అన్వేషించండి

Game Changer Teaser: మెగా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ - డిజప్పాయింట్ అవ్వొద్దంటున్న తమన్!

Game Changer Release Date: సంగీత దర్శకుడు తమన్ చేసిన ట్వీట్ మెగా ఫ్యాన్స్ అందరికీ కొంచెం డిజప్పాయింట్ చేసే అంశమే. అయితే... ఆయన మాత్రం డిజప్పాయింట్ కావద్దని చెబుతున్నారు.

సంగీత దర్శకుడు తమన్ (Music Director Thaman) ఈ రోజు (మంగళవారం, సెప్టెంబర్ 8) మధ్యాహ్నం ఒక ట్వీట్ చేశారు. అది మెగా అభిమానులు అందరికీ కాస్త నిరాశ పరిచే విషయమే. అయితే, 'డిజప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు' అని ఆయన అంటున్నారు.‌ ఇంతకీ, తమన్ ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు? అనే విషయంలోకి వెళ్తే...

దసరాకు 'గేమ్ చేంజర్' టీజర్ రాదు!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా సౌత్ ఇండియన్ స్టార్ ఫిల్మ్ మేకర్, లెజెండరీ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న పాన్ ఇండియా సినిమా 'గేమ్ చేంజర్' (Game Changer). విజయ దశమి కానుకగా టీజర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. అయితే... ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో టీజర్ విడుదల అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాలేదని సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో తమన్ ముందుగా ఒక హింట్ ఇచ్చారు.

''ఒకవేళ దసరాకి (గేమ్ చేంజర్) టీజర్ రాలేదు అని నిరాశ పడకండి. టీం అందరూ ఫుల్ వర్క్ చేస్తున్నారు. సినిమా ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. సీజీ, వీఎఫ్ఎక్స్ షాట్స్, సినిమా ఫైనల్ ఎడిటింగ్, డబ్బింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. రీ రికార్డింగ్ చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేశాను. లిరికల్ వీడియోలు అన్ని రెడీ అవుతున్నాయి ప్రతి నెల ఒక పాటను విడుదల చేయాలని ప్లాన్ చేశాం. ఈ నెల 30వ తేదీన 'గేమ్ చేంజర్' సినిమా నుంచి మూడో పాట వస్తుంది'' అని తమన్ ట్వీట్ చేశారు.

Also Read: రజనీకాంత్ దర్శకుడికి అవకాశం ఇస్తున్న ఎన్టీఆర్ - 'దేవర 2' తర్వాత అతనితో?

క్రిస్మస్ బరిలో సినిమా... అందులో నో డౌట్!
సినిమా విడుదలపై పలువురిలో సందేహాలు నెలకొన్నాయి. 'గేమ్ చేంజర్' ముందుగా ప్రకటించినట్లు క్రిస్మస్ బరిలో విడుదల అవుతుందా? లేదా? అని ఇంకా డిస్కషన్ లో జరుగుతున్నాయి. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా కాకుండా సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని, తనయుడు రామ్ చరణ్ కోసం తన 'విశ్వంభర' సినిమా విడుదలను చిరంజీవి వాయిదా వేసుకుంటున్నారని, అబ్బాయి కోసం త్యాగం చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే అటువంటిది ఏమీ లేదని తమన్ ట్వీట్ బట్టి అర్థమవుతుంది. డిసెంబర్ 20 లేదా క్రిస్మస్ 2024కు సినిమా విడుదల అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాలో కియారా అడ్వాణీ హీరోయిన్. శ్రీకాంత్, అంజలి, ఎస్జే సూర్య ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. 

Also Readఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Aadhaar Card Updating: ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Embed widget