By: Khagesh | Updated at : 09 Oct 2025 09:29 AM (IST)
దిపావళికి ముందే లక్షా పాతిక వేలు దాటిన బంగారం, మూడు రోజుల్లో 6000 రూపాయలు పెరిగింది ( Image Source : Other )
Gold Price : ధంతేరాస్, దీపావళి పండుగ దగ్గర పడుతున్న కొద్దీ, బంగారం ధరలు పెరుగుతున్నాయి. కేవలం మూడు రోజుల్లో బంగారం ధర 6000 రూపాయలు పెరిగింది. బుధవారం ఒక్కరోజే ధర 2,600 రూపాయలు పెరిగి 10 గ్రాములకు 1,26,600 రూపాయలకు చేరుకుంది, ఇది ఆల్ టైమ్ హై స్థాయి. మొత్తం మీద, దీపావళికి ముందే బంగారం లక్ష దాటింది. నిపుణులు దీపావళి వరకు బంగారం ఈ స్థాయికి చేరుకుంటుందని అంచనా వేశారు.
ముందు సుంకాలు, ఇప్పుడు అమెరికాలో చాలా కాలంగా కొనసాగుతున్న షట్‌డౌన్ మధ్య ఏర్పడిన అనిశ్చితి మధ్య, ప్రజలు సురక్షితమైన పెట్టుబడిగా బంగారంపై ఆధారపడుతున్నారు, దీనివల్ల ధరలు పెరిగాయి. ఆల్ ఇండియా బులియన్ అసోసియేషన్ ప్రకారం, 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం మంగళవారం (అక్టోబర్ 7)న 700 రూపాయలు పెరిగి 10 గ్రాములకు 1,24,000 రూపాయలకు ముగిసింది, అయితే ఒక రోజు ముందు సోమవారం (అక్టోబర్ 6)న ఇది 2,700 రూపాయలు పెరిగింది.
హైదరాబాద్‌లో ఇవాళ బంగారం ధర పరిశీలిస్తే పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,26,070 రూపాయలుగా ఉంది. అంటే గ్రాము 12,607 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం గ్రాము 11,361 రూపాయలు, 18 క్యారెట్ల బంగారం గ్రాము 9,296 రూపాయలుగా ఉంది.
ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో బుధవారం 99.5 శాతం స్వచ్ఛమైన బంగారం ధర 2,600 రూపాయలు పెరిగి 10 గ్రాములకు 1,26,000 రూపాయలకు చేరుకుంది, ఇది ఇప్పటివరకు ఆల్ టైమ్ హై స్థాయి. అయితే మంగళవారం ఇది 10 గ్రాములకు 1,23,400 రూపాయల వద్ద ముగిసింది. ఈరోజు హైదరాబాద్‌లో వెండి ధరలు పరిశీలిస్తే కిలో వెండి 1,70,100 రూపాయలుగా ఉంది. ఇవాళ వెండి కిలోపై వంద రూపాయలు పెరిగింది.
విదేశీ మార్కెట్లలో కూడా బులియన్ ధరలలో భారీ పెరుగుదల కనిపించింది. స్పాట్ బంగారం దాదాపు 2 శాతం పెరిగి ఔన్సుకు 4,049.59 డాలర్ల రికార్డు స్థాయికి చేరుకుంది. బంగారంతో పాటు వెండి ధర కూడా పెరుగుతోంది. బుధవారం వెండి ధర 3,000 రూపాయలు పెరిగి కిలోకు 1,57,000 రూపాయలకు చేరుకుంది, ఇది రికార్డు స్థాయి. మంగళవారం వెండి కిలో 1,54,000 రూపాయల వద్ద ముగిసింది.
అమెరికాలో షట్‌డౌన్ కారణంగా ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోతాయనే ఆందోళనల మధ్య సురక్షితమైన పెట్టుబడికి డిమాండ్ పెరగడంతో స్పాట్ బంగారం మొదటిసారిగా ఔన్సుకు 4,000 డాలర్ల కీలక స్థాయిని దాటింది. ప్రపంచ మార్కెట్లలో స్పాట్ వెండి 2 శాతం కంటే ఎక్కువ పెరిగి ఔన్సుకు 48.99 డాలర్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. కోటక్ సెక్యూరిటీస్ AVP కమోడిటీ రీసెర్చ్, కయినాత్ చైన్‌వాలా మాట్లాడుతూ,"ఉక్రెయిన్‌లో భూ-రాజకీయ ఉద్రిక్తతలు, ఫ్రాన్స్, జపాన్‌లో రాజకీయ అస్థిరత, కొనసాగుతున్న డేటా బ్లాక్‌అవుట్ మధ్య ఫెడ్ రేట్లను తగ్గించే అవకాశాలు పెరగడం కూడా ఈ పెరుగుదలకు కారణం."
బంగారం ధరలు నిరంతరం పెరుగుతున్న వేళ, ఈ ఏడాది దీపావళిలో బంగారం రికార్డు స్థాయిలో అమ్ముడవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం, అక్టోబర్ 18 నుంచి 23 మధ్య దాదాపు 45 టన్నుల బంగారం అమ్ముడయ్యే అవకాశం ఉంది. బంగారం ధరలు నిరంతరం పెరుగుతున్నందున, ధరలు తగ్గుతాయని ప్రజలు ఆశించడం మానేశారు.
RBI Repo Rate:రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
Rupee Falling News: వంట నుంచి వాహనం నడపడం వరకు; రూపాయి పతనంతో జరిగే పరిణామాలు తెలుసుకోండి?
Rupee Weakening Effect in India:రూపాయి బలహీనపడటం ఎవరికి లాభం? ఎవరికి నష్టం? ఏ రంగాలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
Gold Price: బంగారం రన్ ఇప్పట్లో ఆగదా! ధర 1.50 లక్షలకు చేరుకుంటుందా?
Railway Tatkal Ticket Booking Rules: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్ మారాయి - ఇకపై OTP తప్పనిసరి!
Russia India trade ties: మరో ఐదేళ్లు వాణిజ్య బంధం బలోపేతం - మోదీ, పుతిన్ ఉమ్మడి ప్రకటన
Hawala money seizure: కారులో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే .. షాక్ అయిన పోలీసులు - ఎవరి డబ్బు ?
Minister Ponguleti: ఎల్పీనగర్ సీరీస్ భూముల్ని రియల్ ఎస్టేట్‌కు ఇచ్చింది కేటీఆరే - మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణలు
Tegalu Health Benefits : తేగలతో అద్భుత ప్రయోజనాలు.. డిటాక్స్ నుంచి వెయిట్ లాస్ వరకు ఆరోగ్య లాభాలు ఇవే