వెంకీ అట్లూరి - దుల్కర్ సల్మాన్ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్ - ఆకట్టుకుంటున్న పోస్టర్!
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్నారు. తాజాగా దుల్కర్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాకు సంబంధించి టైటిల్ పోస్టర్ ని విడుదల చేశారు.

మలయాళం లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్ 'సీతారామం' సినిమాతో తెలుగు ఆడియన్స్ కి ఎంతో దగ్గరయ్యాడు. అంతకుముందు పలు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన దుల్కర్.. 'సీతారామం' సక్సెస్ తో ఏకంగా తెలుగులో స్ట్రైట్ మూవీ చేస్తున్నాడు. హను రాఘవపూడి తెరకెక్కించిన 'సీతారామం' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి క్లాసిక్ లవ్ స్టోరీ గా నిలిచిపోయింది. తెలుగు ప్రేక్షకులు సైతం సినిమాలో దుల్కర్, మృనాల్ ఠాగూర్ నటనపై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే దుల్కర్ ఇప్పుడు నేరుగా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తో స్ట్రైట్ తెలుగు మూవీ చేస్తున్నాడు. రీసెంట్ గానే 'సార్' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి తన నెక్స్ట్ సినిమాకి హీరోగా దుల్కర్ సల్మాన్ ని ఎంపిక చేసుకున్నాడు.
ఈ క్రమంలోనే జూలై 28న దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ని విడుదల చేశారు. వెంకీ అట్లూరి - దుల్కర్ సల్మాన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'లక్కీ భాస్కర్' అనే టైటిల్ని చిత్ర యూనిట్ ఖరారు చేసింది. ఈ మేరకు ఈ సినిమాని నిర్మిస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ ట్విట్టర్ వేదికగా పోస్టర్ని రిలీజ్ చేస్తూ దుల్కర్ సల్మాన్ కి బర్త్డే విషెస్ అందజేశారు. ఇక ఈ పోస్టర్లో దుల్కర్ సల్మాన్ ముఖంపై పాత వంద రూపాయల నోటు ఉంది. బ్యాక్ గ్రౌండ్ లోనూ కొన్ని నోట్లు ఉన్నాయి. 'లక్కీ భాస్కర్' టైటిల్లో భాస్కర్ అనే ఇంగ్లీష్ పేరుకు చివరిలో రూపాయి సింబల్ ఉంది. అలాగే భాస్కర్ అనే స్పెల్లింగ్ కూడా విభిన్నంగా ఉంది. దీంతో లక్కీ భాస్కర్ కథ మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుందని పోస్టర్ చూస్తే స్పష్టమవుతుంది.
అంతేకాకుండా ఒక సాధారణ మనిషి ధనవంతుడిగా ఎలా ఎదిగాడు అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం అని తెలుస్తోంది. ఇక తాజాగా విడుదలైన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతమందిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. అక్టోబర్ నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమాని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. కాగా దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం మలయాళం లో 'కింగ్ ఆఫ్ కోథా' అనే సినిమా చేస్తున్నారు.
ఈ సినిమాని కూడా పాన్ ఇండియా స్థాయిలో మలయాళ, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. సినిమాలో దుల్కర్ ఓ గ్యాంగ్ స్టార్ గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి అనూహ్య స్పందన లభించింది. అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దుల్కర్ సల్మాన్ స్వయంగా తన సొంత ప్రొడక్షన్ హౌస్ వేఫార్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక తాజాగా దుల్కర్ సల్మాన్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలై మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ఆగస్టు 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Presenting you #LuckyBaskhar - Embark on a Captivating Journey, The Unraveling Triumphs of an Ordinary Man! 📈🎬
— Sithara Entertainments (@SitharaEnts) July 28, 2023
Wishing the man of elegance and charm, @dulQuer, a very Happy Birthday! 🎉#HBDDulquerSalmaan #VenkyAtluri @gvprakash @NavinNooli @Banglan16034849 #SaiSoujanya… pic.twitter.com/PgANYt4c6g
Also Read : 'బ్రో ' సినిమా చూసేందుకు థియేటర్ కి వచ్చిన అకిరా నందన్ - చుట్టుముట్టిన ఫ్యాన్స్, వీడియో వైరల్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు





















