అన్వేషించండి

TTD 2026 Calendar & Diary: శ్రీవారి భక్తులకు శుభవార్త! ఆధ్యాత్మిక జ్ఞానం, తిరుమల వివరాల కోసం భక్తులకు అందుబాటులో TTD 2026 డైరీలు, క్యాలెండర్లు!

Tirumala: శ్రీవారి భక్తుల సౌకర్యార్థం TTD 2026 సంవత్సర క్యాలెండర్లు, డైరీలను ఆఫ్ లైన్ లో ఎంపిక చేసిన ప్రాంతాల్లోనూ, TTD వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో భక్తులకు విక్రయిస్తోంది. పూర్తివివరాలు మీకోసం

TTD 2026 diaries and calendars: ప్రతి సంవత్సరం భక్తుల అభిరుచికి అనుగుణంగా అద్భుతమైన క్యాలెండర్లు, డైరీలు విడుదల చేస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. 2026 సంవత్సరానికి సంబంధించిన  ఇప్పటికే భక్తుల అందుబాటులోకి తీసుకొచ్చారు. శ్రీవేంకటేశ్వర స్వామి వాహిని అయిన ఈ క్యాలెండర్లు, డైరీలు కేవలం తేదీలు, పంచాంగాలు మాత్రమే కాకుండా, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, TTD కార్యక్రమాలను, ఉత్సవాలకు సంబంధించిన వివరాలు కూడా అందిస్తాయి. 

భక్తులు వీటిని ఇంట్లోనే కాకుండా కార్యాలయాల్లో ఉపయోగించుకుంటారు. TTD 2026 క్యాలెండర్లు వివిధ రకాలుగా ఉన్నాయి. 

12-పేజీల వాల్ హ్యాంగింగ్ క్యాలెండర్ (రూ.130)
6-పేజీల భారీ సైజు క్యాలెండర్ (రూ.150)
టేబుల్ టాప్ క్యాలెండర్ (రూ.75)

ఇందులో శ్రీవెంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి అద్భుతమైన ఫోటోలు, తిరుమల ఉత్సవాలు, స్వామి అమ్మవార్ల  దర్శనాలు, గురు పౌర్ణమి, బ్రహ్మోత్సవాలు వంటి ముఖ్య ఈవెంట్ల తేదీలు వివరంగా ఉంటాయి. 

తెలుగు పంచాంగం క్యాలెండర్ (రూ.30) ప్రత్యేకంగా ఉపయోగకరం. ఇందులో వ్రతాలు, తిథులు, నక్షత్రాలతో పాటు TTD హెల్ప్‌లైన్ నంబర్లు, సేవల వివరాలు ఉంటాయి. 

శ్రీవారు అమ్మవారు ఉన్న క్యాలెండర్లు (రూ.15) కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది భక్తులు పోటీపడుతుంటారు. ఈ క్యాలెండర్లు  క్వాలిటీ పేపర్‌లో ముద్రించడంతో.. ఇల్లు, కార్యాలయంలో పెట్టేందుకు అనుకూలంగా ఉంటాయి

డైరీల విషయానికి వస్తే, డీలక్స్ డైరీ (రూ.150), చిన్న డైరీ (రూ.120). ఇవి 365 పేజీలతో ప్రతి రోజు పంచాంగ వివరాలు, టిటిడి ట్రస్ట్ సమాచారం, తిరుమల ఆవాసాలు, అర్జిత సేవలు, మాస ప్రతి మాస ఉత్సవాల వివరాలు ఉంటాయి. డైరీల మొదటి పేజీల్లో శ్రీవారి చరిత్ర, టిటిడి కాల్ సెంటర్లు, ఇన్ఫర్మేషన్ సెంటర్లు వివరాలు ఉంటాయి. భక్తులు ఇవి రోజువారీ ప్లానింగ్‌కు, ఆధ్యాత్మిక  వివరాలకు ఉపయోగిస్తారు. ఇవి సబ్సిడైజ్డ్ రేట్లకు అందిస్తారు. 

ఈ డైరీలు, క్యాలెండర్లు ఆఫ్‌లైన్‌లో తిరుమల, తిరుపతి పబ్లికేషన్ స్టాల్స్‌లో (టిటిడి అడ్మిన్ బిల్డింగ్ ప్రతిరూపంలో, గోవిందరాజ స్వామి ఆలయం దగ్గర, శ్రీనివాసం, విష్ణునివాసం) లభిస్తాయి. తిరుచానూర్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై (ఎస్వీ, పద్మావతి ఆలయాలు), హైదరాబాద్ (హిమాయత్‌నగర్, జూబ్లీహిల్స్), బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, వేలూరు, రాజమండ్రి, కర్నూలు, కాకినాడ, నెల్లూరు కల్యాణమండపాల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో www.tirumala.org, ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ల ద్వారా ఆర్డర్ చేసి, డోర్ డెలివరీ పొందవచ్చు. 

డెబిట్/క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చెల్లింపు, ప్యాకింగ్-షిప్పింగ్ ఛార్జీలు అదనంగా చెల్లించాలి. విదేశీ భక్తులు కూడా ఈ సౌలభ్యం పొందొచ్చు. భారతదేశం బయటి డెలివరీ కోసం స్పెషల్ అరేంజ్‌మెంట్లు ఉన్నాయి. 

TTD ఈ ఉత్పత్తుల ద్వారా భక్తులకు స్వామి స్మరణను, ధార్మిక జీవనాన్ని ప్రోత్సహిస్తోంది. గత సంవత్సరాల్లా 2026 డైరీలు, క్యాలెండర్లు వేగంగా అమ్ముడుపోతాయి. ఆసక్తి ఉన్న భక్తులు త్వరగా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు -  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చు తగ్గులు..ఏ ఏ నెలల్లో పుత్తడి ధర తగ్గుతుందో పూర్తి సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

నవంబర్ 24, 2026 రాశిఫలాలు: ధనుస్సు, మకరం, కుంభం, మీన రాశుల వారికి ఎలా?
నవంబర్ 24, 2026 రాశిఫలాలు: ధనుస్సు, మకరం, కుంభం, మీన రాశుల వారికి ఎలా?
నవంబర్ 24, 2026 రాశిఫలాలు: సింహ, కన్య, తుల, వృశ్చిక రాశుల అదృష్టం ఎలా ఉందో తెలుసుకోండి!
నవంబర్ 24, 2026 రాశిఫలాలు: సింహ, కన్య, తుల, వృశ్చిక రాశుల అదృష్టం ఎలా ఉందో తెలుసుకోండి!
నవంబర్ 24 మంగళవారం రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం భవిష్యత్తు ఎలా?
నవంబర్ 24 మంగళవారం రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం భవిష్యత్తు ఎలా?
నవంబర్ 23 సోమవారం రాశిఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీన రాశులకు అదృష్టం, ధనలాభం!
నవంబర్ 23 సోమవారం రాశిఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీన రాశులకు అదృష్టం, ధనలాభం!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KRMB Meeting: కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
Kalvakuntla Kavitha: కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
PM Modi With Balen Shah: నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
Bisleri Statement: బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
CM Revanth Reddy: తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది కేసీఆర్, హరీష్ రావు.. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది కేసీఆర్, హరీష్ రావు.. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Fairness Cream Linked to Kidney Disease :ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
Xiaomi 18 Pro Max vs iPhone 18 Pro Max : షామీ 18 ప్రో మ్యాక్స్ వర్సెస్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్.. ఫీచర్ల నుంచి ప్రైస్ వరకు.. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఏది బెస్ట్?
షామీ 18 ప్రో మ్యాక్స్ వర్సెస్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్.. ఫీచర్ల నుంచి ప్రైస్ వరకు.. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఏది బెస్ట్?
Kiran Abbavaram Record : కిరణ్ అబ్బవరం న్యూ 'రికార్డ్' - మిస్టీరియస్ థ్రిల్లర్‌గా కొత్త మూవీ
కిరణ్ అబ్బవరం న్యూ 'రికార్డ్' - మిస్టీరియస్ థ్రిల్లర్‌గా కొత్త మూవీ
Embed widget