Geethanjali Malli Vachindhi: ఆత్మల మనోభావాలు, యూనిట్ సభ్యుల భయాలు - స్మశాన వాటిక నుంచి ప్రోగ్రామ్ షిఫ్ట్
Geethanjali Malli Vachindhi teaser launch: 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' టీజర్ స్మశాన వాటికలో విడుదల చేయాలనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
'గీతాంజలి మళ్లీ వచ్చింది' సినిమా టీజర్ (Geethanjali Malli Vachindi Teaser)ను బేగంపేట స్మశాన వాటికలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే... ఇప్పుడు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. స్మశాన వాటికలో కాకుండా దసపల్లా కన్వేషన్ సెంటర్‌లో చేయాలని ప్లాన్ చేశారు. ఈవెంట్ వెన్యూ షిఫ్ట్ చేశారు. ఎందుకంటే...
ఆత్మల మనోభావాలు...
యూనిట్ సభ్యుల భయభ్రాంతులు
''ఆత్మల ఆత్మగౌరవాన్ని, మనోభావాల్ని పరిగణలోకి తీసుకుంటూ... భయబ్రాంతులకు గురి అవుతున్న మా యూనిట్ సభ్యులను అర్థం చేసుకుంటూ... కొంత మంది స్నేహితుల, పాత్రికేయ మిత్రుల సలహా సూచనలను గౌరవిస్తూ... మా టీజర్ లాంచ్ వెన్యూను 'దసపల్లా కన్వేషన్'కు మార్చడమైనది'' అని కోన ఫిల్మ్ కార్పొరేషన్ ట్వీట్ చేసింది. ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు 'గీతాంజలి మళ్లీ వచ్చింది' టీజర్ విడుదల కానుంది.
In consideration of the graveyard's sanctity and our team's comfort, we're now hosting the #GeetanjaliMalliVachindi Teaser Launch Event at Daspalla Convention!
— Kona Film Corporation (@KonaFilmCorp) February 23, 2024
Join us tomorrow at 7 PM for an unforgettable experience 🌟
🔴 https://t.co/vJNRw9zHQU#Anjali50 @yoursanjali pic.twitter.com/CAFpJ0Jd2O
ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై విశాఖ ఎంపీ, రాజకీయ నేత ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మిస్తున్న సినిమా 'గీతాంజలి మళ్లీ వచ్చింది'. శివ తుర్లపాటి దర్శకుడు. తెలుగు అమ్మాయి అంజలి టైటిల్ పాత్రధారి. ఈ సినిమా కథానాయికగా ఆమె కు 50వది. బేగంపేట స్మశాన వాటికలో టీజర్ లాంచ్ అని అనౌన్స్ చేసిన తర్వాత రచయిత, కోన వెంకట్ సన్నిహితులు బీవీఎస్ రవి ఓ ట్వీట్ చేశారు. అది ఏమిటో చూడండి.
ఆమ్మో ఇదేదో ఆలోచించాలి .. కాకపోతే వాటికి కూడా అప్పుడప్పుడు కాసింత కాలక్షేపం కావలికదా అని..... https://t.co/2u0xuvykAj
— KONA VENKAT (@konavenkat99) February 22, 2024
త్వరలో దక్షిణాది భాషల్లో విడుదల!
ఇప్పటి వరకు ఇండియాలో వచ్చిన హారర్ కామెడీ సినిమాలతో కంపేర్ చేస్తే... ఈ 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' భారీ బడ్జెట్ సినిమా అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రాన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్... తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని కోన వెంకట్ తెలిపారు. టీజర్ విడుదల రోజున సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది.
అంజలి, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్, అలీ, సునీల్, సత్య, శ్రీకాంత్ అయ్యంగార్, రవిశంకర్, ప్రియ, ముక్కు అవినాష్, విరుపాక్ష రవి, రాహుల్ మాధవ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: కోన వెంకట్, స్క్రీన్ ప్లే: కోన వెంకట్ & భాను కిరణ్, మాటలు: భాను కిరణ్ & నందు, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, ఛాయాగ్రహణం: సుజాత సిద్ధార్థ్, కూర్పు: చోటా కె. ప్రసాద్, కళ: నార్ని శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నాగు వై, నిర్మాణ సంస్థలు: ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్, నిర్మాతలు: ఎంవీవీ సత్యనారాయణ, జీవీ, దర్శకత్వం: శివ తుర్లపాటి.