గ్రౌండ్‌లోనే ప్లేయర్‌ని బ్యాట్‌తో కొట్టబోయిన పృథ్వి షా
2018 అండర్ 19 వన్డే వరల్డ్ కప్ టోర్నీ గెలిచిన జట్టులో వైస్ కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్.. ఇప్పుడు టీమిండియా వన్డే, టెస్ట్ టీమ్స్‌కి కెప్టెన్ అయిపోయాడు. కానీ.. అదే టీమ్‌కి కెప్టెన్‌గా ఉన్న పృధ్వీ షా ఇప్పుడే చేస్తున్నాడో తెలుసా..? రంజీ ట్రోఫీ కోసం ఆడుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో తోటి ప్లేయర్లని బ్యాట్‌తో కొట్టడానికెళ్తూ గొడవలు పడుతున్నాడు.
Ranji Trophy 2025-26 సీజన్ కోసం జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో మహారాష్ట్ర తరపున ఆడుతున్న పృథ్వి షా .. కేవలం 140 బంతుల్లో ఏకంగా 181 రన్స్ బాది ఇరగదీశాడు. అయితే బాగా ఆడాడు.. టీమిండియాలోకి రావడానికి బాగా కష్టపడుతున్నాడు.. అని సెలక్టర్లు అనుకునేలోపు.. అంతా నాశనం చేసుకున్నాడు. 181 రన్స్ దగ్గర ముంబై మాజీ టీమ్మేట్, సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయిన షా.. దాన్ని తట్టుకోలేకపోయాడు. drama మొదలుపెట్టాడు.
సాధారణంగానే బ్యాటర్‌ను అవుట్ చేసిన బౌలర్ ఏదో ఒక గెస్చర్ ఇస్తారు.. అలాంటిది 181 రన్స్‌తో భారీ స్కోర్ చేసిన పృధ్వీషాని అవుట్ చేసిన ఎగ్జైట్‌మెంట్‌లో ముషీర్ ఖాన్.. షాకు send-off ఇస్తున్నట్లు సైగ చశాడు. అంతే ‘నాకే ఎగతాలి చేస్తావా..?’ అంటూ కోపంతో ఊగిపోతూ.. Musheer Khanపై ఏకంగా బ్యాట్‌తో ఎటాక్ చేయబోయాడు. వెంటనే అంపైర్, మిగిలిన ప్లేయర్స్ ఎంటర్ అయి.. పృధ్వీని వెనక్కి లాగి అక్కడి నుంచి పంపించేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. క్రికెట్ ఫ్యాన్స్ మనోడిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.
నువ్వు మారవా..? నీ దగ్గర వైస్ కెప్టెన్‌గా చేసిన గిల్.. ఇప్పుడు టీమిండియా కెప్టెన్ అయ్యాడు. నువ్వేమో జట్టులో చోటు కూడా దక్కించుకోలేకపోతున్నావు. నీ బుద్ధి మారకపోతే ఇక ఎప్పటికీ ఇండియన్ టీమ్‌కి ఆడలేవు. యారొగెన్స్‌ని పక్కన పెట్టి.. క్రికెట్‌పై ఫోకస్ పెట్టు’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నిన్న, మొన్నటి వరకు ముంబైకే ఆడిన పృధ్వీ షా.. కొద్ది రోజుల క్రితమే NOC తీసుకొని మహారాష్ట్రకు మారాడు. మరి సడెన్‌గా ఇలా ముంబై ప్లేయర్స్‌తోనే ఎందుకు ఫైట్‌కి దిగాడో అర్థం కావట్లేని ఇంకొంతమంది పోస్ట్‌లు పెడుతున్నారు.





















