అన్వేషించండి

Chandrababu Biopic : యూట్యూబ్‌లో దూసుకుపోతున్న చంద్రబాబు బయోపిక్ 'తెలుగోడు'

Chandrababu Biopic : ఇప్పుడు ఏపీలో ఎన్నిక‌ల సీజ‌న్ న‌డుస్తోంది. దీంతో పోటా పోటీగా పొలిటిక‌ల్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దాంట్లో భాగంగా ఇప్పుడు మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు బ‌యోపిక్ రిలీజ్ అయ్యింది.

Chandrababu Biopic Telugodu: ఇప్పుడు ఏపీలో ఎన్నిక‌ల హీట్ న‌డుస్తోంది. మే 13న అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి. అయితే, పొలిటిక‌ల్ సినిమా హీట్ కూడా న‌డుస్తోంద‌ని చెప్పాలి. ఇప్ప‌టికే వ్యూహం, శ‌ప‌థం, యాత్ర - 2 లాంటి సినిమాలు రిలీజైతే.. ఇప్పుడిక ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు బ‌యోపిక్  'తెలుగోడు' తీశారు. ఆ సినిమాని య్యూట్యూబ్ వేదికగా రిలీజ్ చేశారు. అయితే, ఇప్పుడు ఆ సినిమా య్యూట్యూబ్ లో తెగ వైర‌ల్ అవుతోంది. సినిమా వివ‌రాలు ఒక‌సారి చూద్దాం. 

విజ‌న‌రీ లీడ‌ర్.. 

నారా చంద్ర‌బాబు నాయుడు తెలుగు రాజ‌కీయాల్లో అనుభ‌వం ఉన్న వ్య‌క్తి. ఆయ‌న్ని అంద‌రూ విజ‌న‌రీ లీడ‌ర్ అని పిలుస్తారు. ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన సంస్కరణలు, భావితరాల భవిష్యత్తు కోసం చేప‌ట్టిన డ‌వ‌ల‌ప్ మెంట్ గురించి ఇప్ప‌టికీ మాట్లాడుకుంటారు. ఆ విష‌యాల‌నే ఈ సినిమాలో తెర‌కెక్కించారు మేక‌ర్స్. 'తెలుగోడు'. ప్రపంచంపై తెలుగోడి సంతకం అనేది ఉపశీర్షిక. విజయవాణి ప్రొడక్షన్స్ పతాకంపై చీలా వేణుగోపాల్ సమర్పణలో సినిమా తెరకెక్కింది.  డాక్టర్ వెంకీ మేడసాని కథ, కథనం, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం వ‌హించారు ఈసినిమాకి. గురువారం ఉద‌యం ఈ సినిమాని యూట్యూబ్‌లో విడుదల చేశారు. 

చంద్ర‌బాబుపై అభిమానంతో.. 

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేష‌న్ స‌ర్జ‌న్ వెంకీ మెడ‌సాని ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సినిమా ఫీల్డ్ లో ఎలాంటి అనుభ‌వం లేన‌ప్ప‌టికీ.. కేవ‌లం చంద్ర‌బాబుపై అభిమానంతో ఈ సినిమా తెర‌కెక్కించారు ఆయ‌న‌. ఈ సినిమా విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ''చంద్రబాబు గారి జీవితంలో, ఆయన పరిపాలనలో చేపట్టిన సంస్కరణల వల్ల ప్రజల జీవితాలు మారాయి. నన్ను ఆ అంశం ఎక్కువ ఆకర్షించింది. చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి కారణంగా నగరాలకు వచ్చిన పల్లె ప్రజలు ఉన్నతమైన జీవితం సాగిస్తున్నారు. అభివృద్ధి అంటే కేవలం బిల్డింగ్స్ మాత్రమే కాదు. సమాజంలో వచ్చిన మార్పు కూడా! ఎటువంటి సామాజిక అసమానతలు లేకుండా అందరూ ఒక్కటిగా బతుకుతున్నారు. ఆ పాయింట్ మీద సినిమా తీశా. అభివృద్ధి అందరినీ ఒక్కటి చేస్తుందనే అంశం, నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆలోచించారు? అనేది 'తెలుగోడు' కాన్సెప్ట్.  ప్రపంచానికి తెలియని ఓ ప్రాంతాన్ని ప్రపంచానికి గమ్యస్థానంగా మార్చాలని భావించిన ఓ నాయకుడి కథ మా సినిమా" అని డైరెక్ట‌ర్ అన్నారు. 

ఐదారు నెలల క్రితం సినిమా తీయాలని అనుకున్నాన‌ని చెప్పారు వెంకీ మెడ‌సాని.  కథ సిద్ధం చేశాక కొందరు నిర్మాతలను కలిస్తే.. రాజకీయ నాయకుడి సినిమా తీస్తే విజయం సాధించదని అన్నారు. కానీ, "నా కంటెంట్ మీద నమ్మకంతో ప్రజలకు చేరువ అవుతుందని తీశాను. ఎక్కువ మంది ప్రజలకు సినిమా చేరాలనే ఉద్దేశంతో యూట్యూబ్ రిలీజ్ చేశాం. నేను సినిమా తీయగలననే కాన్ఫిడెన్స్ ఈ సినిమా ఇచ్చింది'' అని చెప్పారు. ఇక ఈ సినిమాలో చంద్రబాబు పాత్రలో వినోద్ న‌టించగా..  ఛాయాగ్రహణం మల్లిక్ చంద్ర, సంగీతం రాజేష్ రాజ్, కథ -  స్క్రీన్ ప్లే - డైలాగ్స్ - ప్రొడ్యూసర్ డాక్టర్ వెంకీ మేడసాని. 

Also Read: విజయ్ దేవరకొండతో 'బాహుబలి' రేంజ్ హిస్టారికల్ సినిమా!

టాప్ హెడ్ లైన్స్

Second Marriage OTT : ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Mahesh Babu : బన్నీ, రామ్ చరణ్, నేను... ఇప్పుడు జయకృష్ణ - దత్తు గారి ప్లాన్ అదుర్స్... శ్రీనివాస మంగాపురంపై మహేశ్ బాబు రియాక్షన్
బన్నీ, రామ్ చరణ్, నేను... ఇప్పుడు జయకృష్ణ - దత్తు గారి ప్లాన్ అదుర్స్... శ్రీనివాస మంగాపురంపై మహేశ్ బాబు రియాక్షన్
Chennai Love Story OTT : చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dharmendra Pradhan Resignation: విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
CSK-MI Trade War: హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - యాక్సిలరేషన్‌ టెస్ట్‌లో ఏ కారు గెలిచింది?
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - రియల్‌ రోడ్‌ టెస్ట్‌లో ఏ కారు పికప్‌ చూపించింది?
Chennai Love Story Collections: చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Breaking News: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
Embed widget