అన్వేషించండి

Double Ismart Movie: డబుల్ ఇస్మార్ట్ నైజాం పంచాయతీ... బుకింగ్స్ ఓపెన్ అయ్యేది ఎప్పుడు?

Double iSmart Release Date: 'డబుల్ ఇస్మార్ట్' నైజాం రిలీజుకు చిక్కులు తప్పవా? ప్రైమ్ షో ఫిలిమ్స్ డైరెక్ట్ రిలీజుకు వచ్చినా బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదు ఎందుకు? అనేది పెద్ద ప్రశ్నగా మారింది.

Double Ismart Nizam Distributor and Release: 'డబుల్ ఇస్మార్ట్' పంద్రాగస్టుకు థియేటర్లలో విడుదలకు రెడీ అయ్యింది. బాక్సాఫీస్ బరిలో నిలిచిన మరొక సినిమా రవితేజ 'మిస్టర్ బచ్చన్' ప్రీమియర్ షో బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. కానీ, 'డబుల్ ఇస్మార్ట్' బుకింగ్స్ మాత్రం ఓపెన్ కాలేదు. అవునా... నిజమా... అని గట్టిగా అడిగితే అయ్యాయని చెప్పాలి. కానీ, నైజాం ఏరియాలో మాత్రం ఇంకా కాలేదు. దీని వెనుక జరిగిన పంచాయితీలు చాలా ఉన్నాయి. తెర వెనుక పెద్ద కహాని జరుగుతోంది.

బయ్యర్ లేడు... ప్రైమ్ షో డైరెక్ట్ రిలీజ్!
'డబుల్ ఇస్మార్ట్' డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh)కు, నైజాంలో థియేటర్స్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య గొడవలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా పూరి తీసిన 'లైగర్' డిజాస్టర్ కావడంతో రిలీజ్ చేసిన ఎగ్జిబిటర్లకు భారీ లాస్ వచ్చింది. వరంగల్ శ్రీను, పూరికి మధ్య గొడవ జరిగింది. పోలీస్ స్టేషన్, కోర్టుల వరకు వెళ్లింది మేటర్. అందువల్ల, సినిమా రిలీజ్ కష్టం అనుకున్నారు. 

'లైగర్' డిస్ట్రిబ్యూషన్ గొడవలు, ముఖ్యంగా నైజాం ఇష్యూ నేపథ్యంలో పూరి, ఛార్మి కౌర్ (Charmy Kaur) హైదరాబాద్ సిటీకి ముఖం చాటేశారని ప్రచారం జరిగింది. 'డబుల్ ఇస్మార్ట్' పనులు ముంబైలో ఎక్కువ చేయించారు. అసలు నైజాంలో రిలీజ్ డౌట్, సినిమాను కొనే నాథుడు లేడని డిస్కషన్స్ జరుగుతున్న టైంలో పూరి, ఛార్మి పాలిట దేవుడిలా 'హనుమాన్' ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి వచ్చాడు. భారీ అమౌంట్ ఇచ్చి రైట్స్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ 54 కోట్లు నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ ఇచ్చి 'డబుల్ ఇస్మార్ట్' కొనేశారు. కానీ, సినిమాను రిలీజ్ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో నైజాం వరకు ప్రైమ్ షో ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఓపెన్ చేసి ఓన్ రిలీజ్ చేస్తున్నారు. 

'డబుల్ ఇస్మార్ట్'కు థియేటర్లకు ఇచ్చేది ఎవరు?
ప్రైమ్ షో ఫిలిమ్స్ నైజాంలో 'డబుల్ ఇస్మార్ట్' రిలీజ్ చేయాలని అడుగు ముందుకు వేసింది. కానీ, థియేటర్లు ఇచ్చేది ఎవరు? అనేది పెద్ద క్వశ్చన్. 'మిస్టర్ బచ్చన్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హరీష్ శంకర్ ఒక మాట అన్నాడు. మైతీ మూవీస్ తన సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నా థియేటర్లు అడ్జస్ట్ చేసిన శిరీష్ రెడ్డి (దిల్ రాజు బ్రదర్)కు థాంక్స్ చెప్పాడు.

'మిస్టర్ బచ్చన్'కు మైత్రీ సంస్థతో పాటు దిల్ రాజు బ్రదర్స్ సపోర్ట్ ఉంది. ఇప్పుడు మెజారిటీ సినిమా హాళ్లు వాళ్లిద్దరి కంట్రోల్‌లో ఉన్నాయి. ఏషియన్ - సురేష్ డిస్ట్రిబ్యూషన్ కూడా స్ట్రాంగ్ ప్లేయర్. అయితే... పూరి, ఛార్మి మీద ఉన్న కోపంతో మెయిన్ సెంటర్లలో కొందరు థియేటర్స్ ఓనర్లు 'డబుల్ ఇస్మార్ట్' షోస్ వేయడానికి నో అంటున్నార్ట.

Also Read: మిస్టర్ బచ్చన్ వర్సెస్ డబుల్ ఇస్మార్ట్... రవితేజ కంటే రామ్ సినిమాకు ఎక్కువ క్రేజ్... బిజినెస్ కూడా ఎక్కువేనా?


విజయ్ దేవరకొండ 'లైగర్' రిలీజుకు ముందు చేసుకున్న అగ్రిమెంట్స్ ప్రకారం ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు పూరి, ఛార్మి రూపాయి వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ, ఎథిక్స్ ప్రకారం ఎంతో కొంత ఇవ్వాలి. లాస్ అమౌంట్ 40 పర్సెంట్ ఇస్తే చాలని బాధితులు ముందుకు వచ్చారు. కానీ, డీల్ సెటిల్ కాలేదు. దాంతో ఇప్పటి వరకు బుకింగ్స్ ఓపెన్ కాలేదు. వీలైనంత త్వరగా ఈ ఇష్యూను పూరి, ఛార్మి సెటిల్ చేసుకోకపోతే 'డబుల్ ఇస్మార్ట్' ఓపెనింగ్ డే కలెక్షన్స్ అడ్వాంటేజ్ కోల్పోతుంది.

Also Read'కల్కి 2898 ఏడీ'... వచ్చే వారమే ప్రైమ్ వీడియో ఓటీటీలోకి... అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Politics: మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
YS Sharmila: భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
TTD News: సమ్మర్‌లో శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా ? - ఇదిగో ప్రత్యేక రైళ్ల జాబితా - టిక్కెట్లు బుక్ చేస్కోండి
సమ్మర్‌లో శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా ? - ఇదిగో ప్రత్యేక రైళ్ల జాబితా - టిక్కెట్లు బుక్ చేస్కోండి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB Home Ground Sad Story IPL 2025 | సొంత మైదానంలోనే ఆర్సీబీకి షాకులుKL Rahul 93* vs RCB IPL 2025 | కేఎల్ రాహుల్ మాస్ ఇన్నింగ్స్ కు అసలు రీజన్ ఇదేKL Rahul Strong Statement | RCB vs DC మ్యాచ్ లో వీర విజృంభణ తర్వాత కేఎల్ రాహుల్ మాస్RCB vs DC Match Highlights IPL 2025 | ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ జయభేరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics: మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
YS Sharmila: భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
TTD News: సమ్మర్‌లో శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా ? - ఇదిగో ప్రత్యేక రైళ్ల జాబితా - టిక్కెట్లు బుక్ చేస్కోండి
సమ్మర్‌లో శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారా ? - ఇదిగో ప్రత్యేక రైళ్ల జాబితా - టిక్కెట్లు బుక్ చేస్కోండి
AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాలపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన, రిజల్ట్స్ ఎప్పుడంటే
ఏపీ ఇంటర్ ఫలితాలపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన, రిజల్ట్స్ ఎప్పుడంటే
Hyderabad Traffic: హైదరాబాద్‌వాసులకు బిగ్‌ అలర్ట్‌- శనివారం హనుమాన్‌ విజయ యాత్ర సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ రూట్స్ ఇవే
హైదరాబాద్‌వాసులకు బిగ్‌ అలర్ట్‌- శనివారం హనుమాన్‌ విజయ యాత్ర సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ రూట్స్ ఇవే
TamilNadu Minister: హిందూ దేవతల్ని ఘోరంగా అవమానించిన తమిళనాడు మంత్రి - దేవుళ్లంటే ఇంత అలుసా ? వీడియో
హిందూ దేవతల్ని ఘోరంగా అవమానించిన తమిళనాడు మంత్రి - దేవుళ్లంటే ఇంత అలుసా ? వీడియో
Hit and Run Case: హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్, బీఫార్మసీ విద్యార్థిని మృతి- నిందితుడ్ని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్, బీఫార్మసీ విద్యార్థిని మృతి- నిందితుడ్ని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
Embed widget