By: ABP Desam | Updated at : 23 Feb 2023 08:34 AM (IST)
రామ్ చరణ్, ఉపాసన, జెన్నిఫర్ (Image Courtesy : Ram Charan, Jennifer Ashton / Instagram)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) దంపతులు త్వరలో తల్లిదండ్రులు కానున్నారు. చిరంజీవి ఇంట త్వరలో మనవరాలు లేదా మనవడు అడుగు పెట్టనున్నారు. మెగా ఫ్యామిలీ అంతా ఈ క్షణం కోసం ఎంతో ఎదురు చూస్తోంది. వారసుడు లేదా వారసురాలు.... ఎవరు వస్తారు? అని మెగా అభిమానులు, ప్రేక్షకులు కూడా వెయిటింగ్. ఈ సంగతి కాసేపు పక్కన పెడితే... ఉపాసన డెలివరీ ఎక్కడ జరుగుతుంది? అని ప్రశ్నిస్తే... అమెరికాలో జరగొచ్చని సమాచారం.
ఉపాసన డెలివరీకి ఫేమస్ అమెరికన్ గైనకాలజిస్ట్!
ప్రస్తుతం రామ్ చరణ్ అమెరికాలో ఉన్నారు. బుధవారం 'గుడ్ మార్నింగ్ అమెరికా' షోలో పాల్గొన్నారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటు నాటు...' పాటకు గోల్డెన్ గ్లోబ్ రావడం, ఆస్కార్ నామినేట్ కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. షోలో రామ్ చరణ్ పర్సనల్ లైఫ్ గురించి కూడా డిస్కషన్ జరిగింది. త్వరలో ఆయన తండ్రి కానున్న నేపథ్యంలో ఆ ప్రస్తావన కూడా వచ్చింది.
అమెరికాలోని ప్రముఖ గైనకాలజిస్ట్ జెన్నిఫర్ ఆస్టన్ 'గుడ్ మార్నింగ్ అమెరికా' షోలో కో హోస్ట్! ఆమెను కలవడం సంతోషంగా ఉందని చెప్పిన చరణ్... ఫోన్ నంబర్ తీసుకుంటానని పేర్కొన్నారు. తన భార్య (ఉపాసన) అమెరికా వస్తుందని, డెలివరీకి తమరు అందుబాటులో ఉంటే బావుంటుందని జెన్నిఫర్ ఆస్టన్ (Jennifer Ashton) తో చరణ్ తెలిపారు. అందుకు జెన్నిఫర్ ఒకే అన్నారు. ''మీతో ట్రావెల్ చేయడానికి రెడీ. మీ ఫస్ట్ బేబీని డెలివరీ చేయడం నాకు గౌరవమే'' అని ఆమె పేర్కొన్నారు.
Also Read : అమెరికాలో అయ్యప్ప మాల తీసిన రామ్ చరణ్
రామ్ చరణ్, ఉపాసన వివాహం జూన్ 14, 2012న జరిగింది. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల సమక్షంలో వివాహ వేడుక వైభవంగా జరిగింది. పెళ్ళైన పదేళ్ళకు వాళ్ళు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇన్నేళ్ళు ఎందుకు తల్లిదండ్రులు కాలేదనే ప్రశ్న ఆయనకు షోలో ఎదురు కాలేదు. కానీ, ఆయన చెప్పిన ఓ మాట ఆ ప్రశ్నకు సమాధానంగా భావించవచ్చు. తాము ఎప్పుడూ ప్లాన్ చేయలేదని రామ్ చరణ్ పేర్కొన్నారు.
బిడ్డ పుట్టే సమయానికి రామ్ చరణ్, ఉపాసన అమెరికా వెళ్ళినా ఆశ్చర్యపోనవసరం లేదు. గత ఏడాది డిసెంబర్ 12న తాను తాతయ్య కాబోతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత రామ్ చరణ్ కూడా ఆ విషయం చెప్పారు. సినిమా వేడుకలు, ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో ఉపాసన బేబీ బంప్‌తో కనిపిస్తున్నారు.
Also Read : షూటింగులోనూ సేమ్ టీ గ్లాసుతో పవర్ స్టార్ - కొత్త సినిమాలో లుక్ చూశారా?
'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాలోని 'నాటు నాటు...' పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చినప్పుడు ఉపాసన ఎమోషనల్ పోస్ట్ చేశారు. ''ఆర్ఆర్ఆర్' చిత్ర బృందంలో నేనూ ఓ భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రంలోని పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం దేశం గర్వించదగిన విషయం. ఈ అవార్డు వేడుకల్లో నాతో పాటు నా కడుపులో ఉన్న బిడ్డ కూడా అనుభూతి పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ క్షణాలు ఎంతో మధురంగా, భావోద్వేగంగా ఉన్నాయి'' అని ఆమె పేర్కొన్నారు.
IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!
Robert Downey Jr: ఆ హీరో నమిలేసిన చూయింగ్ గమ్ రూ. 45 లక్షలా? ఏం చేసుకుంటారు నాయనా?
Balagam Censored Dialogue: సెన్సార్‌కు ముందు, సెన్సార్ తర్వాత - ‘బలగం’లోని ఆ డైలాగ్ లీక్ చేసిన ప్రియదర్శి
Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?
Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ రిలీజ్ - అందంతో కట్టిపడేస్తోన్న సమంత
Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!
Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి
Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్