F3 Theatrical Trailer: 'ఎఫ్ 3' ట్రైలర్ విడుదల తేదీ ఖరారు, ఎప్పుడు వస్తుందంటే?
వెంకటేష్, తమన్నా ఓ జంటగా... వరుణ్ తేజ్, మెహరీన్ మరో జంటగా రూపొందిన సినిమా 'ఎఫ్ 3'. ఈ సినిమా విడుదల తేదీ ఖరారు అయ్యింది.
వెంకటేష్, తమన్నా ఓ జంటగా... వరుణ్ తేజ్, మెహరీన్ మరో జంటగా రూపొందిన సినిమా 'ఎఫ్ 3'. 'ఎఫ్ 2'లోనూ వీళ్ళు కనిపించారు. కొత్తగా ఈ సినిమాలో సోనాల్ చౌహన్ యాడ్ అయ్యారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రత్యేక గీతం చేశారు. మే 27న సినిమా విడుదల కానుంది. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... మే 9న సినిమా ట్రైలర్ (F3 movie Trailer On May 9) ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.
వేసవిలో సమ్మర్ సోగ్గాళ్లు వినోదం పంచుతారని 'ఎఫ్ 3' చిత్ర బృందం ధీమాగా చెబుతోంది. ఆల్రెడీ ఆడియన్స్ కూడా ఫన్ టాస్టిక్ మూవీ వస్తుందని అంచనాలు పెట్టుకున్నారు.
Also Read: చిరంజీవి సినిమా నుంచి రవితేజను తీసేశారా? లేదంటే తప్పించారా?
'ఎఫ్ 3' నుంచి ఆల్రెడీ రెండు సాంగ్స్ విడుదల చేశారు. 'లబ్ డబ్...', 'ఊ ఆ ఆహా ఆహా' సాంగ్స్ మంచి వ్యూస్ అందుకుంటున్నాయి. ముఖ్యంగా 'ఊ ఆ ఆహా ఆహా' పాటలో హీరోయిన్లు తమన్నా, మెహరీన్ కౌర్ ఫిర్జాదా గ్లామర్ హైలైట్ అయ్యింది. ఇప్పుడు పూజా హెగ్డే సాంగ్ కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్' రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఇందులో సునీల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
Also Read: ఆస్పత్రి నుంచి ఇంటికి తిరిగొచ్చిన బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్ర, అసలు ఆయన ఆరోగ్యం ఎలా ఉందంటే?
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.