అన్వేషించండి

Fahadh Faasil - RGV: ఫహాద్ ఫాజిల్‌తో కొత్త సినిమా చేస్తున్నారా? అసలు విషయం చెప్పేసిన రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ, పహాద్ ఫాజిల్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కటర్లు కొట్టాయి. ఈ విషయంపై స్పందించిన ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా అసలు విషయం చెప్పారు.

Fahadh Faasil - Ram Gopal Varma: స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, స్టార్ యాక్టర్ పహాద్ ఫాజిల్ కాంబోలో మూవీ వస్తే ఎలా ఉంటుంది? వింటేనే అద్భుతంగా అనిపిస్తోంది. తాజాగా వర్మ షేర్ చేసిన ఓ ఫోటో చూసి ప్రేక్షకులు అచ్చంగా ఇదే ఫీలయ్యారు. ఫహాద్ ఫాజిల్ ఓ గుహలో నిలబడి ఉండగా, ఓ మహిళ జుట్టు వీరబోసుకుని కనిపించింది. ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ “ఫహాద్ పై తొలి షాట్, ముఖంలో ఎక్స్ ప్రెషన్స్ అద్భుతం. తనకు తానే దర్శకత్వం వహించుకున్నాడు” అంటూ వర్మ రాసుకొచ్చారు. ఈ ఫోటో చూసి కచ్చితంగా ఇద్దరి కాంబోలో ఓ సినిమా వస్తుందని భావించారు. కొద్ది సేపటి తర్వాత వర్మ ఈ ఫోటో వెనుకున్న అసలు విషయాన్ని వెల్లడించారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

తాజాగా రాంగోపాల్ వర్మ ఆఫీసుకు ఫహాద్ ఫాజిల్ వెళ్లారు. ఆయన ఆఫీస్ చూసి షెకావత్ సార్ ఫిదా అయ్యారు. ఆఫీస్ లోని అన్ని ఫ్లోర్లను చూస్తూ మైమరచిపోయారు. స్టూడియోలోని గుహ లాంటి ప్లేస్ లో ఫహాద్ నిలబడి ఉండగా వర్మ ఫోటో తీశారు. ఆ ఫోటోను ట్విట్టర్ లో పెడితే వర్మ దర్శకత్వంలో ఆయన సినిమా చేస్తున్నారని చాలా మంది అనుకున్నారు. కానీ, ఇందులో వాస్తవం లేదని వర్మ వెల్లడించారు. ఇదే విషయాన్ని చెప్తూ ఫహాద్ తో కలిసి తీసుకున్నా ఫోటోను వర్మ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ రెండు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘ఆవేశం‘తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఫహాద్   

ఫహాద్ ఫాజిల్ రీసెంట్ గా మలయాళంలో నటించిన ‘ఆవేశం’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. క్రైమ్ కామెడీగా తెరకెక్కిన  ఈ సినిమా ప్రేక్షకులను అద్భుతంగా అలరించింది. ఇందులో పహద్ రంగా అనే రౌడీ క్యారెక్టర్ పోషించారు. సుమారు రూ. 20 కోట్లతో తెరకెక్కించిన  సినిమా ఏకంగా రూ. 150 కోట్లు పైగా వసూళు చేసింది. జీతూ మాధవన్ తెరకెక్కించిన ఈ సినిమాకు ఫహాద్ ఫాజిల్ నిర్మాతగా వ్యవహరించారు.

‘పుష్ప 2‘ విలన్ గా దుమ్మురేపనున్న షెకావత్ సార్..

‘పుష్ప’ సినిమాలో పోలీస్ అధికారి భన్వర్ సింగ్ షెకావత్ గా కనిపించి ఆకట్టుకున్నారు నటుడు ఫహాద్ ఫాజిల్. ‘పుష్ప 2’లో ఆయన క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్ బన్నీ క్యారెక్టర్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో, షెకావత్ సార్ విషయంలోనే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారట. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఆయన పోస్టర్ ఆకట్టుకుంది. పైన పోలీస్ చొక్కా, కింద లుండీ, ఓ చేతిలో గొడ్డలి, మరో చేతిలో రివాల్వర్ పట్టుకుని ఊర మాస్ లుక్ లో కనిపించి అదరగొట్టారు. ఇక ‘పుష్ప‘ సినిమాలో నటనకు గాను రూ. 3.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న ఫహాద్ ఫాజిల్.. ‘పుష్ప 2‘ మూవీ కోసం ఏకంగా రూ. 7.2 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన ‘వేట్టయాన్‘ సినిమాలో కనిపించి ఆకట్టుకున్నారు. వరుస సినిమాలతో పహాద్ ఫాజిల్ ఫుల్ బిజీగా ఉన్నారు.    

Also Read'వేట్టయన్' రివ్యూ: మాసీగా తీసిన క్లాస్ మెసేజ్ - వేటగాడు గురి పెడితే ... రజనీకాంత్ సినిమా ఎలా ఉందంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget