అన్వేషించండి

Double iSmart : ప్రభాస్ 'కల్కి' రిలీజ్ డేట్‌పై కన్నేసిన ఉస్తాద్ హీరో?

Double Ismart : 'డబుల్ ఇస్మార్ట్' మూవీని 'కల్కి' రిలీజ్ డేట్ కి విడుదల చేయాలని ప్లాన్ చేసున్నట్లు సమాచారం.

Double iSmart Release Date : టాలీవుడ్ లో ఈ ఏడాది రానున్న అగ్ర హీరోల పాన్ ఇండియా సినిమాల రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ అవ్వడం ఎంత హాట్ టాపిక్ అవుతుందో తెలిసిందే. ఎన్టీఆర్ 'దేవర', అల్లు అర్జున్ 'పుష్ప2' ప్రభాస్ 'కల్కి', రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' లాంటి చిత్రాలు వాయిదా పడబోతుండడంతో వాటి స్థానంలో మీడియం బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా 'పుష్ప2' రిలీజ్ డేట్ పై అరడజనుకు పైగా సినిమాలు కన్నేసాయి. ఇక ఇప్పుడు ప్రభాస్ 'కల్కి' రిలీజ్ డేట్ పై మరో సినిమా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

'కల్కి' రిలీజ్ డేట్ పై కన్నేసిన 'డబుల్ ఇస్మార్ట్'

డైరెక్టర్ పూరి జగన్నాథ్ - ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'డబుల్ ఇస్మార్ట్' మూవీ ప్రభాస్ 'కల్కి' రిలీజ్ డేట్ పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. మొదట ఈ సినిమాని శివరాత్రి కానుకగా మార్చి 8న విడుదల చేయాలని అనుకున్నారు. సినిమా అనౌన్స్ చేసినప్పుడే రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. కానీ సినిమాకు సంబంధించి ఇంకా పెండింగ్ వర్క్ ఉండడంతో మే నెలలో రిలీజ్ చేయాలని చూస్తున్నారట.

అది కూడా 'కల్కి' రిలీజ్ డేట్ అయిన 9 కి 'డబుల్ ఇస్మార్ట్' ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ 'కల్కి' రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వకుంటే మే 23 మరో ఆప్షన్ గా పెట్టుకున్నట్లు సమాచారం. ఈ రెండిట్లో ఏదో ఒక డేట్ ని డబుల్ ఇస్మార్ట్ టీమ్ రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

'పుష్ప2' పోస్ట్ పోన్ కోసం ఎదురుచూస్తున్న సినిమాలు.. 

 అల్లు అర్జున్ 'పుష్ప 2' కనుక పోస్ట్ పోన్ అయితే దాదాపు ఆరు సినిమాలకు లైన్ క్లియర్ అవుతుంది. ఈ సినిమాని ఆగస్టు నుంచి పోస్ట్ పోన్ చేస్తే ఆ నెలలో కమల్ హాసన్ 'ఇండియన్ 2', సూర్య కంగువ, రజనీకాంత్ 'వెటయాన్', ఎన్టీఆర్ 'దేవర', నాని 'సరిపోదా శనివారం', అజయ్ దేవగన్ 'సింగం అగైన్' వంటి సినిమాలు థియేటర్స్ లోకి రావాలని చూస్తున్నాయి. 'పుష్ప 2' కోసం టాలీవుడ్ లోనే కాదు అన్ని భాషల ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకే ఈ సినిమా పోస్ట్ పోన్ అయితే తెలుగుతోపాటు తమిళ, హిందీ సినిమాలు సైతం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నాయి.

'ఇస్మార్ట్ శంకర్' కి సీక్వెల్ గా 'డబుల్ ఇస్మార్ట్'

పూరి జగన్నాథ్ రామ్ పోతినేని కాంబినేషన్లో 2019లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకి సీక్వెల్ గా 'డబుల్ ఇస్మార్ట్' తెరకెక్కుతోంది. ఈ సీక్వెల్ ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్ దత్ ఇందులో విలన్ గా నటిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ కి అదిరిపోయే ఆల్బమ్ ఇచ్చిన మణిశర్మ మరోసారి ఈ సీక్వెల్ కి మ్యూజిక్ అందిస్తున్నారు.

Also Read : చిరంజీవి దగ్గరకు వెళ్లిన పవన్ కళ్యాణ్ దర్శకుడు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget