Dulquer Salmaan: నొప్పితోనే షూటింగ్... ‘లక్కీ భాస్కర్‘ కోసం దుల్కర్ సల్మాన్ ఇంత కష్టపడ్డారా?
Lucky Bhaskar Movie: ‘లక్కీ భాస్కర్‘ షూటింగ్ సమయంలో తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్లు దుల్కర్ సల్మాన్ చెప్పారు. అందుకే సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యిందన్నారు.

Dulquer Salma Health Issues: ‘సీతారామం‘ సినిమాతో తెలుగు ప్రేక్షకలు హృదయాల్లో చెరగని ముద్ర వేసిన దుల్కర్ సల్మాన్.. ఇప్పుడు ‘లక్కీ భాస్కర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న దుల్కర్ సల్మాన్... సినిమాతో పాటు తన ఆరోగ్య సమస్యల గురించి కీలక విషయాలు వెల్లడించారు.
అనారోగ్యం వల్లే ‘లక్కీ భాస్కర్’ ఆలస్యం
‘లక్కీ భాస్కర్’ సినిమా షూటింగ్ సమయంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడినట్లు దుల్కర్ సల్మాన్ తెలిపారు. హెల్త్ ఇష్యూస్ కారణంగానే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యిందన్నారు. “నాకు ఎప్పుడూ సినిమాలు చేస్తూనే ఉండాలి అనిపిస్తుంది. సినిమాకు సినిమాకు మధ్య గ్యాప్ తీసుకోవడం అంతగా నచ్చదు. ఈ ఏడాది ఇంకో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కొన్ని అనుకోని కారణాల వల్ల ఓ సినిమా క్యాన్సిల్ అయ్యింది. మరో సినిమా చివరి నిమిషంలో వదులుకోవాల్సి వచ్చింది. అనారోగ్య సమస్యల కారణంగానే ‘లక్కీ భాస్కర్’ సినిమా కూడా ఆలస్యం అయ్యింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో చిత్ర బృందం నాకు ఎంతో సహకరించింది. ఎంతో సపోర్టుగా నిలిచింది. డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ నుంచి మొదలుకొని లైట్ మెన్ వరకు జాగ్రత్తగా చూసుకున్నారు. ఒక్కోసారి సినిమా షూటింగ్ ఆపేద్దామని చెప్పేవారు. రెస్ట్ తీసుకోవాలని సూచించే వాళ్లు. కానీ, భారీ సెట్స్ వేసి షూట్ చేస్తున్న సమయంలో నా కారణంగా షూటింగ్ ఆగిపోకూడదు అనుకునేవాడిని. ఎంత పెయిన్ ఉన్నప్పటికీ షూటింగ్ లో పాల్గొనేవాడి. చాలా కష్టపడి ‘లక్కీ భాస్కర్’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశాను” అని చెప్పుకొచ్చారు. అటు ఈ సినిమా కోసం దుల్కర్ సల్మాన్ చాలా కష్టపడ్డారని దర్శకుడు వెంకీ అట్లూరి వెల్లడించారు. ఒక్కోసారి ఆయన 15 గంటల పాటు షూటింగ్ లో పాల్గొనేవారని చెప్పారు. ఆయనను ఇబ్బంది పెడుతున్నామని బాధపడినా, ఫర్వాలేదంటూ షూటింగ్ లో పాల్గొనే వారని చెప్పారు. సినిమా కోసం ఆయన ఎంత కష్టమైనా భరిస్తారని చెప్పుకొచ్చారు.
ఆక్టోబర్ 31న ‘లక్కీ భాస్కర్’ విడుదల
దుల్కర్ సల్మాన్ హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డబ్బు సంపాదనతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నది. సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది. తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు ఇలాంటి పాయింట్ తో ఏ సినిమా రాలేదన్నారు మేకర్స్. యూనిక్ స్టోరీతో ప్రేక్షకులను అద్భుతంగా అరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఆయేషా ఖాన్ మరో కీలక పాత్రలోకనిపించనుంది. డ్రామా థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కానుంది.
Read Also: మాకూ హార్ట్ ఉంది... రెస్పెక్ట్ ఇవ్వండి - ఫీమేల్ జర్నలిస్టుకు అనన్య నాగళ్ల ఇన్‌డైరెక్ట్ కౌంటర్?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

