అన్వేషించండి

Dune: Prophecy Teaser: ‘డ్యూన్: ప్రాఫెసీ’ టీజర్ - ఎట్టకేలకు టబు లుక్‌ను రివీల్ చేసిన మేకర్స్

Dune: Prophecy Teaser: ‘డ్యూన్’ లాంటి ప్రతిష్టాత్మక ఫ్రాంచైజ్‌లో కీలక పాత్ర చేసే ఛాన్స్ కొట్టేసింది. తాజాగా ‘డ్యూన్: ప్రాఫెసీ’ రెండో టీజర్ విడుదలవ్వగా ఇందులో తన ఫస్ట్ లుక్ రివీల్ అయ్యింది.

Tabu In Dune: Prophecy Teaser: ఇప్పటికే ఎంతోమంది బాలీవుడ్ నటీనటులు హాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సక్సెస్ అందుకున్నారు. అందులో టబు కూడా ఒకరు. ఇప్పటికే టబు ఒకట్రెండు ఇంగ్లీష్ సినిమాల్లో నటించింది. కొన్నాళ్ల క్రితం ‘డ్యూన్’ ఫ్రాంచైజ్‌లో టబు నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఆ విషయాన్ని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు కూడా. దీంతో టబు ఫ్యాన్స్ అంతా చాలా ఎగ్జైట్ అయ్యారు. కొన్నాళ్ల క్రితం విడుదలయిన ‘డ్యూన్: ప్రాఫెసీ’ టీజర్‌లో టబు ఉందేమో అని వెతికారు. కానీ అందులో ఎక్కడా టబును గుర్తించలేకపోయారు. కానీ తాజాగా ‘డ్యూన్: ప్రాఫెసీ’ నుండి టబు లుక్‌ను రివీల్ చేశారు మేకర్స్.

సిస్టర్‌గా టబు..

ఇప్పటికే ‘డ్యూన్: ప్రాఫెసీ’ నుండి ఒక టీజర్ విడుదలయ్యింది. అందులో టబు ఎక్కడా కనిపించలేదు. కానీ తాజాగా విడుదలయిన ‘డ్యూన్: ప్రాఫెసీ’ రెండో టీజర్‌లో టబు కనిపించింది. టీజర్ చివర్లో తన క్యారెక్టర్‌కు సంబంధించిన చిన్న గ్లింప్స్‌ను చూపించారు మేకర్స్. ఇందులో తను సిస్టర్ ఫ్రానెస్కా రోల్‌లో కనిపించనుందని కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఈ టీజర్‌లో టబుకు డైలాగులు ఏమీ లేవు. బ్లాక్ డ్రెస్సులో సిస్టర్ యూనిఫార్మ్‌లో హుందాగా నిలబడి ఉన్న టబును ఈ టీజర్‌లో చూపించారు. ఇందులో తను చేతులు కట్టుకొని నేరుగా ఎవరినో చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక టబు క్యారెక్టర్ గురించి పక్కన పెడితే.. ఈ టీజర్‌లో ‘డ్యూన్: ప్రాఫెసీ’ గురించి వివరించే మరెన్నో అంశాలు కూడా ఉన్నాయి.

సిస్టర్స్‌గా ఎలా మారారు?

‘డ్యూన్: ప్రాఫెసీ’లో కొందరు అమ్మాయిలను సిస్టర్స్ ఎలా మార్చారు అనేది స్పష్టంగా చూపించనున్నారు. ఇప్పటికే విడుదలయిన రెండు టీజర్స్‌లో ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు మేకర్స్. బెనీ జెసరెట్ చేత అందరు అమ్మాయిలకు సిస్టర్స్ అవ్వడానికి ట్రైనింగ్ ఇప్పిస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ‘డ్యూన్: ప్రాఫెసీ’ కథ. దీనికి సంబంధించిన రెండు టీజర్‌ను విడుదల చేసిన మేకర్స్.. ‘కంట్రోల్ చేయడంలోనే నిజమైన పవర్ దాగి ఉంటుంది’ అని క్యాప్షన్ కూడా జతచేశారు. ఇక ఇందులో టబు కూడా ఒక కీలక పాత్రలో కనిపించనుందని, ఇందులో తను చాలా బలమైన, తెలివైన సిస్టర్ పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది.

ప్రీక్వెల్ కథ..

‘డ్యూన్: ప్రాఫెసీ’ మూవీ డ్యూన్ యూనివర్స్‌కు ప్రీక్వెల్‌గా తెరకెక్కింది. దీని కథ మొత్తం బెనీ జెసరేట్ సిస్టర్‌హుడ్ చుట్టూనే తిరుగుతుంది. బెనీ జెసరేట్ శక్తులు ఒక్కొక్కటిగా ఎలా పెరిగాయి? వారి శక్తులు పెరగడం కోసం ఏం చేశారు? అనేదానిపై ‘డ్యూన్: ప్రాఫెసీ’ కథ నడుస్తుందని టీజర్లు చూసిన ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ మూవీలో టబుతో పాటు ముఖ్యమైన సిస్టర్స్ పాత్రల్లో చాలామంది నటీనటులు కనిపించనున్నారు. మొదటి టీజర్‌లో టబు స్పష్టంగా కనిపించకపోవడంతో ఇందులో తను కూడా అందరిలాగా ఒక సిస్టర్ అయ్యిండొచ్చు అని అందరూ అనుకున్నారు. కానీ రెండో టీజర్‌ను బట్టి చూస్తే ఇందులో టబు కీ రోల్ ప్లే చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: బయట నుంచి చూసేవారికి అది అర్థం కాకపోవచ్చు - ‘కల్కి 2898 ఏడీ’లోని ఆ సీన్‌పై అమితాబ్ వివరణ

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
Nandamuri Mokshagna: ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
Balakrishna: డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?
డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Embed widget