అన్వేషించండి

Gasagasalu: వంటింట్లో, కూరల్లో మత్తుమందు... ఎన్టీఆర్ 'డ్రాగన్' కథ గసగసాల కోసమేనా?

NTR Dragon - Gasagasalu: భారతీయులు కూరల్లో వాడే మసాలా దినుసుల్లో గసగసాలు ఒకటి. వంటింట్లో ఉండే ఆ గసగసాలు ఓ డ్రగ్ అని తెలుసా? ఎన్టీఆర్ 'డ్రాగన్' కథ ఆ గసగసాల కోసమేనా?

వంటింట్లో వాడే ముఖ్యమైన మసాలా దినుసుల్లో గసగసాలు ఉంటాయి. ముఖ్యంగా నాన్ వెజ్ కర్రీస్ కి గసగసాలు ఇచ్చే అదనపు సువాసన ఎంతో ముఖ్యం. అయితే చాలామందికి తెలియదు ఇది ఒక రకమైన డ్రగ్ అని. ఇవే గసగసాలను ఓపియం అనే పేరుతో పిలుస్తారు అనీ గతంలో ఈ ఓపియం కోసం దేశాల మధ్య యుద్ధాలు జరిగాయని  చరిత్ర చెబుతోంది.

నేచురల్‌గా లభించే మత్తుమందు ఓపియం
From Royal Kitchens to Opium Wars, The Untold Story of Gasagasalu: గసగసాలు సహజ సిద్ధంగా దొరికే 'ఓపియం పాపీ' అనే మొక్క నుండి లభిస్తాయి. ఈ మొక్కలు అరేబియన్ వర్తకుల ద్వారా వెయ్యేళ్ళ క్రితమే ఇండియాలోకి వచ్చాయి. ఈ మొక్కల నుంచి లభించే ఓపియం (నల్లమందు)ను నిజానికి మత్తు పదార్థంగానే వాడేవారు. మొఘలుల కాలంలో దీనిని ఖరీదైన వ్యాపారంగా మార్చి దీనిపై వేసే టాక్స్ లతో  తమ సామ్రాజ్యానికి రాబడి చేకూర్చుకునేవారు. మరోవైపు ఇదే మొక్క నుంచి వచ్చే గసగసాలను తమ అంతఃపురం వంటలలో చిక్కటి గ్రేవీల కోసం ఉపయోగించేవారు. బ్రిటిషర్లు వచ్చాక నల్లమందుకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని దీనిని యూరప్ కి పంపిణి చేసేవారు. అయితే చైనా ఒప్పుకోకపోవడంతో  నల్లమందు వ్యాపారం చేయడం కోసం చైనాతో రెండు యుద్ధాలు చేసింది బ్రిటిష్ రాజ్. ఆ యుద్ధాలనే ఓపియం వార్స్ అని పిలుస్తారు. భారతదేశంలో స్వతంత్రం వచ్చాక నల్ల మందును పూర్తిగా నిషేధించారు. కేవలం ప్రభుత్వ సంరక్షణలో ఫార్మసుటికల్ అవసరాల కోసం ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఓపియంను పండిస్తున్నారు. వాటి నుంచి ఆపరేషన్ సమయంలో వాడే మత్తు మందు, దగ్గు సిరప్ లాంటివి తయారు అవుతాయి. ఇదే మొక్క నుండి ఉత్పత్తి అయ్యే గసగసాలను వంట దినుసులుగా వాడుతారు. అయితే దీని పెద్ద ఎత్తున  కొనుగోలు చేయాలన్నా, అమ్మలన్నా ప్రభుత్వ పర్మిషన్ తప్పనిసరి.

Also Read: Opium - ఇండియాకు ఓపియం ఎలా వచ్చిందంటే? NTR Dragon Glimpseలో చూపించిన డ్రగ్ హిస్టరీ

గసగసాలు, నల్లమందు... ఒక మొక్క నుంచే!
రెండిటికీ మధ్య తేడా ఏమిటి? ఎలా గుర్తించాలి?
How Gasagasalu Are Made? Shocking Truth Behind This Everyday Spice: ఓపియం మొక్కలకు కాసే చిన్న చిన్న కాయలకు పచ్చిగా ఉన్నప్పుడు గంటు పెట్టి వాటి నుంచి కారే పాల నుంచి గసగసాలు తయారు చేస్తారు. కాయలు ఎండిపోయిన తర్వాత తొక్కల నుంచి ఓపియం తయారు చేస్తారు. ఓపియం అనేది పూర్తిగా ఒక మత్తుమందు. దీనిని ఇండియాలో నిషేధించారు. కానీ గసగసాలను వంట దినుసుగా వాడుతున్నారు. అయినప్పటికీ వీటిని కొద్ది మొత్తంలోనే కొనుగోలు చేయాలి. గసగసాలతో కూరలకు అదనపు రుచి మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా జీర్ణశక్తి మెరుగుపడడం, చక్కటి నిద్ర పట్టడం, ఎముకలు బలోపేతం కావడం అలాగే స్త్రీలకు సంబంధించి కొన్ని ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవడం లాంటి ప్రయోజనాలు గసగసాలు వల్ల.కలుగుతాయి. అలాగని వీటిని తరచుగా వాడడం వల్ల ఒక వ్యసనంగా మారిపోయే ప్రమాదం లేకపోలేదని హెల్త్ ఎక్స్ పర్ట్స్ చెబుతూ ఉంటారు.

Also ReadDragon Glimpse Decoded - ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్‌లో హిడెన్ డీటెయిల్స్... ప్రశాంత్ నీల్ సీక్రెట్ క్లూస్ గమనించారా?

ఎన్టీఆర్ 'డ్రాగన్' కథ ఈ గసగసాల కోసమేనా?
ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన 'డ్రాగన్' సినిమా టీజర్‌లో చూపించిన దృశ్యాల ప్రకారం... ఈ సినిమా కథాంశం మొత్తం ఓపియం చుట్టూనే నడుస్తోంది. యాక్షన్, బ్లడ్ బాత్ ఎక్కువగా ఉండే 'డ్రాగన్' మూవీలోని మూల కథ (కోర్ పాయింట్) ఈ గసగసాల మొక్క (ఓపియం పాపీ) చుట్టూనే నడుస్తున్నట్టు కనబడడం విశేషం. మరి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇంకెంత లోతుకు వెళ్లి ఈ సబ్జెక్టు మీద ఫోకస్ చేశారో తెలియాలంటే  సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.

Also ReadNTR Networth & Cars Collection - పోర్షే నుంచి లంబోర్ఘిని వరకు... ఎన్టీఆర్ గ్యారేజీలో కార్ కలెక్షన్, ఆయన టోటల్ నెట్ వర్త్ తెలుసా?

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Advertisement

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Embed widget