Nawazuddin Siddiqui: ‘సైంధవ్’ విలన్ కీలక నిర్ణయం - విడాకులను రద్దు చేసుకుని మాజీ భార్యతో మళ్లీ కాపురం, ఎందుకంటే?
Nawazuddin Siddiqui: నవాజుద్దీన్ సిద్ధికి చాలా దారుణమైన పరిస్థితుల్లో తన భార్య ఆలియాతో విడిపోయారు. కానీ ఒకరిపై ఒకరు దారుణంగా ఆరోపణలు చేసుకున్న ఏడాది తర్వాత మళ్లీ కలిసుండాలని నిర్ణయించుకున్నారు.
Nawazuddin Siddiqui: సినీ పరిశ్రమలో విడాకులు అనేవి కామన్. కానీ ఏ కారణాల వల్ల అయినా ఆ విడాకులను క్యాన్సల్ చేసి మళ్లీ కలిసి ఉండాలి అనుకుంటున్న జంటలు చాలా తక్కువ. కానీ ఒక బాలీవుడ్ సీనియర్ కపుల్ మాత్రం వారి విడాకులను రద్దు చేసుకొని మళ్లీ కలిసుంటున్నామని ప్రకటించింది. బాలీవుడ్ సీనియర్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి పర్సనల్ లైఫ్ గురించి బీ టౌన్‌లో చాలాసార్లు హాట్ టాపిక్ నడిచింది. నవాజుద్దీన్ ‘సైంధవ్’ మూవీలో విలన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రీల్ లైఫ్‌లో సాఫీగా సాగుతున్నా.. రియల్ లైఫ్‌లో మాత్రం ఒడిదుడుకులు తప్పలేదు. తన భార్య ఆలియాతో మనస్పర్థలు రావడంతో 2020లో విడాకులు తీసుకున్నారు. అయితే, తాజాగా ఈ జంట తమ విడాకులను రద్దు చేసుకుని మళ్లీ కలిశారు. ఇందుకు మంచి కారణమే ఉంది.
పిల్లల కోసమే..
‘‘ఎప్పుడూ మూడో మనిషి వల్లే మా రిలేషన్‌షిప్‌లో సమస్యలు వస్తున్నాయని నాకు అనిపిస్తూ ఉండేది. ఇప్పుడు ఆ మనస్పర్థలు మా జీవితం నుంచి తొలగిపోయాయి. మా పిల్లల కోసం మేము పూర్తిగా లొంగిపోయాం. ఇప్పుడు ఇంకా విడివిడిగా ఉండడం కష్టం ఎందుకంటే పిల్లలు కూడా ఎదుగుతున్నారు. అంతే కాకుండా నవాజ్.. తన కూతురు షోరాకు చాలా క్లోజ్‌గా ఉండేవాడు. మా మధ్య జరిగిన దానివల్ల షోరా చాలా డిస్టర్బ్ అయ్యింది. తను ఇదంతా తట్టుకోలేకపోయింది. అందుకే మేము ఇంక గొడవపడొద్దు, ప్రశాంతంగా కలిసుండాలి అని నిర్ణయించుకున్నాం’’ అని నవాజుద్దీన్ భార్య ఆలియా సిద్ధికి ప్రకటించారు.
యానివర్సరీ సెలబ్రేషన్స్..
‘‘14 ఏళ్ల దాంపత్య జీవితాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాను’’ అంటూ సోషల్ మీడియాలో నవాజుద్దీన్‌తో కలిసున్న ఫోటోను షేర్ చేశారు ఆలియా. అంతే కాకుండా తను పాల్గొన్న ఇంటర్వ్యూలో వారి పర్సనల్ లైఫ్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. ‘‘ఇటీవల నా జీవితంలో కొన్ని మంచి మార్పులు జరిగాయి. మనం మన జీవితంలోని నెగిటివ్ విషయాలు ప్రపంచానికి ఎలా తెలిసేలా చేస్తున్నామో పాజిటివ్ విషయాలు కూడా అలాగే తెలిసేలా చేస్తే బాగుంటుంది అని నేను భావిస్తాను. మంచిని కూడా మనం హైలెట్ చేయాలి అని నమ్ముతాను. నవాజ్ మాతో ఉన్నాడు. అందుకే పిల్లలతో కలిసి యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాం’’ అని సోషల్ మీడియా పోస్ట్‌పై క్లారిటీ ఇచ్చారు ఆలియా.
View this post on Instagram
బాధ్యత లేని తండ్రి..
ఏడాది క్రితం నవాజుద్దీన్ సిద్ధికి బాధ్యతగల తండ్రి కాదని ప్రకటించి, తన నుంచి విడిపోవాలని అనుకుంటున్నట్టు ఆలియా తెలిపారు. తన కూతురితో నవాజుద్దీన్ మ్యానేజర్ పలుమార్లు అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పి షాకిచ్చారు. అసలు వారిద్దరి దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలు ఏంటో 8 పేజీల లేఖ ద్వారా అందరి ముందుకు తీసుకొచ్చారు. అందులో నవాజుద్దీన్‌పై ఎన్నో విధాలుగా ఆరోపణలు చేశారు ఆలియా. నవాజుద్దీన్ కూడా ఆలియా చెప్పినవి పూర్తిగా నిజం కాదని కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి ఒకరిపై ఒకరు అంత దారుణంగా ఆరోపణలు చేసుకున్నా ఫైనల్‌గా పిల్లల కోసం ఒకటవ్వాలని నిర్ణయించుకున్నారు.
Also Read: ‘యానిమల్ పార్క్’ మొదలయ్యేది అప్పుడే - మూవీలో కొత్తగా ఎంట్రీ ఇచ్చే నటీనటులు వీరే