అన్వేషించండి

Adiseshagiri Rao : కృష్ణ చేతిలో గ‌న్ ఫైర్ అయ్యింది, ఎంత ప్ర‌మాదం జ‌రిగిందంటే? - షాకింగ్ విషయాలు చెప్పిన సూపర్ స్టార్ సోదరుడు

Adiseshagiri Rao : ఆది శేష‌గిరిరావు.. సూప‌ర్ స్టార్ కృష్ణ త‌మ్ముడు. ఎన్నో సినిమాల‌కు ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రించారు. సూప‌ర్ స్టార్ కృష్ణ గురించి ఆయ‌న ఎన్నో విష‌యాలు ఒక ఇంట‌ర్వ్యూలో పంచుకున్నారు.

Adiseshagiri Rao About Super Star Krishna Accident: టాలీవుడ్‌లో సూప‌ర్ స్టార్ కృష్ణ‌ చేసినన్ని ప్రయోగాలు మరే హీరో చేసి ఉండరు. డిఫ‌రెంట్ క్యారెక్టర్లు చేస్తూ ఆ క్యారెక్ట‌ర్ల‌లో ఒదిగిపోయే వారు ఆయ‌న‌. భౌతికంగా దూర‌మైనా అభిమానుల గుండెల్లో మాత్రం ప‌దిల‌మైన స్థానాన్ని ఏర్ప‌ర్చుకున్నారు కృష్ణ‌. అభిమానులు, కుటుంబ‌ స‌భ్యులు ఇంకా ఆయ‌న మ‌ర‌ణించార‌నే వార్తను జీర్ణించుకోలేక పోతున్నారు. ఇప్పుడు ఆయ‌న త‌మ్ముడు ఆది శేష‌గిరిరావు ఇచ్చిన ఒక ఇంట‌ర్వ్యూలో కృష్ణ గురించి మాట్లాడారు. ఆయ‌నను స్మ‌రించుకుంటూ కొన్ని విష‌యాలు పంచుకున్నారు. 

గ‌న్ ఫైర్ అయ్యింది.. అంద‌రం భ‌య‌ప‌డ్డాం

కృష్ణ చిన్న త‌మ్ముడు ఘ‌ట్ట‌మ‌నేని ఆది శేష‌గిరిరావు. కృష్ణ న‌టించిన ఎన్నో చిత్రాల‌కు ఆదిశేష‌గిరిరావు ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హించారు. కృష్ణ సినిమాల‌కి సంబంధించి షూటింగ్‌లకు ఆయ‌న దాదాపు వెళ్తుంటారు. ఈ సంద‌ర్భంగా ఊటీలో జ‌రిగిన ఒక ప్ర‌మాదం గురించి, కృష్ణ వ్య‌క్తిత్వం గురించి ఇలా చెప్పారు. "అన్న‌య్య చాలా కూల్ గా ఉంటారు. ఏ విష‌యానికి పెద్ద‌గా భ‌య‌ప‌డ‌రు, కుంగిపోరు. హ‌నుమంత‌రావు మ‌ర‌ణించిన‌ప్పుడు చాలా బాధ‌ప‌డ్డారు. అంతేగానీ.. సినిమాలు ఫ్లాప్ అయినా హిట్ అయినా అస్స‌లు ప‌ట్టించుకోరు. మ‌న‌సులో ఏమీ ఉంచుకోరు. ఏది అనిపిస్తే అది చెప్పేస్తారు. కోపం వ‌చ్చి తిట్టినా వెంట‌నే మ‌ర్చిపోతారు" అని కృష్ణ వ్య‌క్తిత్వం గురించి చెప్పారు ఆయ‌న‌. 

గన్ మిస్ ఫైర్ - అంతా భయపడిపోయాం

"ఏ విష‌యంలో ఆయ‌న వెన‌క‌డుగు వేయ‌రు. యాక్ష‌న్ సీన్లు తీసేట‌ప్పుడు ఎప్పుడూ ప్ర‌మాదం జ‌ర‌గలేదు. ఒక‌సారి మాత్రం ఊటీలో షూటింగ్ జ‌రుగుతుంటే.. గ‌న్ మిస్ ఫైర్ అయ్యింది. బుల్లెట్ వెన‌క్కి వ‌చ్చి త‌గిలింది. అప్పుడు చాలా భ‌య‌ప‌డ్డాం. కోయంబ‌త్తూర్ లో ట్రీట్మెంట్ అందించారు. నెల రోజులు రెస్ట్ తీసుకున్నారు. ఆ త‌ర్వాత ఒక‌సారి హార్స్ రైడింగ్ చేసేట‌ప్పుడు కింద‌ప‌డ్డారు అంతే. ఎక్కువ ప్ర‌మాదాలు మాత్రం జ‌ర‌గ‌లేదు" అని చెప్పారు శేష‌గిరిరావు. 

ఆస్తి గొడవలేవీ లేవు

ఇక ఇదే ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మ‌రిన్ని విష‌యాలపై క్లారిటీ ఇచ్చారు. కృష్ణ మ‌ర‌ణించిన త‌ర్వాత ఆస్తికి సంబంధించిన విష‌యాలపై చాలా వార్త‌లు రాగా.. క్లారిటీ ఇచ్చారు.. ఎలాంటి ఆస్తి గొడ‌వ‌లు లేవ‌ని అన్నారు. ఇక న‌రేశ్ విష‌యం తాము ఎప్పుడూ ప‌ట్టించుకోము అని చెప్పారు. న‌రేశ్ మూడో భార్య కృష్ణ మ‌ర‌ణించిన‌ప్ప‌టి నుంచి వీడియో రిలీజ్ చేసిందనే విష‌యం త‌న‌కు తెలీద‌ని, కానీ, ఆరోజు ఆయ‌న ద‌గ్గ‌ర తన కొడుకు, త‌న మేన‌ల్లుడు చాలామంది ఉన్నార‌ని చెప్పుకొచ్చారు శేష‌గిరిరావు. ఇక కృష్ణ చివ‌రి చూపు విష‌యంలో నెల‌కొన్న క‌న్ ఫ్యూజ‌న్ పై మాట్లాడుతూ.. మంచు కురిసింద‌ని, బాడీ పాడ‌వుతుంద‌నే ఉద్దేశంతోనే ప‌ద్మాల‌య‌కు త‌ర‌లించామ‌న్నారు. మ‌హాప్ర‌స్థానంలో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించిన‌ప్ప‌టికీ.. మెమోరియ‌ల్ ప‌ద్మాల‌య స్టూడియోలో ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు.

కృష్ణ చిన్న తమ్ముడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు. ఆదిశేషగిరిరావు నిర్మాతగా ఎన్నో సినిమాలు చేశారు. చిత్రసీమలో ఆయన్ను ప్ర‌తి ఒక్క‌రు ‘బంగారయ్య’ అని పిలుస్తారు. ఇక ‘పద్మాలయా’ సంస్థ ఇండియా మొత్తం ఫేమ‌స్ అయ్యేందుకు కృష్ణ తమ్ముళ్ళు హనుమంతరావు, ఆదిశేషగిరిరావు ఇద్దరూ కృషి చేశారు. అందుకు తగ్గ విజయం సాధించారు. చిన్నప్పటి నుంచీ అన్న కృష్ణ వెంటనే ఉన్నారు ఆదిశేషగిరిరావు. అన్నంటే త‌న‌కు ప్రాణం అని ఎన్నో సంద‌ర్భాల్లో చెప్పారు శేష‌గిరిరావు.

Also Read: ‘ఆప‌రేష‌న్ వాలంటైన్’, ‘ఫైట‌ర్’ సినిమాల మ‌ధ్య పోలికపై స్పందించిన డైరెక్టర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
Embed widget