Gautami: మేము విడిపోవడానికి అదే కారణం - కమల్ హాసన్‌పై గౌతమి కామెంట్స్
Gautami - Kamal Haasan: అప్పట్లో గౌతమి, కమల్ హాసన్ లివింగ్ రిలేషన్‌షిప్, బ్రేకప్ అనేది ఒక రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా అసలు బ్రేకప్ అవ్వడానికి కారణాలు ఏంటనే విషయంపై గౌతమి స్పందించారు.
Gautami About Kamal Haasan: ఈరోజుల్లో లివింగ్ రిలేషన్‌షిప్ అనే కల్చర్ చాలా కామన్ అయిపోయింది. కానీ ఒకప్పుడు ఈ పదం పెద్దగా వినిపించేది కాదు. అలాంటి సమయంలోనే లెజెండరీ నటుడు కమల్ హాసన్, సీనియర్ నటి గౌతమి లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఆ విషయం ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో.. వారి బ్రేకప్ కూడా అంతే సంచలనంగా మారింది. అసలు వీరి బ్రేకప్ వెనుక కారణమేంటి అని గౌతమి నేరుగా చెప్పలేదు. కమల్ హాసన్ కూడా దీనిపై ఎప్పుడూ స్పందించలేదు. ఓ పాత ఇంటర్వ్యూలో గౌతమీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అప్పట్లో ఆమె ఏం చెప్పిందంటే..
క్లియర్ చేశాను..
కమల్ హాసన్‌తో రిలేషన్‌షిప్ గురించి మాట్లాడుతూ.. ‘‘మేము ఇద్దరం వేర్వేరు మనుషులం. నాకు వయసు పెరుగుతున్నకొద్దీ నా దారి ఇది, ఇలా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను అని తెలుసుకున్నాను. నాకు నచ్చినట్టుగా బ్రతకాలంటే స్వతంత్ర్యంగా ఏ దారిలో వెళ్లాలని క్లియర్ చేసుకున్నాను. అందుకే నేను దాని గురించి గౌరవంతో, నిజాయితీతో చెప్పడానికి ముందుకొచ్చాను. నన్ను ప్రపంచం ప్రశ్నించేముందు నేను అందరికీ క్లియర్ చేసేశాను. జీవితం కొత్తగా ప్రారంభించాను. నావరకు నేనెప్పుడూ నిజాయితీగా ఉన్నాను. అందుకే జరిగిందేదీ తప్పు అనుకోను’’ అని చెప్పుకొచ్చారు గౌతమి. కమల్ హాసన్‌తో బ్రేకప్ గురించి ఆమె ట్వీట్ చేసి, బ్లాగ్ రాయడం వల్లే ఈ విషయం అందరికీ తెలిసింది. అలా చేసేముందు తన మానసిక సంఘర్షణ గురించి కూడా గౌతమి బయటపెట్టారు.
బాధ కలుగుతుంది..
‘‘నేను ఆయనతో కూర్చొని మాట్లాడి నా నిర్ణయం చెప్పడంకంటే ముందే ఆ ట్వీట్ చేసేశాను. నేను పూర్తిగా క్లారిటీతోనే ఆ పనిచేశాను. కొన్ని విషయాలు తెలుసుకోవడానికి, వదిలేయడానికి నాకు చాలా సమయం పడుతుంది. అలా నేను ఇలా చేస్తేనే నా జీవితానికి నేను న్యాయం చేయగలుగుతాను, నా బిడ్డకు మంచి తల్లిగా ఉంటాను అనుకున్న తర్వాత అన్నీ వాటంతట అవే జరిగిపోయాయి. తర్వాత కూర్చొని బాధపడడం లాంటిది ఏం జరగలేదు. అదంతా ముందే అయిపోయింది, చాలాకాలంగా అవుతూనే ఉంది. జీవితాంతం అని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అలా జరగకపోతే తప్పకుండా బాధ కలుగుతుంది’’ అని తెలిపారు గౌతమి. ఇక కమల్‌పై ప్రేమ ఎలా కలిగింది అని అడగగా.. తనను ఎప్పుడూ ఒక నటుడిగా గౌరవించానని, ఇద్దరం ఒకనొకరం గౌరవించుకునే క్రమంలోనే ప్రేమ పుట్టిందని అన్నారు.
శృతి హాసన్ వల్ల కాదు..
శృతి హాసన్ వల్లే గౌతమి, కమల్ హాసన్ విడిపోయారని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. దానిపై గౌతమి స్పందిస్తూ.. తన జీవితంలో తాను తీసుకున్న నిర్ణయాలకు తానే బాధ్యత వహిస్తానని, వేరేవాళ్ల వల్ల ఒక నిర్ణయం తీసుకుంటే ఆ రిలేషన్‌షిప్‌కు విలువ ఉండదని తెలిపారు. తనకు క్యాన్సర్ ట్రీట్మెంట్ పూర్తయిన వెంటనే తానే స్వయంగా వీల్ చైర్‌లో వెళ్లి శృతి హాసన్‌ను అమెరికాలోని కాలేజ్‌లో జాయిన్ చేసి వచ్చానని గుర్తుచేసుకున్నారు. కమల్ హాసన్‌కు వేరే అమ్మాయితో అఫైర్ ఉండడం వల్లే బ్రేకప్ అయ్యిందనే వార్తపై కూడా గౌతమి స్పందించారు. తన రిలేషన్‌షిప్ దూరం అయిపోవడానికి మూడో మనిషి కారణం కాదని, మనుషులే మారారని అన్నారు. తనే మారిందని కూడా ప్రేక్షకులు అనుకోవచ్చు అని సమాధానమిచ్చారు గౌతమి. ఆ నిర్ణయం వల్ల తాను కూడా బాధపడ్డానని తెలిపారు.
Also Read: దీపికా చేయకపోతే ప్రెగ్నెంట్‌గా కనపడదాం అనుకున్నా - 'కల్కి' ఈవెంట్‌లో కమల్ హాసన్ కామెంట్స్