అన్వేషించండి

Gopichand : ఆ ఒక్క ఎపిసోడ్ వల్లే సినిమా ప్లాఫ్... 'భీమా' డిజాస్టర్ కావడంపై గోపీచంద్ కామెంట్స్  

ఆ ఒక్క సీన్ వల్ల సినిమా ప్లాఫ్ అయ్యింది అంటూ 'భీమా' మూవీ డిజాస్టర్ కావడానికి గల కారణం ఏంటో బయట పెట్టారు హీరో గోపీచంద్.

టాలీవుడ్ లోని కొంతమంది హీరోలు ఫ్యాన్ ఇండియా రేస్ లో దూసుకెళ్తుంటే, మరి కొంతమంది హీరోలు మాత్రం హిట్టు కోసం తహతహలాడుతున్నారు. ఆ లిస్టులో హీరో గోపీచంద్ కూడా ఉన్నారు. ఆయన హీరోగా నటించిన సినిమాలేవి ఇటీవల కాలంలో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకోలేకపోయాయి. ఇక రీసెంట్ గా వచ్చిన 'భీమా' మూవీ రిలీజ్ కి ముందే మంచి బజ్ క్రియేట్ చేసినప్పటికీ, రిలీజ్ అయ్యాక మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. గోపీచంద్ తాను నటిస్తున్న 'విశ్వం' మూవీ ప్రమోషన్లలో ఈ మూవీ గురించి స్పందించారు.

ఆ ఒక్క ఎపిసోడ్ సినిమాను నాశనం చేసింది... 
గోపీచంద్ హీరోగా, శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'విశ్వం'. దాదాపు ఆరేళ్ల తర్వాత 'విశ్వం' మూవీతో మళ్లీ డైరెక్టర్ గా రీ ఎంట్రీ ఇస్తున్నారు శ్రీనువైట్ల. ఈ సినిమాలో గోపీచంద్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా, వేణు దోనేపూడి, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగు పూర్తి చేసుకున్న 'విశ్వం' మూవీ దసరా కానుకగా అక్టోబర్ 11న రిలీజ్ కాబోతోంది. ఇటీవల కాలంలో రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి హైప్ ను  క్రియేట్ చేసింది. ముఖ్యంగా ట్రైలర్ కామెడీ, యాక్షన్ అంశాలతో ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. కాగా తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా గోపీచంద్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ఆయన 'భీమా' మూవీతో పాటు గతంలో తాను చేసిన డిజాస్టర్ మూవీ 'రామబాణం' గురించి కూడా స్పందించారు.

Read Also : Devara 10 Days Collections: 'దేవర' కలెక్షన్ల అరాచకం - 10 రోజుల్లోనే 500 కోట్లకు అతి చేరువలో!

'విశ్వం' మూవీ హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారా? ఈ సినిమాతో నైనా బ్లాక్ బస్టర్ హిట్ కొడతామని అనుకుంటున్నారా?' అనే ప్రశ్నకు గోపీచంద్ స్పందిస్తూ 'నమ్మకం లేకపోతే జీవితంలో ముందడుగు వేయలేము' అంటూ సమాధానం చెప్పారు. గోపీచంద్ మాట్లాడుతూ 'భీమా మూవీ గురించి మాట్లాడుకుంటే.. నేను దానిని నమ్మాను. కానీ అందులో ఒక చిన్న ఎపిసోడ్ తేడా కొట్టిందని మాకు తెలుసు. మిగతాది బాగున్నప్పటికీ అది వర్కౌట్ కాకుండా ఈ ఒక్క ఎపిసోడ్ సినిమాను ఓవర్ షాడో చేసింది' అని చెప్పుకొచ్చారు. 'అయితే రిజల్ట్ మీకు ముందే తెలుసా ?' అని ప్రశ్నించగా.. 'ఆ బ్లాక్ బాగాలేదనే విషయం మాకు ముందే తెలుస' అన్నారు. ఇక 'రామబాణం' మూవీ రిజల్ట్ కూడా మీకు ముందే తెలుసు కదా? అని అడగ్గా... 'అది ముందే తెలిసింది. కానీ ఏమీ చేయలేం.. అయిపోయింది అది అంతే' అంటూ గతంలో తన సినిమాల విషయంలో జరిగిన మిస్టేక్స్ ని గుర్తు చేసుకున్నారు. 

ఆ హీరోకి మాత్రమే విలన్ గా... 
ఇక ఇదే ఇంటర్వ్యూలో మీ అభిమానులు అందరూ కోరుకుంటున్నట్టుగా మరోసారి ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటారా ? అన్న ప్రశ్నకి గోపీచంద్ 'తప్పకుండా షేర్ చేసుకుంటాను' అని చెప్పారు. అయితే ప్రస్తుతం ఉన్న హీరోలలో ప్రభాస్ కి మాత్రమే తాను విలన్ గా నటించడానికి సిద్ధంగా ఉన్నానని ఈ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు గోపీచంద్. గతంలో గోపీచంద్.  ప్రభాస్ కాంబినేషన్లో 'వర్షం' మూవీ వచ్చిన విషయం తెలిసిందే. మరి మరోసారి వీరిద్దరి కాంబో ఎప్పుడు రిపీట్ అవుతుందో చూడాలి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRB JE 2024 Exam Date: జూనియర్ ఇంజినీర్ సహా పలు పోస్టులకు ఎగ్జామ్ తేదీలు ప్రకటించిన రైల్వే బోర్డు
జూనియర్ ఇంజినీర్ సహా పలు పోస్టులకు ఎగ్జామ్ తేదీలు ప్రకటించిన రైల్వే బోర్డు
Telangana ప్రభుత్వం కీలక నిర్ణయం - HMDA పరిధిలో చెరువుల విస్తీర్ణం గుర్తించేందుకు సర్వే
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం - HMDAలో చెరువుల FTL, బఫర్ జోన్ గుర్తించేందుకు సర్వే
Nobel Prize 2024: వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి-మైక్రో ఆర్‌ఎన్‌ఏను కనుగొన్నందుకు అత్యన్నత పురస్కారం
వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి-మైక్రో ఆర్‌ఎన్‌ఏను కనుగొన్నందుకు అత్యన్నత పురస్కారం
Nanidgam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ మళ్లీ అరెస్ట్‌, 2 వారాలు రిమాండ్
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ మళ్లీ అరెస్ట్‌, 2 వారాలు రిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మెగా కంపౌండ్‌కి ప్రకాశ్ రాజ్ దూరమైనట్టేనా, పవన్‌తో ఎందుకీ గొడవ?మైసూరు దసరా వేడుకల్లో ఏనుగులకు స్పెషల్ ట్రీట్‌మెంట్బీజేపీకి షాక్ ఇచ్చిన ఎగ్జిట్‌ పోల్స్, కశ్మీర్‌లో కథ అడ్డం తిరిగిందా?Siyaram Baba Viral Video 188 Years | 188ఏళ్ల సాధువు అంటూ వైరల్ అవుతున్న వీడియో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRB JE 2024 Exam Date: జూనియర్ ఇంజినీర్ సహా పలు పోస్టులకు ఎగ్జామ్ తేదీలు ప్రకటించిన రైల్వే బోర్డు
జూనియర్ ఇంజినీర్ సహా పలు పోస్టులకు ఎగ్జామ్ తేదీలు ప్రకటించిన రైల్వే బోర్డు
Telangana ప్రభుత్వం కీలక నిర్ణయం - HMDA పరిధిలో చెరువుల విస్తీర్ణం గుర్తించేందుకు సర్వే
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం - HMDAలో చెరువుల FTL, బఫర్ జోన్ గుర్తించేందుకు సర్వే
Nobel Prize 2024: వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి-మైక్రో ఆర్‌ఎన్‌ఏను కనుగొన్నందుకు అత్యన్నత పురస్కారం
వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి-మైక్రో ఆర్‌ఎన్‌ఏను కనుగొన్నందుకు అత్యన్నత పురస్కారం
Nanidgam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ మళ్లీ అరెస్ట్‌, 2 వారాలు రిమాండ్
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ మళ్లీ అరెస్ట్‌, 2 వారాలు రిమాండ్
Gopichand : ఆ ఒక్క ఎపిసోడ్ వల్లే సినిమా ప్లాఫ్... 'భీమా' డిజాస్టర్ కావడంపై గోపీచంద్ కామెంట్స్  
ఆ ఒక్క ఎపిసోడ్ వల్లే సినిమా ప్లాఫ్... 'విశ్వం' ప్రమోషన్లలో గోపీచంద్ - 'భీమా' డిజాస్టర్ కావడంపై కామెంట్స్  
Free Fire Max Newbie Mission: ఫ్రీ ఫైర్‌లో ఉచితంగా బండిల్స్ పొందడం ఎలా - ఇలా చేస్తే సరిపోతుంది!
ఫ్రీ ఫైర్‌లో ఉచితంగా బండిల్స్ పొందడం ఎలా - ఇలా చేస్తే సరిపోతుంది!
Zomato CEO Deepinder Goyal :  అనుభవమైతేనే తత్వం బోధపడుతుంది - డెలివరీ ఏజెంట్‌గా మారి కష్టాలు తెలుసుకున్న జొమాటో సీఈవో !
అనుభవమైతేనే తత్వం బోధపడుతుంది - డెలివరీ ఏజెంట్‌గా మారి కష్టాలు తెలుసుకున్న జొమాటో సీఈవో !
Nagarjuna : వంద కోట్లు కట్టాల్సిందే - మంగళవారం కోర్టుకు నాగార్జున - కొండా సురేఖపై అదే పోరాటం !
వంద కోట్లు కట్టాల్సిందే - మంగళవారం కోర్టుకు నాగార్జున - కొండా సురేఖపై అదే పోరాటం !
Embed widget