Gopichand 33 Movie Glimplse: యోధుడిగా 'గోపీచంద్' - 'ఘాజీ' డైరెక్టర్ కొత్త మూవీలో డిఫరెంట్‌గా.. గ్లింప్స్, పోస్టర్ చూశారా?
Gopichand: టాలీవుడ్ మాచో స్టార్ గోపీచంద్, 'ఘాజీ' ఫేం సంకల్ప్ రెడ్డి కాంబోలో వస్తోన్న లేటెస్ట్ మూవీపై బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ పోస్టర్, గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

Gopichand's 33rd Movie Glimpse Poster Released: టాలీవుడ్ మాచో స్టార్ గోపీచంద్, 'ఘాజీ' ఫేం సంకల్ప్ రెడ్డి కాంబోలో కొత్త మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ ప్రారంభం కాగా.. గోపీచంద్ బర్త్ డే సందర్భంగా మూవీ టీం బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. మూవీ నుంచి ఆయన పోస్టర్, గ్లింప్స్ రిలీజ్ చేసింది.
డిఫరెంట్ లుక్‌లో గోపీచంద్
ఇప్పటివరకూ ఎన్నడూ లేని రీతిలో ఈ మూవీ '#Gopichand33' వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతుండగా.. గోపీచంద్ డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. పొడవాటి జుట్టు, గడ్డం, ఉగ్ర సింధూరం, గంభీరంతో కూడిన కళ్లు.. ఇలా ఓ యుద్ధభూమిలో ధీరుడిలా గోపీచంద్ కనిపించారు. ఈ లుక్ చూసిన ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మాచో స్టార్ డిఫరెంట్ లుక్ అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు.
He is ready to ignite a revolution ❤️🔥
— Srinivasaa Silver Screen (@SS_Screens) June 12, 2025
Unleashing the Fierce Warrior ⚔️
Here's #Gopichand33 Birthday Glimpse🐎
▶️ https://t.co/518Aokg1fv
Happy Birthday to the one who shapes his own path and conquers destiny, our Macho Star @YoursGopichand!🎉💥
A Historic Epic is in the… pic.twitter.com/6s4RdPXIBT
గ్లింప్స్.. అదుర్స్..
7వ శతాబ్దంలో జరిగిన ఓ ముఖ్యమైన చారిత్రక సంఘటనను ఆధారంగా చేసుకుని పవర్ ఫుల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. మంచు పర్వత శ్రేణుల మధ్య ఆధ్యాత్మిక, ప్రశాంతమైన వాతావరణంలో వేసిన ఓ గుడారం నుంచి బయటకు వచ్చిన ఓ యోధుడు.. తన గుర్రాన్ని ప్రేమగా నిమరడం భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటివరకూ ఎన్నడూ చూడని డిఫరెంట్ లుక్‌లో గోపీచంద్ అదరగొట్టారు. 'ధీర ధీర' అంటూ బీజీఎం వినిపిస్తుండగా.. యుద్ధభూమిలో ఓ యోధుడు ప్రశాంతంగా కనిపిస్తున్నట్లుగా గ్లింప్స్ ఉంది.
గతంలో సంకల్ప్ రెడ్డి డిఫరెంట్ కథాంశాలతో కూడిన మూవీస్‌తో ఆకట్టుకున్నారు. 'ID 71' ఆకాశంలో, 'ఘాజీ' నీటిలో, 'అంతరిక్షం' మూవీలో అంతరిక్షాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా చూపించారు. ఈ సినిమాలు విమర్శలకు ప్రశంసలు సైతం అందుకున్నాయి. ఇప్పుడు గోపీచంద్ మూవీ కూడా అంతే రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండగా.. ఈ పీరియాడిక్ డ్రామా స్టోరీ ఎలా ఉండబోతుందోనని భారీ హైప్ క్రియేట్ అవుతోంది.
ఈ మూవీని పవన్ కుమార్ సమర్పణలో 'శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్' అధినేత శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. 7వ శతాబ్ధంలో ఓ ముఖ్యమైన ఎవరికీ తెలియని ఓ చారిత్రక సంఘటనను పరిచయం చేస్తుందని మూవీ టీం తెలిపింది. ఏప్రిల్‌లో కశ్మీర్‌లోని అందమైన ప్రదేశాల్లో మొదటి షెడ్యూల్ పూర్తైంది. ఈ విజువల్స్ సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతంగా కనిపించనున్నాయి. తర్వాత షెడ్యూల్ హైదరాబాద్ లో నిర్మించిన భారీ సెట్‌లో తాజాగా ప్రారంభమైంది. త్వరలోనే నటీనటులు, ఇతర టెక్నికల్ టీం వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది.





















