అన్వేషించండి

Divi Vadthya: అలా జరగాలంటే మనం తోపులం అయ్యుండాలి - సోహెల్‌కు ‘బిగ్ బాస్’ దివి సలహా, పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదట!

Divi Vadthya: ఇటీవల తన సినిమా ‘లంబసింగి’ ప్రమోషన్స్‌లో భాగంగా దివి చెప్పిన రియల్ లైఫ్ ప్రేమకథ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా మరోసారి తన ప్రేమ గురించి, పెళ్లి గురించి మాట్లాడింది ఈ భామ.

Bigg Boss Divi: బిగ్ బాస్ అనే రియాలిటీ షో ఎంతోమంది చిన్న సెలబ్రిటీలకు ఫేమ్ తీసుకొచ్చింది. కానీ ఆ ఫేమ్ అంతా కొంతకాలమే అని చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. అందుకే బిగ్ బాస్‌లో ఉన్నంత వరకు తనను ప్రేక్షకులు ఆదరించారని, అలాగే ఒకపై కూడా ఆదరిస్తారనే నమ్మకంతో సోహెల్ ‘బూట్‌కట్ బాలరాజు’ అనే చిత్రంతో అందరి ముందుకు వచ్చాడు. కానీ దానికి ఊహించినంత రెస్పాన్స్ రాకపోవడంతో సోహెల్ ఎమోషనల్ అవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ దివి కూడా ఈ విషయంపై స్పందించింది. అంతే కాకుండా తన ప్రేమకథ గురించి, తనకు కాబోయేవాడు ఎలా ఉండాలి అన్నదాని గురించి కూడా తను మాట్లాడింది.

రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి..

‘‘సోహెల్ అలా బాధపడినప్పుడు నాకు కూడా బాధేసింది. ఎవరూ థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడడం లేదు, తగ్గించేశారు అనేది రియాలిటీ. పెద్ద హీరో, పెద్ద డైరెక్టర్, అద్భుతమైన కథ తప్పా యావరేజ్ సినిమాలకు ఆడియన్స్ లేరు. మా సినిమా ‘లంబసింగి’ బాగుందని వచ్చినా దానికి కూడా ఎక్కువగా ఆడియన్స్ లేరు. ఈ రియాలిటీని అందరూ ఒప్పుకోవాల్సిందే. మనం తోపులు అయ్యేవరకు, మనల్ని ప్రోత్సహించే ప్రేక్షకులు వచ్చేవరకు మనం నథింగ్. అలా జరిగేంత వరకు రియాలిటీని యాక్సెప్ట్ చేయాల్సిందే’’ అని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది దివి. ఇక తాజాగా ‘లంబసింగి’ ప్రమోషన్స్‌లో భాగంగా దివి చెప్పిన ప్రేమకథ సోషల్ మీడియా అంతటా వైరల్ అవ్వగా దానిపై కూడా తను స్పందించింది.

ఇంట్రెస్ట్ లేదు..

‘‘ప్రతీ ఒక్కరు ఆ లవ్ స్టోరీ గురించే అడుగుతున్నారు. సుజాత ఒక ఇంటర్వ్యూలో నన్ను అడిగితే చెప్పాను. అక్కడి నుండి మొదలయ్యింది. ప్రతీ ఒక్కరికి లవ్ స్టోరీ, బ్రేకప్ ఉంటుంది. అది కామన్. కానీ నా విషయంలో సినిమాకంటే లవ్ స్టోరీ పాపులర్ అయిపోయింది’’ అంటూ దాని తర్వాత తనకు ఎలాంటి ప్రేమకథలు లేవని రివీల్ చేసింది దివి. ఇక చాలామంది అన్నట్టు తనకు కూడా ప్రేమ, పెళ్లిపై ఇంట్రెస్ట్ పోయిందని తెలిపింది. ‘‘రోజులు మారిపోవడం వల్ల పెళ్లి ఎందుకు, లివిన్‌లో ఉండొచ్చు కదా అనుకుంటున్నాం. కానీ ఇంట్లో వాళ్లు చంపేస్తారు. కాబట్టి ఒకవేళ ఎవరైనా కావాలనిపిస్తే అర్థం చేసుకోవడం, సపోర్ట్ చేయడం, ప్రోత్సహించడం ముఖ్యం. అన్ని సమానంగా చూసే ఎవరైనా కావాలి. నాకేం కోటీశ్వరుడు, అందగాడు, ఆరడుగులు వద్దు. నాకు కేరింగ్‌గా చూసుకునే భర్త చాలు. నన్ను నేను ఎలా చూసుకుంటున్నానో తను కూడా అలాగే చూసుకోవాలి’’ అంటూ తనకు కావాల్సిన వాడిలో ఉండాల్సిన లక్షణాల గురించి చెప్పుకొచ్చింది దివి.

వాళ్ల వల్లే..

దివి.. తను మిడిల్ క్లాస్ కుటుంబం నుండి వచ్చానని చాలాసార్లు చెప్పింది. మోడలింగ్ విషయంలో తన కుటుంబాన్ని ఎలా ఒప్పించిందో దివి బయటపెట్టింది. ‘‘అమ్మ అస్సలు ఒప్పుకోలేదు. మా అన్న కూడా రౌడీలాగానే ఉండేవాడు. నాన్న మాత్రమే కొంచెం స్వేచ్ఛ ఇచ్చారు. నేను ఎలా ఉండాలి, ఏ బట్టలు వేసుకోవాలి అని అన్నయ్య డిసైడ్ చేసేవాడు. ఒకరోజు నాన్న గట్టిగా తిట్టేసరికి అప్పటినుండి కొంచెం స్వేచ్ఛ ఇచ్చాడు. అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. తర్వాత వాళ్లే నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. వాళ్ల వల్లే నేను ఈ స్టేజ్‌లో ఉన్నాను’’ అని తన కుటుంబం గురించి చెప్పుకొచ్చింది దివి. ప్రస్తుతం దివి పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా గడిపేస్తోంది. ఒకట్రెండు చిత్రాల్లో హీరోయిన్‌గా కూడా చేస్తోంది.

Also Read: ‘సైంధవ్’ విలన్ కీలక నిర్ణయం - విడాకులను రద్దు చేసుకుని మాజీ భార్యతో మళ్లీ కాపురం, ఎందుకంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nizamabad Crime News:నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Ind vs Ban 5 Major controversies: భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య 5 పెద్ద వివాదాలు.. ఓసారి ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లిన ఆటగాళ్లు
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య 5 పెద్ద వివాదాలు.. ఓసారి ఏకంగా కొట్టుకునే వరకు వెళ్లిన ఆటగాళ్లు
Embed widget