అన్వేషించండి

Rebel Trailer: ‘ప్రేమలు’ బ్యూటీ ‘రెబల్’ ట్రైలర్ రివ్యూ: యాక్షన్‌తో అదరగొట్టిన జీవీ ప్రకాష్, క్యూట్‌నెస్‌తో చంపేస్తున్న మమిత

Rebel Trailer Review: ఓవైపు మ్యూజిక్ తో మెస్మరైజ్ చేస్తున్న జీవీ ప్రకాశ్, మరోవైపు యాక్టింగ్ తోనూ అదరగొడుతున్నారు. తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న ‘రెబల్’ మూవీ ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

GV Prakash’s Rebel Trailer: మ్యూజిక్ డైరెక్టర్ గా స్టార్ హీరోల సినిమాలకు పని చేస్తున్న జీవీ ప్రకాష్ కుమార్, మరోవైపు హీరోగానూ రాణిస్తున్నారు. డిఫరెంట్ కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆయన ‘రెబల్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటి వరకు క్లాస్ క్యారెక్టర్స్ పోషించిన ఆయన, ఇప్పుడు మాస్ యాక్టింగ్ తో మెస్మరైజ్ చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా థియేటర్లలో విడుదలకానున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. 

‘రెబల్’ ట్రైలర్ విడుదల చేసిన ధనుష్

తమిళ స్టార్ హీరో ధనుష్ ‘రెబల్’ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను విడుదల చేశారు. “ప్రియమైన జీవీ ప్రకాష్ తో పాటు ఆయన ‘రెబల్‌’ టీమ్ కు శుభాకాంక్షలు. ఈ సినిమా మార్చి 22 నుంచి థియేటర్లలోకి రానుంది” అని ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. ఈ మేరకు సినిమా ట్రైలర్‌ను ట్విట్టర్ వేదిగా షేర్ చేశారు. ధనుష్ ట్వీట్ కు ప్రకాష్ రియాక్ట్ అయ్యారు. థ్యాంక్యూ మైడియర్ బ్రదర్’ అంటూ కామెంట్ పెట్టారు.   

పంచెకట్టు, చేతిలో కత్తి- ఆకట్టుకుంటున్నన ‘రెబల్’ ట్రైలర్

2 నిమిషాల 17 సెకన్ల నిడివి ఉన్న ‘రెబల్’లో జీవీ ప్రకాష్ మాస్ యాక్షన్ తో అదరగొట్టారు. పంచెకట్టు, చేతిలో కత్తితో సరికొత్తగా కనిపించాడు. ట్రైలర్ అంతా ప్రేమ, క్యాంపస్ రాజకీయాలు, కొట్లాటల చుట్టూనే తిరుగుతూ కనిపించింది.  మున్నార్‌కు చెందిన తమిళ యువకుడు కతిరేషన్‌గా ప్రకాష్ నటించారు. ఆయన ఉన్నత చదువు కోసం పాలక్కాడ్‌కు వెళ్తారు. అక్కడే మమితతో ప్రేమలో పడతారు.

తమిళులు, స్థానికుల మధ్య గొడవ జరగడంతో కథ కొత్త మలుపు తిరుగుతుంది. కాలేజీ గొడవగా మొదలై, రాజకీయ నాయకులు, పోలీసుల జోక్యంతో మరింత ఉధృతంగా మారుతుంది. ఇదే సమయంలో కతిరేషన్ తిరుగుబాటు నాయకుడిగా మారుతారు. ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనేది సినిమాలో చూపించారు. యదార్ధ సంఘటన ఆధారంగా తీసిన ఈ సినిమాపై ట్రైలర్ విడుదలతో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. క్లాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఈ సినిమాతో మాస్ హీరోగానూ సత్తా చాటుతారని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

భారీ చిత్రాలతో జీవీ ప్రకాష్ ఫుల్ బిజీ

విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ‘తంగళన్’, కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’, అక్షయ్ కుమార్ ’సర్ఫీరా’, దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’, నితిన్ ‘రాబిన్ హుడ్’, సూర్య హీరోగా నటిస్తున్న ఓ కొత్త సినిమాతో పాటు పలు తెలుగు, తమిళ్, హిందీ సినిమాలకు ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘ఇడిముజక్కం’, ‘13’, ‘కాల్వన్ అండ్ డియర్’ చిత్రాల్లో నటిస్తున్నారు.  ఇక ‘రెబల్’ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ లో జ్ఞానవేల్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ సరసన మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. కరుణాస్, సుబ్రమణి శివ, షాలు రహీం సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాషే సంగీతం అందిస్తున్నారు.   

Read Also: కుమారి ఆంటీనా మజాకా - సీరియల్స్‌‌‌లో ఎంట్రీ, వైరల్ అవుతున్న ప్రోమో

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget