అన్వేషించండి

Godzilla x Kong: ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ ట్రైలర్: ఓరి నాయనో ఇంత విధ్వంసమా? మనుషులను రక్షించేది ఎవరు?

Godzilla x Kong: The New Empire: హాలీవుడ్‌కు చెందిన మాన్‌స్టర్ యూనివర్స్‌లో ఇప్పటికీ నాలుగు చిత్రాలు విడుదలయ్యి బ్లాక్‌బస్టర్ అయ్యాయి. తాజాగా అందులో నుండి అయిదో చిత్రం విడుదలకు సిద్ధమయ్యింది.

Godzilla x Kong: The New Empire Trailer: హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అది కూడా ఫిక్షనల్ క్యారెక్టర్లతో తెరకెక్కించే యాక్షన్ థ్రిల్లర్స్ అంటే ఇష్టపడే తెలుగు ప్రేక్షకులు కూడా చాలామంది ఉన్నారు. అలా విపరీతమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న మాన్‌స్టర్ సినిమాల్లో ‘గాడ్జిల్లా x కాంగ్’ కూడా ఒకటి. ఇప్పటికే ఈ మాన్‌స్టర్ యూనివర్స్ నుండి నాలుగు సినిమాలు రాగా.. తరువాతి చిత్రం ఎప్పుడా అని ప్రేక్షకులను ఎదురుచూశారు. తాజాగా ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’కు సంబంధించిన ట్రైలర్ విడుదలయ్యి ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది. మాన్‌స్టర్ యూనివర్స్ నుండి ఫ్యాన్స్ ఏం ఆశిస్తారో.. ఈ ట్రైలర్ అచ్చం అలాగే ఉందని పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.

సీక్వెల్ వచ్చేస్తోంది..

తాజాగా 3 నిమిషాల నిడివి గల ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2021లో విడుదలయిన ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. మూడేళ్ల నుండి ఈ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మొదటి భాగంతో పోలిస్తే.. ఈ సీక్వెల్‌కు దర్శకుడు ఆడమ్ విన్‌గార్డ్ మరికొన్ని కొత్త మెరుగులు దిద్దాడు. ఇక ఈ ట్రైలర్‌లో గడ్జిల్లా, కాంగ్‌లతో పాటు కొందరు నటీనటులు కూడా కనిపించారు. ముఖ్యంగా ఇందులో డీవ్ స్టీవెన్స్ హైలెట్ అయ్యాడు. తనతో పాటు రెబెక్కా హాల్, బ్రయన్ టైరీ హెన్రీ, కెయిలీ హాటిల్ కూడా ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ ట్రైలర్‌లో కనిపించారు.

ప్రతీ భాషలో హిట్..

వార్నర్ బ్రోస్ నిర్మిస్తున్న ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ చిత్రం మార్చిలో విడుదలకు సిద్ధమయ్యింది. ఇప్పటికే గాడ్జిల్లా, కాంగ్ అనే రెండు ఫిక్షనల్ పాత్రలు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాయి. హీరో ఎవరు, విలన్ ఎవరు అనే చర్చను మొదలుపెడితే కొందరు గాడ్జిల్లాకు సపోర్ట్ చేస్తే.. కొందరు కాంగ్‌కు సపోర్ట్‌గా నిలబడతారు. అందుకే సోషల్ మీడియాలో టీమ్ గాడ్జిల్లా వర్సెస్ టీమ్ కాంగ్ అంటూ డిస్కషన్స్ కూడా నడుస్తుంటాయి. ఈ ఫ్రాంచైజ్‌లోని మొదటి భాగం అయిన ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ కేవలం ఇంగ్లీష్‌లోనే కాదు.. విడుదలయిన ప్రతీ భాషలో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది. ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఈ మూవీ కూడా అదే రేంజ్‌లో విజయం సాధిస్తుందని ప్రేక్షకులు ఫీలవుతున్నారు.

మరో మాన్‌స్టర్..

ఇప్పటికే ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ నుండి ఒక ట్రైలర్ విడుదలయ్యింది. కానీ అందులో రివీల్ చేయని కొన్ని విషయాలను తాజాగా విడుదలయిన ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ రెండో ట్రైలర్‌లో రివీల్ చేశారు మేకర్స్. మార్చి 29న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమయ్యింది. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’లో గార్జిల్లాకు, కాంగ్‌కు మధ్య యుద్ధం జరగగా.. ఈసారి ఈ రెండు మాన్‌స్టర్స్ కలిసి మరో మాన్‌స్టర్‌పై యుద్ధం చేయనున్నట్టుగా ట్రైలర్‌లో చూపించారు. దాదాపు ప్రతీ హాలీవుడ్ సినిమాలాగానే ఈ మూవీ విజువల్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. గాడ్జిల్లా, కాంగ్ మధ్య జరిగే ఫైట్ సీన్స్ విజువల్‌గా మాత్రమే కాకుండా ఫన్నీగా కూడా ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయనున్నాయని అర్థమవుతోంది.

Also Read: ‘పోచర్’ ట్రైలర్ - ఇండియాలో జరిగిన అతిపెద్ద క్రైమ్ కథ ఇది

టాప్ హెడ్ లైన్స్

Sonu Sood Reaction : ఆ మాట అని ఉంటే చాలా సిగ్గుచేటు - కంగనా కామెంట్స్ సోనూ సూద్ రియాక్షన్
ఆ మాట అని ఉంటే చాలా సిగ్గుచేటు - కంగనా కామెంట్స్ సోనూ సూద్ రియాక్షన్
Azadi 501 Series OTT : ఇండియాలోనే బిగ్గెస్ట్ స్కామ్ స్టోరీ - 6 ఎపిసోడ్స్‌తో 'ఆజాదీ 501' సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఇండియాలోనే బిగ్గెస్ట్ స్కామ్ స్టోరీ - 6 ఎపిసోడ్స్‌తో 'ఆజాదీ 501' సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
Embed widget