Gal Gadot: తెలుగులో మాట్లాడిన హాలీవుడ్ ‘వండర్ ఉమెన్’ నటి - ఆలియాకు థాంక్స్ చెబుతోన్న ఫ్యాన్స్
వండర్ ఉమెన్‌గా ప్రపంచానికి పరిచయమయిన గాల్.. ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మనసులను కూడా దోచుకుంది.
ఒకప్పుడు హాలీవుడ్ సినిమాల్లో ఒక ఇండియన్ యాక్టర్ కనిపించినా.. అది ఎంతో గొప్పగా ఉండేది. కానీ ఈమధ్య హాలీవుడ్ మేకర్సే ఏరికోరి ఇండియన్ యాక్టర్లను తమ సినిమాల్లోకి తీసుకుంటున్నారు. అలా ఇండియన్ సినిమా నుంచి వరల్డ్ సినిమాలోకి అడుగు పెడుతున్నవారి జాబితాలో ఆలియా భట్ కూడా యాడ్ అయ్యింది. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ ఆలియా మొదటి హాలీవుడ్ చిత్రం. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుండగా.. అందులో నటించిన హాలీవుడ్ యాక్టర్లతో పాటు ఆలియా కూడా యాక్టివ్‌గా ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది. ఈ ప్రమోషన్స్‌లో హాలీవుడ్ నటి తెలుగులో మాట్లాడడం చూసి అంతా ఆలియాకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
‘హార్ట్ ఆఫ్ స్టోన్’ ప్రమోషన్స్ జోరు..
‘ఆర్ఆర్ఆర్’లోలాగానే ‘హార్ట్ ఆఫ్ స్టోన్’లో కూడా ఆలియా కీలక పాత్రలో కనిపించనుంది. ఇందులో గాల్ గడోట్ లాంటి నటితో తను స్క్రీన్ షేర్ చేసుకుంది. వండర్ ఉమెన్‌గా ప్రపంచానికి పరిచయమైన గాల్.. ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మనసులను కూడా దోచుకుంది. ఇక ‘హార్ట్ ఆఫ్ స్టోన్’లో హీరోగా జేమీ డోర్నన్ కనిపించనున్నాడు. ఈ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఆగస్ట్ 11న ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్ల ముందుకు రానుంది. దీంతో మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో ఇంటర్వ్యూలతో బిజీగా గడిపేస్తున్నారు.
అందరికీ నమస్కారం..
తాజాగా ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ ప్రమోషన్స్ కోసం జరిగిన ఒక ఇంటర్వ్యూలో గాల్ గడోట్‌ను ఆలియా తెలుగు ప్రేక్షకులను పరిచయం చేసింది. అంతే కాకుండా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం గురించి, దాని గొప్పతనం గురించి చెప్పుకొచ్చింది. అదే క్రమంలో గాల్ గడోట్ కాస్త తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించింది. ఆలియా దగ్గరుండి ఆమెతో తెలుగు పదాలను పలికించింది. ‘‘అందరికీ నమస్కారం.. మీకు నా ముద్దులు’’ అని చెప్పమని ఆలియా గాల్‌కు తెలిపింది. దీంతో ఆమె తెలుగులో మాట్లాడింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమెతో తెలుగు మాట్లాడించినందుకు అంతా ఆలియాకు థాంక్స్ చెబుతున్నారు.
Telugu nerpistunna @aliaa08 pic.twitter.com/VMCHF0MayR
— venkatesh arikati (@venkyarikati) August 8, 2023
ఆలియాకు లక్కీ ఇయర్..
2022 అనేది ఆలియా భట్ కెరీర్‌ను వేరే లెవెల్‌కు తీసుకెళ్లింది. ఒకే ఏడాది మూడు సినిమాలు విడుదల చేయడం, అవి కూడా బ్లాక్ బస్టర్ హిట్లు అవ్వడం ఆలియాకే సాధ్యమని తన ఫ్యాన్స్ ఎంతో మురిసిపోయారు. అంతే కాకుండా తన మొదటి హాలీవుడ్ సినిమాకు షూటింగ్‌ను ప్రారంభించింది కూడా 2022లోనే. అందుకే అది ఆలియాకి లక్కీ ఇయర్ అని భావిస్తున్నారు ఫ్యాన్స్. ఇక 2022లో విడుదలయ్యి పాన్ ఇండియా మాత్రమే కాదు.. పాన్ వరల్డ్ రేంజ్‌లో సక్సెస్ అయిన ‘ఆర్ఆర్ఆర్’లో కూడా ఆలియా భాగమయ్యింది. ఈ మూవీ ఆస్కార్ వరకు వెళ్లి గెలిచి రావడంతో దీని గురించి హాలీవుడ్‌కు కూడా తెలిసింది. ఎంతోమంది హాలీవుడ్ సెలబ్రిటీలు ‘ఆర్ఆర్ఆర్’ మేకర్‌ను కలిసినప్పుడు సినిమా గురించి చర్చించడం అనేది తెలుగు ఫ్యాన్స్‌కు పట్టలేని సంతోషానిచ్చింది.
Also Read: రూ.2 కోట్లు ఇవ్వండి - ‘ది ఎలిఫెంట్ విస్ఫరర్స్’ మేకర్స్‌పై కోర్టుకెక్కిన బొమ్మన్, బెల్లీ
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial