అన్వేషించండి

Game Changer Pre Release Event: డల్లాస్‌లో 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌... చీఫ్ గెస్ట్ నుంచి టైమింగ్స్ వరకు - ఈ డీటెయిల్స్ తెలుసా?

Ram Charan's Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సినిమా 'గేమ్ చెంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం డల్లాస్ రెడీ అయ్యింది. ఈ ఈవెంట్ స్పెషాలిటీ ఏమిటో తెలుసా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ సినిమా 'గేమ్ చేంజర్' (Game Changer). శంకర్ డైరెక్షన్ చేశారు. ఇప్పుడు వాళ్లిద్దరూ డల్లాస్ (Dallas)లో ఉన్నారు. వాళ్లతో పాటు ఇంకొందరు కూడా! 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వెళ్లారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసా?

ఫస్ట్ టైమ్ డల్లాస్, అమెరికాలో ఈవెంట్
Game Changer Pre Release Event: సాధారణంగా సినిమా రిలీజ్ తర్వాత హీరో అండ్ టీమ్ అమెరికా వెళ్లడం కామన్. ఈ మధ్య కొంత మంది సెలబ్రిటీలు రిలీజ్ ముందు కూడా వెళ్తున్నారు. కానీ, ఫర్ ద ఫస్ట్ టైమ్... అమెరికాలోని డల్లాస్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. 'గేమ్ చేంజర్'తో అమెరికాలో తెలుగు మూవీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ సంస్కృతి మొదలైందని చెప్పవచ్చు. 

'గేమ్ చేంజర్' ఈవెంట్ చీఫ్ గెస్ట్ ఎవరు?
'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం చిత్ర బృందం అమెరికా వెళ్ళింది. వాళ్ళతో పాటు క్రియేటివ్ జీనియస్ సుకుమార్ వెళ్లారు. ఆయనతో పాటు రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం సినిమా (పెద్ది) తెరకెక్కిస్తున్న దర్శకుడు బుచ్చి బాబు సానా కూడా వెళ్లారు. ఈ ఈవెంట్ చీఫ్ గెస్ట్ సుకుమార్ అయితే... మరొక గెస్ట్ బుచ్చి అన్నమాట.

'గేమ్ చేంజర్' అమెరికా డిస్ట్రిబ్యూటర్ రాజేష్ కల్లేపల్లి భారీ ఎత్తున ఈవెంట్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. యాంకర్ సుమను ఈ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా అమెరికా తీసుకు వెళ్లడం విశేషం. శంకర్ వెంట ఆయన కుమార్తెలు సైతం వెళ్లారు. ఇంకా నిర్మాత శిరీష్ ఉన్నారు. రామ్ చరణ్ రాకతో డల్లాస్ సిటీ అంతా హోరెత్తుతోందని అక్కడి తెలుగు ప్రజలు చెబుతున్నారు. ఆల్రెడీ మెగా ఫ్యాన్స్, ప్రేక్షకులతో చరణ్ సమావేశం అయ్యారు. సోషల్ మీడియా అంతా ఇప్పుడు ఈ సినిమా టాపిక్కే.  

డల్లాస్ సిటీలో డిసెంబర్ 21వ తేదీన సాయంత్రం ఆరు గంటలకు 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం అవుతుంది. అంటే... ఇండియన్ టైమింగ్ ప్రకారం డిసెంబర్ 22 (ఆదివారం) ఉదయం ఐదున్నర గంటల సమయంలో అన్నమాట. రామ్ చరణ్ ఎంట్రీ అండ్ స్పీచ్ భారతీయ కాలమానం ప్రకారం ఎనిమిది గంటలకు ఉండవచ్చు.

Also Read: రోడ్ షో చేయలేదు... పోలీసులు నా దగ్గరకొచ్చి చెప్పలేదు... నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారు - రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అల్లు అర్జున్ రియాక్షన్

'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 'హ్యాపీ లైఫ్‌కు మైక్రో మంత్ర...' అంటూ సాగే Dhop సాంగ్ రిలీజ్ చేయనున్నారు. ఈ పాటలో రామ్ చరణ్, కియారా అద్వానీ చేసిన డ్యాన్స్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ అన్నట్టు ఉంటుందని టాక్.

ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, 'దిల్' రాజు ప్రొడక్షన్ సంస్థలపై అగ్ర నిర్మాత 'దిల్' రాజు, శిరీష్ రాజీ పడకుండా నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Also Readటాలీవుడ్ మీద 'పుష్ప 2' ఎఫెక్ట్... ఇకపై బెనిఫిట్ షోలు ల్లేవ్ - టికెట్ రేట్లూ పెరగవ్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jubilee Hills by-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రేసులో దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి!
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రేసులో దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి!
YS Jagan Tour: నేడు అనకాపల్లి మెడికల్ కాలేజీకి జగన్- టూర్‌పై పోలీసులు ఆంక్షలు- అయినా భారీగా ప్లాన్ చేసిన వైసీపీ 
నేడు అనకాపల్లి మెడికల్ కాలేజీకి జగన్- టూర్‌పై పోలీసులు ఆంక్షలు- అయినా భారీగా ప్లాన్ చేసిన వైసీపీ 
BRS Chalo Bas Bhavan : బీఆర్‌ఎస్‌ చలో బస్‌భవన్‌ పిలుపుతో నేతల హౌస్‌ అరెస్టు- మండిపడుతున్న గులాబీ నేతలు 
బీఆర్‌ఎస్‌ చలో బస్‌భవన్‌ పిలుపుతో నేతల హౌస్‌ అరెస్టు- మండిపడుతున్న గులాబీ నేతలు 
Visakhapatnam data centre: విశాఖలో గూగుల్ 10 బిలియన్ డాలర్లతో డాటా సెంటర్ - SIPB సమావేశంలో ఆమోదముద్ర
విశాఖలో గూగుల్ 10 బిలియన్ డాలర్లతో డాటా సెంటర్ - SIPB సమావేశంలో ఆమోదముద్ర
Advertisement

వీడియోలు

TATA Group Power Struggle Explained | ఆధిపత్యం కోసం టాటా సంస్థల్లో అంతర్యుద్ధం | ABP Desam
ఆ క్రెడిట్ ద్రవిడ్‌దే..! గంభీర్‌కి షాకిచ్చిన రోహిత్
గ్రౌండ్‌‌లోనే ప్లేయర్‌ని బ్యాట్‌తో కొట్టబోయిన పృథ్వి షా
ప్యానిక్ మోడ్‌లో పీసీబీ అడుక్కుంటున్నా నో అంటున్న ఫ్యాన్స్!
ముంబై ఇండియన్స్ లోకి ధోనీ? CSK ఫ్యాన్స్ కి హార్ట్ బ్రేక్!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jubilee Hills by-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రేసులో దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి!
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రేసులో దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి!
YS Jagan Tour: నేడు అనకాపల్లి మెడికల్ కాలేజీకి జగన్- టూర్‌పై పోలీసులు ఆంక్షలు- అయినా భారీగా ప్లాన్ చేసిన వైసీపీ 
నేడు అనకాపల్లి మెడికల్ కాలేజీకి జగన్- టూర్‌పై పోలీసులు ఆంక్షలు- అయినా భారీగా ప్లాన్ చేసిన వైసీపీ 
BRS Chalo Bas Bhavan : బీఆర్‌ఎస్‌ చలో బస్‌భవన్‌ పిలుపుతో నేతల హౌస్‌ అరెస్టు- మండిపడుతున్న గులాబీ నేతలు 
బీఆర్‌ఎస్‌ చలో బస్‌భవన్‌ పిలుపుతో నేతల హౌస్‌ అరెస్టు- మండిపడుతున్న గులాబీ నేతలు 
Visakhapatnam data centre: విశాఖలో గూగుల్ 10 బిలియన్ డాలర్లతో డాటా సెంటర్ - SIPB సమావేశంలో ఆమోదముద్ర
విశాఖలో గూగుల్ 10 బిలియన్ డాలర్లతో డాటా సెంటర్ - SIPB సమావేశంలో ఆమోదముద్ర
TTD 2026 Calendar & Diary: శ్రీవారి భక్తులకు శుభవార్త!  ఆధ్యాత్మిక జ్ఞానం, తిరుమల వివరాల కోసం భక్తులకు అందుబాటులో TTD 2026 డైరీలు, క్యాలెండర్లు!
శ్రీవారి భక్తులకు శుభవార్త! ఆధ్యాత్మిక జ్ఞానం, తిరుమల వివరాల కోసం భక్తులకు అందుబాటులో TTD 2026 డైరీలు, క్యాలెండర్లు!
Women World Cup 2025 IND vs SA: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్ ఎప్పుడు ఎక్కడ చూడవచ్చు? పూర్తి వివరాలు తెలుసుకోండి!
విశాఖ వేదికగా భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా, మ్యాచ్ ఎప్పుడు ఎక్కడ చూడవచ్చు? పూర్తి వివరాలు తెలుసుకోండి!
War 2 OTT: ఓటీటీలోకి వచ్చేసిన 'వార్ 2' - 3 భాషల్లో స్ట్రీమింగ్... ఎందులోనో తెలుసా?
ఓటీటీలోకి వచ్చేసిన 'వార్ 2' - 3 భాషల్లో స్ట్రీమింగ్... ఎందులోనో తెలుసా?
Gold Price :దీపావళికి ముందే లక్షా పాతిక వేలు దాటిన బంగారం, మూడు రోజుల్లో 6000 రూపాయలు పెరుగుదల; ఇకపై ఎలా ఉంటుంది?
దీపావళికి ముందే లక్షా పాతిక వేలు దాటిన బంగారం, మూడు రోజుల్లో 6000 రూపాయలు పెరుగుదల; ఇకపై ఎలా ఉంటుంది?
Embed widget