Vijay Deverakonda: విజయ్ దేవరకొండ క్రేజ్ చూశారా - నెగిటివ్ పబ్లిసిటీలోనూ దుమ్ము రేపుతున్న 'ఫ్యామిలీ స్టార్', టాప్ 1లో ట్రెండింగ్!
Family Star OTT Records: విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ డైరెక్షన్లో 'దిల్' రాజు, శిరీష్ ప్రొడ్యూస్ చేసిన 'ఫ్యామిలీ స్టార్' ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. నెగిటివ్ పబ్లిసిటీలోనూ అదరగొడుతోంది.
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సినిమా వస్తే ఏదో ఒక సెన్సేషనల్ టాపిక్ డిస్కషన్‌కు రావడం కామన్! ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ నుంచి సాంగ్స్ వరకు ప్రతి పబ్లిసిటీ మెటీరియల్ వైరల్ కావడం తరచూ జరిగేది. తమ హీరో లుక్ లేదా సాంగ్ వచ్చిందని అభిమానులు సంతోష పడితే... విమర్శలు చేసే బ్యాచ్ ఒకటి ఎప్పుడూ ఉండనే ఉంటుంది. 'ఫ్యామిలీ స్టార్' విడుదలకు ముందు నుంచి సోషల్ మీడియా పోస్టుల్లో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ సినిమాపై నెగిటివ్ పబ్లిసిటీ స్టార్ట్ చేశారు. అయితే, మూవీలో కొన్ని మిస్టేక్స్ ఉండటంతో ట్రోలింగ్ మరింత ఎక్కువైంది. విమర్శలను దాటుకుని ఓటీటీలో ఈ మూవీ విజయం సాధించిందని చెప్పాలి.
ప్రైమ్ వీడియోలో టాప్ 1లో 'ఫ్యామిలీ స్టార్'
విజయ్ దేవరకొండ సరసన 'సీతా రామం', 'హాయ్ నాన్న' సినిమాల ఫేమ్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నటించిన 'ఫ్యామిలీ స్టార్' ఏప్రిల్ 5న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఏప్రిల్ 26న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు టాప్ 1 పొజిషన్‌లో ట్రెండింగ్ అవుతోంది.
Also Read: నందితా శ్వేతా సైడ్ క్యారెక్టర్లకు షిఫ్ట్ అయినట్టేనా? స్టార్ అవ్వాల్సిన హీరోయిన్‌కు ఎందుకీ దుస్థితి?
#FamilyStar Stands on Top 1 in India 😻😻🔥 #VijayDeverakonda #MrunalThakur #TheFamilyStar pic.twitter.com/THHGDj6gkY
— THE Pavan Kumar Suman⭐ (@cult1_rowdy) April 30, 2024
కేవలం ఇండియాలో మాత్రమే కాదు... అమెరికాలోనూ 'ఫ్యామిలీ స్టార్' చూడటానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంతో ఓటీటీలో 'ఫ్యామిలీ స్టార్' సినిమాకు విశేష ఆదరణ లభిస్తోంది. ఓటీటీలో మూవీ విడుదలైన తర్వాత స్లిమ్ దోశ, రవి బాబుకు వార్నింగ్ ఇచ్చే సీన్లను ట్రోల్ చేస్తున్నారు. అటువంటి మిస్టేక్స్ ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. మూవీని ఎంజాయ్ చేస్తున్నారు.
After Watching #TheFamilystar Movie..Most Underrated Movie...Mee Negative Reviews and Trolling vala Movie ni Treater lo miss ayanu🥺Naku ee Movie Chala nachidi...Movie Chala Bagundi kadara😍🤗 @TheDeverakonda @mrunal0801 #HitThefamilystar
— Tej Goud (@prudvitej7) April 29, 2024
'ఫ్యామిలీ స్టార్' మీద వస్తున్న ట్రోలింగ్ పక్కన పెడితే... సినిమా తమ ఫ్యామిలీకి, స్నేహితులకు నచ్చిందని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న జనాలు సైతం ఉన్నారు. నెగిటివ్ పబ్లిసిటీ కారణంగా థియేటర్లలో తాము సినిమా చూడలేదని, కానీ ఇప్పుడు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేశామని కొందరు పేర్కొనడం గమనార్హం.
హీరో హీరోయిన్ల నటనకు ప్రశంసలు!
తన కోసం ఆలోచించకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా కుటుంబ సభ్యులకు అండగా నిలబడిన విజయ్ దేవరకొండ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆ పాత్రలో విజయ్ దేవరకొండ నటన కూడా! బాక్సాఫీస్ బరిలో డీసెంట్ కలెక్షన్స్ అందుకున్న 'ఫ్యామిలీ స్టార్'కు ఇప్పుడు ఓటీటీలో మంచి ఆదరణ దక్కుతోంది.
Criminal Name : @mrunal0801
— 𝘾𝙝𝙖𝙣𝙙𝙧𝙪ᵀᴴᴱ ᴳᴼᴬᵀ (@LoneWarriorOffl) April 28, 2024
Crime : Stolen millions of Heart🫰❤️#TheFamilyStar pic.twitter.com/krKY8Dpgta
'ఫ్యామిలీ స్టార్' సినిమాలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా యాక్ట్ చేశారు. 'గీత గోవిందం' తర్వాత హీరో విజయ్ దేవరకొండతో దర్శకుడు పరశురామ్ చేసిన చిత్రమిది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు, ఆయన సోదరుడు శిరీష్ ప్రొడ్యూస్ చేశారు. గోపీసుందర్ మ్యూజిక్ అందించారు.