Guntur Kaaram: ట్రోల్స్‌పై గుంటూరు కారం నిర్మాత ఎటకారం - మహేష్ ఫ్యాన్స్‌ను కోతులతో కంపేర్ చేశారా?
Naga Vamsi on Oh My Baby song trolls: 'ఓ మై బేబీ' పాట మీద విమర్శలు రావడం, లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి ట్విట్టర్ అకౌంట్ డీయాక్టివేట్ చేయడం తెలిసిన విషయాలే. ఈ వివాదంపై నాగవంశీ ఇవాళ రియాక్ట్ అయ్యారు.
Oh My baby song Guntur kaaram trolls, producer Naga Vamsi reaction: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) అభిమానులు అందరికీ 'ఓ మై బేబీ' సాంగ్ నచ్చలేదు. ఆ విషయంలో మరో సందేహం అవసరం లేదు. 'గుంటూరు కారం' సినిమాలో రెండో పాట విడుదలైన తర్వాత నుంచి సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ కనిపించింది.
ట్రోల్స్ చేస్తున్న మహేష్ అభిమానులు!
'ఓ మై బేబీ' సాంగ్ విడుదలైన మరు క్షణం నుంచి ట్రోల్స్ మొదలు అయ్యాయి. ఆ సాంగ్ ఏంటి? ఆ ట్యూన్ ఏంటి? ఆ లిరిక్స్ ఏంటి? అంటూ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత దర్శకుడు తమన్, గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి, నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) సోదరుని కుమారుడు నాగవంశీపై విమర్శలు చేస్తున్నారు.
Oh My Baby Song Trolls Effect: 'ఓ మై బేబీ' సాంగ్ నిడివి తక్కువ ఉంది తప్ప ఆ పాటకు ఏం తక్కువయిందని? అంటూ రామజోగయ్య శాస్త్రి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రాసెస్ తెలియని ప్రతి ఒక్కరూ కామెంట్ చేసే వాళ్ళు, జడ్జ్ చేసే వాళ్ళే అని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు కుక్కల చేతికి సోషల్ మీడియా వెళుతోందని అంటూ ఘాటుగా విమర్శలు చేసిన మహేష్ బాబు అభిమానికి రిప్లై ఇచ్చారు. విమర్శలు మరింత ఎక్కువ కావడంతో ఆయన ట్విట్టర్ డీయాక్టివేట్ చేశారు. ఇవాళ విమర్శలకు నిర్మాత నాగవంశీ బదులు ఇచ్చారు.
మేం ఏం చేస్తున్నామో మాకు తెలుసు!
''మేం ఏం చేస్తున్నామో మాకు తెలుసు. జనవరి 12న కలుద్దాం'' అని శుక్రవారం ఉదయం సూర్యదేవర నాగవంశీ ట్వీట్ చేశారు. అయితే... ఆ ట్వీట్ పూర్తి చూస్తే? అందులో ఓ జిఫ్ ఉంది. అందులో వీడియో, మ్యాటర్ వైరల్ అయ్యే కంటెంట్.
Also Read: పది మంది అందాల భామలు... పాపం, ఫస్ట్ సినిమాయే డిజాస్టర్ - ఈ అందగత్తెలకు కలిసిరాని 2023!
''కోతి కథ నుంచి తెలుసుకున్న నీతి ఏమిటంటే... ఎవరితోనూ ఫైట్ చేయవద్దు. ఆర్గ్యూ (వాదించడం) చేయవద్దు. మన పని మనం చేయాలి'' అని పేర్కొన్నారు. 'యానిమల్' సినిమాలో రణబీర్ కపూర్ లాస్ట్ సీన్ జిఫ్ యాడ్ చేశారు.
Also Read: పిట్ట కొంచెం... కూత ఘనం! భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!
We know what we r doing! ✌️
— Naga Vamsi (@vamsi84) December 15, 2023
See you guys on 12th jan pic.twitter.com/IKJwyPQuQD
12th na emaina theda jarigithe nee nunde start Chestham.... https://t.co/XALwXdH3yc pic.twitter.com/yoUtWOm8mm
— Viking (@ronaldo_mb_dhf) December 15, 2023
సూర్యదేవర నాగవంశీ ట్వీట్ చాలా మందికి నచ్చలేదు. మరి, జనవరి 12న సినిమా రిజల్ట్ తేడా అయితే బాగోదని కొందరు ఫ్యాన్స్ ట్వీట్ చేస్తుంటే... మరికొందరు ఇది కరెక్ట్ కాదంటూ రియాక్ట్ అవుతున్నారు. నాగవంశీ యాటిట్యూడ్ మీద విమర్శలు వస్తున్నాయి.