War 2 OTT: ఓటీటీలోకి వచ్చేసిన 'వార్ 2' - 3 భాషల్లో స్ట్రీమింగ్... ఎందులోనో తెలుసా?
War 2 OTT Platform: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'వార్ 2' ఓటీటీలోకి వచ్చేసింది. 3 భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

NTR Hrithik Roshan's War 2 OTT Streaming On Netflix: మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న టైం వచ్చేసింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' ఓటీటీలోకి వచ్చేసింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
బుధవారం అర్థరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో 'వార్ 2' స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. 'డబుల్ ద రేజ్, డబుల్ ద ర్యాంపేజ్, రెడీ ఫర్ ది వార్' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ ఫ్రాంచైజీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు. మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా ఎన్టీఆర్, హృతిక్ మధ్య వార్ సీక్వెన్స్ అదిరిపోయాయి. ఎన్టీఆర్‌కు ఇదే ఫస్ట్ బాలీవుడ్ మూవీ.
View this post on Instagram
స్టోరీ ఏంటంటే?
'వార్' మూవీకి సీక్వెల్‌గా ఈ మూవీని రూపొందించారు. రా మాజీ ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్) ఓ దేశ ద్రోహిగా ముద్ర పడుతుంది. రా చీఫ్ కల్నల్ సునీల్ లూథ్రా (అశుతోష్ రాణా)కు ఒకప్పుడు నమ్మిన బంటుగా ఉంటాడు. అలాంటి కబీర్ రా కళ్లు గప్పి అజ్ఞాతంలో గడుపుతుంటాడు. ఓ కాంట్రాక్ట్‌లో భాగంగా జపాన్‌లో పవర్ ఫుల్ వ్యక్తిని చంపేస్తాడు కబీర్. దీంతో అతనిపై కలి కార్టెల్ అనే ఓ ముఠా కన్నేస్తుంది. కబీర్ సాయంతో ఇండియాను తన గుప్పెట్లోకి తీసుకోవాలని అనుకుంటాడు కలి.
తన గాడ్ ఫాదర్ సునీల్ లూథ్రాను చంపాలంటూ కబీర్‌కు టాస్క్ ఇస్తుంది కలి కార్టెల్. అనుకున్నట్లుగానే ఆ పని పూర్తి చేస్తాడు. దీంతో కబీర్‌ను పట్టుకోవాలని రా కొత్త చీఫ్ విక్రాంత్ కౌల్ (అనిల్ కపూర్), భారత ప్రభుత్వం సోల్జర్ విక్రమ్ చలపతి (ఎన్టీఆర్) టీంను రంగంలోకి దింపుతుంది. ఆ టీంలో వింగ్ కమాండర్ కావ్య లూథ్రా (కియారా అద్వానీ) కూడా ఒకరు. అసలు కబీర్ ఎందుకు రా నుంచి దూరంగా వెళ్లిపోయాడు.? తన గాడ్ ఫాదర్‌నే చంపాలని ఎందుకు అనుకుంటాడు? కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు? కబీర్, కావ్యకి ఉన్న సంబంధం ఏంటి? కబీర్ కోసం విక్రమ్ బృందం వేట ఎలా సాగించింది.? కలి కార్టెల్ వెనుక ఉన్నది ఎవరు? ఈ వివరాలు అన్నీ తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















