అన్వేషించండి

Jani Maser Case: జానీ మాస్టర్‌ కేసుపై ఫలిం ఛాంబర్‌ షాకింగ్‌ రియాక్షన్‌‌ - మీడియాతో ఏం చెప్పిందంటే! 

Jani Master Case: జానీ మాస్టర్‌ కేసుపై తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సంచలన విషయాలు వెల్లడించింది. ఈ కేసులో జానీ మాస్టర్‌ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశామన్నారు. ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటి నుంచి..

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ కేసు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతుంది. ఈ వ్యవహారం బయటకు రావడతో డ్యాన్స్‌ అసోసియేషన్‌ నుంచి ఆయనకు తీవ్ర వ్యతిరేకత వస్తుంది. తెలుగు ఫిలిం డ్యాన్స్‌ అండ్‌ టీవీ డ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఉన్న ఆయనను ఆ పదవి నుంచి తొలగించాలని అసోసియేషన్‌ సభ్యుల నుంచి డిమాండ్స్‌ వస్తున్నాయి. దీంతో ఆయనపై ఈ ఆరోపణలు తేలేవరకు జానీని అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఫెడరేషన్‌ను ఇప్పటికే ఆదేశించినట్టు ఫిలిం ఛాంబర్‌ సెక్రటరీ దామోదర్‌ ప్రసాద్‌ తెలిపారు.

అంతేకాదు పలువురు సినీ ప్రముఖులు కూడా జానీ మాస్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం మరింత ముదురుతుండటంతో ఏకంగా ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మీడియా సమావేశం నిర్వహించి దీనిపై వివరణ ఇచ్చింది. ఈ మీడియాలో సమావేశంలో ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వేజ్‌, ఫిలిం ఛాంబర్‌ సెక్రటరి మోదర్‌ ప్రసాద్‌, నటి, యాంకర్‌ జాన్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటి జాన్సీ మాట్లాడుతూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. జానీ మాస్టర్‌ ఆ అమ్మాయి ఎంతోకాలం వేధిస్తున్నాడని, తను మైనర్‌గా ఉన్నప్పటి నుంచే ఆమెకు వేధింపులు జరుగుతున్నాయని చెప్పారు.

అయితే ఇది వర్క్‌ ప్లేస్‌ జరగలేదని, అందువల్ల పూర్తిగా ఈ కేసు తమ పరిధిలో లేదని షాకింగ్‌ విషయం చెప్పారు. అదే విధంగా జాన్సీ మాట్లాడుతూ... "ఇండస్ట్రీలో మహిళా రక్షణ కోసం సరైన గెడ్ లైన్స్ లేవు. నటి శ్రీ రెడ్డి వివాదం తర్వాత మహిళలపై లైంగిక వేధింపులపై ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించాం. జానీ మాస్టర్ వ్యవహారం తెరపైకి వచ్చిన వెంటనే ఆ కమిటీ దీనిపై విచారణ చేస్తుంది. కానీ, మొదట ఆ యువతి తనకు వర్క్‌లో ఇబ్బంది ఉందని, తన టాలెంట్‌కి తగ్గ వర్క్‌ ఇవ్వడం లేదని మీడియా ముందుకు వెళ్లింది. అప్పుడే డ్యాన్సర్‌ అసోసియేషన్‌లో అవకతవకలు ఉన్నాయి. 

ఈ కేసు పూర్తిగా మా పరిధిలో లేదు

వాటిని మేము పరిశీలించి ఆమెకు వర్క్‌ ఇవ్వాలని ఫేడరేషన్‌ను ఆదేశించాం. ఇదంతా ఆమె లైంగిక వేధధింపుల ఆరోపణలు చేయకముందు జరిగింది. అప్పటి వరకు ఛాంబర్‌ ఆ అమ్మాయి చేయాల్సింది చేసింది. అయితే ఈ కార్డు విషయంలో జరిగిన విచారణలో లైంగిక వేధింపులు బయటకు వచ్చాయి. మొదట ఆ అమ్మాయి తనకు సరైన వర్క్‌ ఇవ్వడం లేదని, టాలెంట్‌కి తగ్గ గుర్తింపు లేదని చెప్పింది. కానీ దాని వెనక ఈ లైంగిక వేధింపులు ఉన్నాయని తర్వాత బయటపడింది. ఇదంత ఆమె మైనర్‌గా ఉన్నప్పటి నుంచే ఇది జరుగుతుంది. కానీ, ఈ కేసులో మేము జానీ మాస్టర్‌, బాధిత యువతి స్టేట్‌మెంట్‌ని రికార్డు చేసుకున్నాం. అయితే ఆ అమ్మాయి స్టేట్‌మెంట్‌ తీసుకుంటున్నప్పుడు ఈ లైంగిక వేధింపుల కేసు వర్క్ ప్లేస్‌లో జరగలేదని తేలింది.

ఇది చాలా సీరియస్ ఇష్యూ

ఇది చాలా సీరియస్‌ ఇష్యూ, ఈ కేసులో ఛాంబర్‌ ఆమెకు కొంతవరకే రిలీఫ్‌ ఇవ్వగలదు. ఎందుకంటే ఆమె మైనర్‌గా ఉన్నప్పటి నుంచి ఈ లైంగిక వేధింపులు జరిగాయి. చాలా రోజులుగా ఇది జరుగుతుంది కాబట్టి ఆ అమ్మాయికి లీగల్‌ సపోర్టు చాలా అవసరం. అందుకే ఛాంబర్‌ తరపున ఆమె భూమి హెల్ప్‌ లైన్‌ ద్వారా పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి క్లారిటీ రావాలంటే నెల, రెండు నెలలు టైం పడుతుంది. ఈ విషయంలో మీడియా నుంచి వస్తున్న సపోర్టు ప్రశంసనీయం. కానీ ఛాంబర్‌ నుంచి ఆమె న్యాయం కొంతవరకు జరగుతుంది. ఇది పూర్తిగా మా పరిధిలో లేదు. లీగల్‌గా ముందుకు వెళుతున్న ఆ అమ్మాయికి మా మద్దతు ఉంటుంది. ఆమె న్యాయం జరిగిలే చేస్తాం" అంటూ జాన్సీ చెప్పుకొచ్చింది.  

Also Read: లైంగిక వేధింపుల కేసు - జానీ మాస్టర్‌పై నటి పూనమ్‌ కౌర్‌ సంచలన కామెంట్స్‌

టాప్ హెడ్ లైన్స్

Samantha On Pregnancy: తల్లి కావాలని ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నా - సమంత ఇంటర్వ్యూ
తల్లి కావాలని ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నా - సమంత ఇంటర్వ్యూ
Hema Buys Mercedes Benz GLS 450d: హేమ గ్యారేజ్‌లో బెంజ్ జీఎల్ఎస్ 450D... కారు ఫీచర్స్ తెలుసా? రేటు కోటిన్నర కంటే ఎక్కువ
హేమ గ్యారేజ్‌లో బెంజ్ జీఎల్ఎస్ 450D... కారు ఫీచర్స్ తెలుసా? రేటు కోటిన్నర కంటే ఎక్కువ
Allu Arjun: బసిల్ జోసెఫ్‌తో అల్లు అర్జున్ సినిమా కన్ఫర్మ్... హింట్ ఇచ్చిన దర్శకుడు
బసిల్ జోసెఫ్‌తో అల్లు అర్జున్ సినిమా కన్ఫర్మ్... హింట్ ఇచ్చిన దర్శకుడు
Madhurapuri Sadhana OTT : ఓటీటీలోకి మిడిల్ క్లాస్ హార్ట్ టచింగ్ మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి మిడిల్ క్లాస్ హార్ట్ టచింగ్ మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
HYDRAA Demolitions: హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
US Iran War: తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
TTD Latest News: తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
Visakhapatnam Latest News:వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
Maruti S-Presso Price in Hyderabad: హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
Embed widget