Emraan Hashmi OG First Look: ఒమీ భాయ్ - పవన్ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ హీరో లుక్ వచ్చేసింది
Pawan Kalyan's OG Movie Villain First Look: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ'లో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేస్తున్నారు. ఇవాళ ఆయన బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
ముంబై మాఫియా నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా 'ఓజీ' (OG Movie). దే కాల్ హిమ్ ఓజీ... అనేది ఫుల్ టైటిల్. 'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్ రోల్ చేస్తున్నారు. ఈ రోజు ఆయన బర్త్ డే. ఈ సందర్భంగాలో 'ఓజీ'లో ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
ఒమీ భాయ్... ఇమ్రాన్ హష్మీ
Emraan Hashmi character name in OG: 'ఓజీ' సినిమాలో ఒమీ భావు పాత్రలో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. భావు అంటే బ్రదర్ / భాయ్ అని అర్థం. ఆయన ఫస్ట్ లుక్ చూస్తే... చేతి వేలిపై టాటూ, కంటి పై భాగంలో రెండు కుట్లు వేసిన ఘాటు - ఇమ్రాన్ హష్మీని సినిమాలో కొత్తగా చూపించబోతున్నట్లు అర్థం అవుతోంది. సల్మాన్ ఖాన్ 'టైగర్ 3'లో ఆయన విలన్ రాయల్ చేశారు. అయితే... 'ఓజీ'లో ఇప్పటి వరకు ఇమ్రాన్ హష్మీని ఎప్పుడూ చూడని కొత్త లుక్, పాత్రలో చూస్తారని చిత్ర బృందం చెబుతోంది.
Also Read: వెంకటేష్, అనిల్ రావిపూడి లేటెస్ట్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్... ఆయన ఎవరంటే?
రెబల్ స్టార్ ప్రభాస్ 'సాహో' తర్వాత సుజీత్ (Sujeeth) దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇదీ పాన్ ఇండియా సినిమాయే. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ ఆర్టిస్టులు నటిస్తున్నారు. శ్రీమతి పార్వతి సమర్పణలో డీవీవీ మూవీస్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
అత్తారింటికి దారేది విడుదలైన రోజు...
థియేటర్లలోకి ఓజీ వచ్చేది కూడా ఆ రోజే!
'ఓజీ' వీడియో గ్లింప్స్ పవన్ కళ్యాణ్ అభిమానులకు విపరీతంగా నచ్చింది. ఇంకా సాధారణ ప్రేక్షకుల్లో సైతం సినిమాపై ఆసక్తి కలిగించింది. 'అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే ' డైలాగ్ వైరల్ అయ్యింది. ఆ మాట రిలీజ్ డేట్ విషయంలో కూడా కనెక్ట్ అయ్యేలా ఉంది.
పవన్ కళ్యాణ్ సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో 'అత్తారింటికి దారేది' ఒకటి. ఆ సినిమా సెప్టెంబర్ 27న విడుదల అయ్యింది. ఆ తేదీకి 'ఓజీ'ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. సెప్టెంబర్ 27న సినిమా రిలీజ్ అని అనౌన్స్ చేశారు.
Also Read: రెండో రోజు పెరిగిన 'ఓం భీమ్ బుష్' కలెక్షన్స్ - టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Happy Birthday deadliest OMI BHAU… @emraanhashmi
— DVV Entertainment (@DVVMovies) March 24, 2024
Couldn’t imagine a clash more electrifying than with #OG 💥#TheyCallHimOG pic.twitter.com/HzXCznJn8U
కథానాయికగా ప్రియాంక అరుల్ మోహన్!
'ఓజీ'లో పవన్ కళ్యాణ్ సరసన తమిళ అమ్మాయి ప్రియాంకా అరుల్ మోహన్ (Priyanka Arul Mohan) నటిస్తున్నారు. తెలుగులో నాని 'గ్యాంగ్ లీడర్' చేశారామె. శర్వానంద్ 'శ్రీకారం'లోనూ నటించారు. శివకార్తికేయన్ 'డాక్టర్' (తెలుగులో 'వరుణ్ డాక్టర్'గా విడుదలైంది), 'డాన్' ఆమెకు భారీ విజయాలు అందించాయి. ప్రకాష్ రాజ్, వెంకట్, హరీష్ ఉత్తమన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.