అన్వేషించండి

Entertainment Top Stories Today: జానీ మాస్టర్‌ కేసుపై ఫిలిం ఛాంబర్‌ రియాక్షన్‌ to దేవర బెనిఫిట్‌ షో వివరాలు - నేటి సినీ టాప్ న్యూస్

Entertainment News Today In Telugu: తెలుగు చిత్రసీమలో నేడు హాట్‌టాపిక్‌గా జానీ మాస్టర్‌ లైంగిక వేధింపుల కేసు. అలాగే దేవర బెనిఫిట్‌ షోలపై చర్చ. మరి, ఇవాళ్టి టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ న్యూస్ ఏంటో చూసేయండి.

త్రివిక్రమ్‌పై పూనమ్‌ కౌర్‌ సంచలన ట్వీట్‌

ఇండస్ట్రీలో నటి పూనమ్‌ కౌర్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ వివాదం గురించి తెలిసిందే. గతంలో ఆమె మా అసోషియేషన్‌కు గురూజీపై ఫిర్యాదు చేసింది. గతంలోని ఈ వివాదాన్ని తాజాగా పూనమ్‌ కౌర్‌ మరోసారి తెరపైకి తెచ్చింది. తాను మాకు ఫిర్యాదు చేసిన అంశాన్ని గుర్తు చేస్తూ గురూజీని ప్రశ్నించాలని ఆమె సినీ పెద్దలను డిమాండ్‌ చేస్తూ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం జానీ మాస్టర్‌ లైంగిక వేధింపుల కేసు హాట్‌టాపిక్‌గా నిలిచిన నేపథ్యంలో పూనమ్‌ త్రివిక్రమ్‌ చేసిన ట్వీట్‌ సంచలనంగా మారింది. మరి ఆమె ట్వీట్‌పై సినీ పెద్దలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిని సంతరించుకుంది. (ఇంకా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ గురించి పూనమ్‌ కౌర్‌ ఏమన్నదో తెలియాలంటే ఈ లింక్‌ క్లిక్‌ చేయండి)

జానీ మాస్టర్‌ కేసుపై ఫిలిం ఛాంబర్‌ రియాక్షన్‌

జానీ మాస్టర్‌ లైంగిక వేధింపుల కేసు రోజురోజుకు ముదురుతుంది. ప్రముఖ కొరియోగ్రాఫరైన జానీ మాస్టర్‌పై 21 ఏళ్ల మహిళ కొరియోగ్రాఫర్‌ లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కొంతకాలం జానీ మాస్టర్‌ తనని లైంగిక, మానసికంగా వేధిస్తున్నాడంటూ బాధిత యువతి ఇటీవల హైదరాబాద్‌ నార్సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జానీ మాస్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఈ అంశంపై సినీ ప్రముఖులు, మహిళ నటులు స్పందిస్తూ జానీ మాస్టర్‌పై సీరియస్‌ అవుతున్నారు. అంతేకాదు ఆయనను తెలుగు ఫలిం డ్యాన్స్‌ అండ్‌ టీవీ డ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వ్యవహరంపై తాజాగా ఫిలిం ఛాంబర్‌ స్పందిస్తూ జానీ మాస్టర్‌ కేసుపై వివరణ ఇచ్చింది. (లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌ గురించి ఫిలిం ఛాంబర్‌ ఏం చెప్పిందో తెలుసుకోవాలంటే ఈ లింక్‌ని క్లిక్‌ చేయండి)

దేవర బెనిఫిట్‌ షోలకు భారీగా టికెట్స్‌ రేట్లు పెంపు? 

మరో పది రోజుల్లో మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్‌ దేవర మూవీ థియేటర్లో సందడి చేయబోతోంది. ఈ నేపథ్యంలో నెల రోజుల నుంచి దేవర మేనియా కొనసాగుతుంది. ఇప్పటికే ప్రీ సేల్లో దేవర దూకుడు చూపిస్తుంది. నార్త్‌ అమెరికాలో నెల రోజుల ముందే దేవర టికెట్స్‌ అడ్వాన్స్‌ బుక్కింగ్‌ ఒపెన్‌గా వాటికి భారీ రెస్పాన్స్‌ వస్తుంది. ప్రీ సేల్లో రికార్డు బిజినెస్‌ చేస్తుంది దేవర. ఇక దేవర క్రేజ్‌ నేపథ్యంలో మూవీ మేకర్స్‌ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. రిలీజ్‌ ముందు రోజు వేసే బెనిఫిట్‌ షోలను మిడ్‌ నైట్‌ వేయాలని థియేటర్లు నిర్ణయిస్తున్నాయి. ఈ మేరకు బెనిఫిట్‌ షోలకు భారీగా టికెట్‌ రేట్స్‌ నిర్ణయించాయట థియేటర్లు. (దేవర బెనిఫిట్‌ షోల టికెట్‌ రేట్స్‌ ఎంతో తెలియాలంటే ఈ లింక్‌ని క్లిక్‌ చేయండి)

జానీ మాస్టర్‌ కేసులో అల్లు అర్జున్‌ కీలక నిర్ణయం

Allu Arjun Assured The Victim Of The Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద లేడీ కొరియోగ్రాఫర్ తీవ్ర ఆరోపణలు చేసింది. తనపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు మతం మార్చుకోవాలని వేధించాడంటూ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జానీ మాస్టర్ తో పాటు ఆయన భార్య కూడా తీవ్రంగా హింసించినట్లు లేడీ కొరియోగ్రాఫర్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో జానీ మాస్టర్‌పై అత్యాచారం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదలయ్యాయి. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోంది. (జానీ మాస్టర్‌ కేసులో అల్లు అర్జున్‌ ఏమన్నారో తెలియాలంటే ఈ లింక్‌ క్లిక్‌ చేయండి) 

నయతార మూవీకి డైరెక్టర్‌ని మార్చిన మేకర్స్‌

సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార దేవతగా నటించి తమిళ చిత్రం 'ముకుత్తి అమ్మన్‌'. తెలుగులో 'అమ్మోరు తల్లి'. 2020లో నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి విశేష ఆదరణ లభించింది. నయనతార దేవత, నటుడు, డైరెక్టర్‌ బాలాజీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా డిస్ని ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదలై వీక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుంది.  దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా 'ముకుత్తి అమ్మన్‌ 2' తీసుకువస్తున్నారు. (నయనతార కొత్త సినిమాకు మార్చిన ఆ కొత్త డైరెక్టర్‌ ఎవరో తెలియాలంటే ఈ లింక్‌ని క్లిక్‌ చేయండి)

బాలయ్య తనయుడి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Mokshagna Debut Movie Budget: కథానాయకుడిగా గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తనయుడు మోక్షజ్ఞ పరిచయానికి రంగం సిద్ధమైంది. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మతో సినిమా అనౌన్స్ చేశారు. ఆ మూవీ బడ్జెట్ ఎంత? ఆ సినిమాకు మోక్షజ్ఞ రెమ్యూనరేషన్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే. (బాలయ్య తనయుడు మోక్షాజ్ఞ ఫస్ట్‌ మూవీ రెమ్యునరేషన్‌ ఎంతో తెలియాలంటే ఈ లింక్‌ని క్లిక్‌ చేయండి)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget