Kumari Aunty: కుమారి ఆంటీనా మజాకా - సీరియల్స్‌లో ఎంట్రీ, వైరల్ అవుతున్న ప్రోమో
Kumari Aunty: ఫుడ్ బిజినెస్ తో సోషల్ మీడియాలో పాపులర్ అయిన కుమారి ఆంటీ క్రేజ్ రోజు రోజుకు మరింత పెరుగుతోంది. ఇప్పటికే పలు టీవీ షోస్ లో అడుగు పెట్టిన ఆమె, ఇప్పుడు సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
Kumari Aunty Serial Entry: కుమారి ఆంటీ. తెలుగు జనాలు పెద్దగా పరిచయం అవసరం లేదు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈమె గురించే చర్చ. రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ తో ఫేమస్ అయిన కుమారి ఆంటీ, పలు సంచలనాలకు కారణం అయ్యింది. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆమె విషయంలో జోక్యం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఉన్న క్రేజ్ ను వాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి టీవీ చానెళ్లు. ఇప్పటి వరకు పలు షోలలో పాల్గొన్న ఆమె, ఇప్పుడు ఏకంగా సీరియల్స్ లోకి అడుగు పెట్టడం విశేషం.
సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీగా మారిన కుమారి ఆంటీ
కుమారి ఆంటీ ఒకే ఒక్కడ డైలాగ్ తో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. “మీది మొత్తం థౌంజెండ్ అయ్యింది. రెండు లివర్లు ఎక్స్ ట్రా!” ఈ మాట సోషల్ మీడియాలో మోత మోగింది. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా ఒకటేమిటీ అన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్లలోనూ ఆమె హల్ చల్ చేసింది. ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిపోయింది. హైదరాబాద్ ప్రైమ్ ఏరియాలో రోడ్ సైడ్ చిన్నఫుడ్ బిజినెస్ నడుపుతున్న ఆమె దగ్గరికి ఫుడ్ కోసం జనాలు పోటెత్తారు. ఆమె బిజినెస్ ముందు స్టార్ హోటళ్లు కూడా వెలవెలబోయాయి. కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు, ఆమె హోటల్ ను క్లోజ్ చేయాలని ఆదేశించారు.
ఎవరి మీద ఆధారపడకుండా, తన బతుకు తాను బతుకుతుంటే ఫుడ్ బిజినెస్ క్లోజ్ చేయాలని పోలీసులు చెప్పడం దారుణం అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి చేరింది. కుమారీ ఆంటీ ఫుడ్ బిజినెస్ విషయంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమెకు ఎలాంటి ఇబ్బందులు కలిగింకూడదన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సొంతంగా బిజినెస్ చేసుకుంటూ కష్టపడే వారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. దీంతో మళ్లీ కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ కొనసాగిస్తున్నారు.
సీరియల్స్ లోకి అడుగు పెట్టిన కుమారి ఆంటీ
ఇక కుమారి ఆంటీకి ఉన్న క్రేజ్ ను వాడుకునే పనిలో పడ్డాయి టీవీ చానెళ్లు. ఇప్పటికే పలు చానెళ్లలో ప్రసారం అయ్యే షోలలో పాల్గొన్నారు. ఇప్పుడు ఏకంగా సీరియల్స్ లోకి అడుగు పెట్టారు. తాజాగా ఆమె జీ తెలుగులో టెలీకాస్ట్ అవుతున్న ‘రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’ సీరియల్ లో గెస్టుగా కనిపించారు. త్వరలో టెలీకాస్ట్ కానున్న ఈ సీరియల్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మొత్తంగా కుమారీ ఆంటీ సీరియల్స్ ను కూడా కవర్ చేసింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ సీరియల్ ప్రోమో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
View this post on Instagram
Read Also: సూర్య, జ్యోతిక ఆస్తులు అన్ని కోట్లా? భార్యాభర్తలు బాగానే సంపాదిస్తున్నారుగా!