ్రీరామ్ పాత్రలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన సినిమా 'ఆదిపురుష్'. ఓం రౌత్ (Om Raut) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సీత దేవి పాత్రలో కృతి సనన్ (Kriti Sanon), లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటించారు. శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చూస్తే... ఈ సీతా రాములతో పాటు లక్ష్మణుడి లుక్ కూడా స్పష్టంగా కనబడుతోంది. అందులో హనుమంతుడు కూడా ఉన్నారు. అయితే, లుక్ పూర్తిగా లేదు. ఈ రోజు ఆయన లుక్ రివీల్ చేశారు.
హనుమాన్ జయంతి సందర్భంగా...
Devdatta Nage First Look As Lord Hanuman - Adipurush : ఈ రోజు హనుమాన్ జయంతి! ఈ సందర్భంగా 'ఆదిపురుష్' సినిమాలో హనుమంతునిగా నటించిన దేవదత్తా నాగే ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అందులో ప్రభు శ్రీరామునిపై హనుమాన్ మదిలో ఉన్న భక్తి భావన స్పష్టంగా కనిపించింది.
త్రీడీలో 'ఆదిపురుష్' విడుదల
జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 'ఆదిపురుష్' విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున చిత్రాన్ని విడుదల చేయనున్నారు. శ్రీరాముడి అంటే హిందువులలో ఉన్న భక్తి, ప్రభాస్ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని భారీ సంఖ్యలో షోస్ వేయాలని ప్లాన్ చేస్తున్నారు. అదీ సంగతి!
టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ అండ్ కృష్ణన్ కుమార్, దర్శకుడు ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్ (Rajesh Nair)తో కలిసి ప్రభాస్ హోమ్ బ్యానర్ లాంటి యూవీ క్రియేషన్స్ సినిమాను విడుదల చేస్తోంది.
రికార్డు స్థాయిలో రిలీజుకు సన్నాహాలు!?
వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో షోలు వేసేలా 'ఆదిపురుష్' టీమ్ ప్లాన్ చేసిందట. ఇండియా మొత్తం మీద ఎనిమిది వేల థియేటర్లలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. రోజుకు సుమారు 35,000 కంటే ఎక్కువ షోస్ పడే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ ఇన్‌సైడ్ టాక్. అయితే, వివాదాల నేపథ్యంలో విడుదల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
Also Read : 'దిల్ రాజు' డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటో చెప్పేశారుగా, డైరెక్టర్ & హీరో ఎవరంటే?
టీజర్ విడుదల తర్వాత సినిమాపై ట్రోల్స్ ఎక్కువ వచ్చాయి. అందుకని, మళ్ళీ వీఎఫ్ఎక్స్ చేయడం కోసం విడుదల వాయిదా వేశారు. ఆ వివాదం పక్కన పెడితే... శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ కొత్త వివాదానికి కారణం అయ్యింది. ఆ పోస్టర్ హిందువుల మనోభావాలను దెబ్బ తీసిందని ముంబై నివాసి సంజయ్ దీనానాథ్ తివారి ఆరోపిస్తున్నారు. సకినాక పోలీస్ స్టేషనుకు న్యాయవాదులు ఆశిష్ రాయ్, పంకజ్ మిశ్రాలతో వెళ్లి కంప్లైంట్ చేశారు.
'ఆదిపురుష్' పోస్టర్‌లో ప్రభాస్ ధరించినట్టు శ్రీరాముడు వేషధారణ ఉండదని, ఆయన సహజ స్వరూపానికి భిన్నంగా దర్శకుడు చూపిస్తున్నారని, హిందూ సంస్కృతిలో సీతా లక్ష్మణ సమేత శ్రీ రామ చిత్రపటానికి ఎంతో ప్రాముఖ్యం ఉందని, దాన్ని తప్పుగా చూపించడం ద్వారా హిందువుల మనోభావాలను గాయపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై చిత్రబృందం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. 'ఆదిపురుష్' మీద కేసులు నమోదు కావడం ఇది ఏమీ కొత్త కాదు. గతంలో టీజర్ విడుదల చేసినప్పుడు చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు కేసులు వేశారు.
Also Read : గ్యాంగ్‌స్టరా? స్మగ్లరా? టెర్రరిస్టా? యాక్షన్‌తో కుమ్మేసిన అరుణ్ విజయ్ & అమీ
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
Mahesh Babu: మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ వచ్చేసింది - మాస్ స్ట్రైక్ వీడియోతో సూపర్ స్టార్ రచ్చ!
మాస్ లుక్‌లో మహేష్, ప్రభాస్‌తో కమల్ ఢీ? - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!
అనాథ పిల్లల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ - మరో మంచి పనికి సోనూసూద్ శ్రీకారం
ఓ ఇంటివాడు కాబోతున్న ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల
TSPSC Paper Leak Case: మరో 13 మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ షాక్, జీవితాంతం ఎగ్జామ్ రాయకుండా డీబార్
Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు
Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?
Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !