Gorre Puranam Teaser: సుహాస్.. ‘గొర్రె పురాణం’ టీజర్ - చివరికి జగన్‌ను కూడా వదల్లేదుగా!
Gorre Puranam: ఎక్కువగా కొత్త కొత్త కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించడాన్ని ఇష్టపడే సుహాస్.. ‘గొర్రె పురాణం’ అనే మరో కొత్త కథతో సిద్ధమయ్యాడు. తాజాగా దీనికి సంబంధించిన టీజర్ విడుదలయ్యింది.
Gorre Puranam Teaser Out Now: కొత్త కొత్త కథలను ఎంచుకుంటూ హీరోగా తనకంటూ ఒక మార్క్‌ను క్రియేట్ చేసుకున్నాడు సుహాస్. తను కథను ఎంచుకున్నాడంటే కచ్చితంగా అందులో అందరికీ నచ్చే అంశం ఏదైనా ఉంటుంది లేదా అందులో అందరికీ కనెక్ట్ అయ్యే ఫీల్ ఉంటుంది అని చాలామంది ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. ప్రస్తుతం సుహాస్ చేతిలో దాదాపు నాలుగుకు పైగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒక మూవీ సెట్స్‌పై ఉండగానే బ్యాక్ టు బ్యాక్ కథలను ఓకే చేసి వాటి షూటింగ్‌లో బిజీగా ఉంటున్నాడు సుహాస్. అలా తను నటించిన మరో డిఫరెంట్ కథా చిత్రం ‘గొర్రె పురాణం’. తాజాగా దీనికి సంబంధించిన టీజర్ విడుదలయ్యింది.
మతాల మధ్య చిచ్చు..
టైటిల్‌లో ఉన్నట్టుగానే ‘గొర్రె పురాణం’ అంటూ ఇందులో ఒక గొర్రె.. కీలక పాత్ర పోషిస్తుంది. ‘‘ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.. ఒక గ్రామంలో రెండు మతాల మధ్య చిచ్చుపెట్టింది గొర్రె’’ అనే వాయిస్ ఓవర్‌తో ‘గొర్రె పురాణం’ టీజర్ ప్రారంభమవుతుంది. ఒక గొర్రెను ఊరి మధ్యలో కట్టేసి హిందువులు, ముస్లింలు ఆ గొర్రె మాది అంటూ మాది అంటూ గొడవపడుతుంటారు. అందులో హిందువుల తరపున ఒక వ్యక్తి ‘‘తిరిగొచ్చే ప్రసక్తే లేదు కావాలంటే 10 వేలు ఇస్తాం’’ అని గొడవను ఆపడానికి ప్రయత్నిస్తాడు. ‘‘ఇది 10 వేలకు సంబంధించింది కాదు 10 కోట్లు ఇచ్చినా కూడా ఇవ్వము’’ అని ఒక ముస్లిం వ్యక్తి అరుస్తాడు.
గొర్రెను కాపాడేది ఎవరు.?
అలా ఒక ఊరిలో గొర్రె వల్ల హిందువులకు, ముస్లింలకు గొడవ జరుగుతుంది. కానీ ఆ గొడవ ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని ట్రైలర్‌లో రివీల్ చేయలేదు. ఆ రెండు మతాల వ్యక్తుల ఒకరి మీద మరొకరు పడి కొట్టుకునేంత వరకు ఈ గొడవ వెళ్తుంది. ‘గొర్రె పురాణం’లోని టీజర్‌లో ఈ తెల్ల గొర్రెకు తోడుగా మరో గొర్రె చేరుతుంది. ‘‘కుక్క చచ్చిపోయి మన ఊరు పేరు పేపర్‌లో వచ్చేలా చేసింది’’ అని ఆ గొర్రె అనగా.. ‘‘అది కేవలం పేపర్ రా.. నేను మన ఊరి పేరు టీవీలో వచ్చేలా చేస్తా’’ అని హీరో గొర్రె అంటుంది. ఆ తర్వాత సీన్‌లోనే అందరి నుండి తప్పించుకోవడానికి గొర్రె పరిగెడుతూ ఉంటుంది. ‘‘ఇప్పుడు నాకు ఎవరు దిక్కు ఎవరైనా సాయం చేస్తే బాగుండు’’ అనుకుంటుండగానే సుహాస్ ఎంట్రీ ఇస్తాడు.
మంచివాడే కానీ హంతకుడు..
‘గొర్రె పురాణం’ టీజర్‌లో జైలులో ఖైదీ డ్రెస్‌లో సుహాస్ ఎంట్రీ ఇస్తాడు. ‘‘నువ్వు మంచివాడివి నీకు అంతా మంచే జరుగుతుంది’’ అనే డైలాగ్‌తో టీజర్‌లో సుహాస్ క్యారెక్టర్ గురించి చెప్పడానికి ప్రయత్నించాడు దర్శకుడు బాబీ. కానీ ఆ తర్వాత సీన్‌లోనే సుహాస్.. ఒక వ్యక్తిని హత్య చేసి తప్పించుకుంటాడు. అలా ‘గొర్రె పురాణం’ టీజర్‌ను చాలా ఇంట్రెస్టింగ్‌గా కట్ చేశారు మేకర్స్. గొర్రె వల్ల ఊరిలో రెండు మతాల మధ్య గొడవలు ఎందుకు జరిగాయి? సుహాస్ అసలు జైలులో ఎందుకు ఉన్నాడు? ఇలా ఎన్నో ప్రశ్నలతో టీజర్ ముగిసింది. ఫోకల్ వెంచర్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో హీరో గొర్రెకు యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం ప్లస్‌గా మారింది. చివర్లో.. ఏపీ సీఎం జగన్ వైరల్ డైలాగ్‌ను సైతం టీజర్‌లో వాడేశారు.
Also Read: యూట్యూబ్‌లో దూసుకుపోతున్న చంద్రబాబు బయోపిక్ 'తెలుగోడు'