అన్వేషించండి

Allu Arjun: జానీ మాస్టర్ కేసులో అల్లు అర్జున్ కీలక నిర్ణయం - బాధితురాలికి అండగా నిలిచిన ఐకాన్ స్టార్?

జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో అల్లు అర్జున్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై తన ప్రతి మూవీలో బాధితురాలికి అవకాశం ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Allu Arjun Assured The Victim Of The Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద లేడీ కొరియోగ్రాఫర్ తీవ్ర ఆరోపణలు చేసింది. తనపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు మతం మార్చుకోవాలని వేధించాడంటూ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జానీ మాస్టర్ తో పాటు ఆయన భార్య కూడా తీవ్రంగా హింసించినట్లు లేడీ కొరియోగ్రాఫర్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో జానీ మాస్టర్‌పై అత్యాచారం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదలయ్యాయి. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోంది.

బాధితురాలికి అండగా ఐకాన్ స్టార్?  

జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణల కేసు ఫైల్ కావడం, ఆయనపై విమర్శలు వచ్చిన క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బాధితురాలికి అండగా ఉంటానని చెప్పారట. ఇకపై తాను నటించబోయే సినిమాలోనూ ఆమెకు అవకాశాలు ఇస్తానని మాటిచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు, తమ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ లో రూపొందే సినిమాల్లోనూ పని చేసే ఛాన్స్ ఇప్పిస్తామని భరోసా ఇచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. బాధితురాలు ఇప్పటికే ‘పుష్ప 2’ సినిమాలో పని చేసింది. మంచి టాలెంట్ ఉన్న కొరియోగ్రాఫర్ కావడంతో ఆమెకు ఇకపై తన సినిమాల్లో పని చేసే అవకాశం కలిపిస్తానని బన్నీ హామీ ఇచ్చారట. బాధితురాలికి అండగా ఉండాలనుకున్న బన్నీ మంచి మనసుపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎదుర్కొన్న అమ్మాయికి ఆసరాగా నిలవడం గొప్ప విషయం అంటున్నారు.  

అల్లు అర్జున్ ను టార్గెట్ చేసిన మెగా అభిమానులు

అటు మెగా అభిమానులు మాత్రం అల్లు అర్జున్ తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్, జనసేన పార్టీని టార్గెట్ చేసేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నారు. జానీ మాస్టర్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన గెలుపు కోసం ప్రయత్నించాడు. అంతేకాదు, హైపర్ ఆదితో చాలా క్లోజ్ గా ఉంటారు. జానీ మాస్టర్ బాధితురాలికి అండగా నిలవడం అంటే పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడమేనని మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీపై ఈ రకంగానూ అల్లు ఫ్యామిలీ రివేంజ్ తీర్చుకుంటుందని విమర్శిస్తున్నారు.    

ఫిర్యాదులో షాకింగ్ విషయాలు వెల్లడించిన యువతి

జానీ మాస్టర్ మీద లైంగిక ఆరోపణలు చేసిన యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సంచలన విషయాలు వెల్లడించింది. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని చెప్పింది. లైంగికంగానే కాకుండా, శారీరకంగా, మానసికంగానూ హించించాడని చెప్పుకొచ్చింది. ఢీ షో ద్వారా జానీ మాస్టర్‌ పరిచయం అయ్యాడని, ఆ తర్వాత ఆయన టీమ్ లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా అకాశం కల్పించాడని చెప్పింది. ఓ షో కోసం ముంబైకి తీసుకెళ్లి హోటల్ గదిలో తనపై అత్యాచారం చేశాడని చెప్పింది. ఈ విషయం బయట చెప్తే చంపేస్తానని బెదిరించాడని వెల్లడించింది. ఆ తర్వాత తనపై చాలా సార్లు లైంగికదాడికి పాల్పడ్డాడని చెప్పింది. షూటింగ్ టైమ్ లో క్యారవాన్ లోనూ లైంగిక వేధింపులకు పాల్పడేవాడని చెప్పింది. మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని వేధించినట్లు ఆరోపించింది. ఈ విషయం అతడి భార్యకు కూడా తెలుసని చెప్పింది. ఇద్దరూ కలిసి తనను ఓసారి కొట్టారని వెల్లడించింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.   

Also Read: ఎన్టీఆర్‌కు కాదు, కొరటాలకే అగ్ని పరీక్ష... 'దేవర' రిజల్ట్ దర్శకుడి కెరీర్‌కి చాలా ఇంపార్టెంట్

టాప్ హెడ్ లైన్స్

Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Embed widget