Varanasi Movie : అవతార్ కా బాప్ 'వారణాసి' గ్లింప్స్ - రాజమౌళికి ఫ్యాన్స్ స్పెషల్ రిక్వెస్ట్
Mahesh Babu GlobeTrotter : 'వారణాసి' టైటిల్ గ్లింప్స్ వేరే లెవల్‌లో ఉండగా... రాజమౌళికి ఫ్యాన్స్ స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నారు. హాలీవుడ్ రేంజ్‌లో ప్రమోట్ చేసేలా ప్లాన్ చేయాలని అంటున్నారు.

Fans Bold Request To Rajamouli About Varanasi Glimpse : సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి 'వారణాసి' టైటిల్ గ్లింప్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేలా గ్లింప్స్ ఉందని ఇది 'అవతార్ కా బాప్' అంటూ ఇండస్ట్రీ మొత్తం రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తుతోంది. గ్లింప్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ 3 నిమిషాల 41 సెకన్ల వరకూ ప్రతీ ఫ్రేమ్‌ను డీకోడ్ చేసే పనిలో పడ్డారు నెటిజన్లు. 'వారణాసి' సరికొత్త ప్రపంచమే అని వీడియో చూసిన ఎవరికైనా ఇట్టే అర్థమవుతోంది. విజువల్స్ నుంచి మహేష్ లుక్ వరకూ అద్భుతంగా తీర్చిదిద్దారు రాజమౌళి.
ఫ్యాన్స్ స్పెషల్ రిక్వెస్ట్
ఇప్పుడు ఆయనకు ఫ్యాన్స్ స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నారు. 'వారణాసి' టైటిల్ గ్లింప్స్‌ను డిసెంబర్ 19న రిలీజ్ కాబోయే 'అవతార్ ఫైర్ అండ్ యాష్' మూవీతో పాటు వేయాలని కోరుతున్నారు. అలా చేస్తే అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ప్రమోషన్స్ జరుగుతాయని... మన తెలుగోడి సత్తా ప్రపంచానికి చూపించిన వాళ్లం అవుతామని కామెంట్స్ చేస్తున్నారు. టైటిల్ గ్లింప్స్‌తోనే ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రమోషన్స్ ఈజీగా జరుగుతాయని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ రిక్వెస్ట్‌పై రాజమౌళి అండ్ టీం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
హాలీవుడ్ రేంజ్ ప్రమోషన్స్
నిజానికి హాలీవుడ్ రేంజ్‌లో ప్రమోషన్స్ జక్కన్న ఎప్పుడో ప్లాన్ చేశారు. 'వారణాసి' టైటిల్ గ్లింప్స్‌ను హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా లాంచ్ చేయాలని అనుకున్నారు. అలా చేస్తే ఈ మూవీకి అంతర్జాతీయ స్థాయిలో ప్రమోషన్స్ ఈజీ అవుతాయని భావించారు. 'అవతార్ : ఫైర్ అండ్ యాష్' డిసెంబర్ 19న రిలీజ్ కానుండడంతో ఈ మూవీ ప్రమోషన్ల కోసం కామెరూన్ ఇండియాలోనే ఉంటారని... అప్పుడు ఆయనతో మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయాలని అనుకున్నా అది సాధ్యం కాలేదు.
శనివారం రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా 'GlobeTrotter' ఈవెంట్‌లో 100 అడుగుల బిగ్ స్క్రీన్‌పై టైటిల్ గ్లింప్స్ ప్లే చేశారు. దీన్ని 'అవతార్ ఫైర్ అండ్ యాష్' మూవీతో పాటు ప్లే చేస్తే వరల్డ్ వైడ్‌గా ఇదే హాట్ టాపిక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. మరి రాజమౌళి అండ్ టీం, మూవీ మార్కెటింగ్ విభాగం దీనిపై దృష్టి సారించాల్సి ఉంది.
ఈవెంట్ హైలెట్స్
ఇక గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్, కీరవాణి, నిర్మాత కేఎల్ నారాయణ స్పీచ్ నుంచి ఒక్కొక్కరు ఒక్కో సర్ ప్రైజ్ ఇచ్చారు. ప్రియాంక చోప్రానే హీరోయిన్ అని నిర్మాత నారాయణ చెప్పగా... 2027లో సమ్మర్‌లో రిలీజ్ అవుతుందంటూ మహేష్ డైలాగ్‌తో రివీల్ చేశారు కీరవాణి. మహేష్ ఎంట్రీ సైతం ఓ బొమ్మ ఎద్దుపై రావడం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
This was surreal😭😭😭🔥🔥🔥#Varanasi pic.twitter.com/Zu01QJKSZd
— vishnu (@maheshscofieldd) November 15, 2025





















