అన్వేషించండి

Disha Patani: ‘కల్కి 2898 AD’ షూటింగ్ మొదటిరోజు ప్రభాస్ అలా చేశారు - దిశా పటానీ

Disha Patani: ‘కల్కి 2898 AD’లో దీపికా పదుకొనె కీలక పాత్రలో నటిస్తుండగా ప్రభాస్ సరసన హీరోయిన్‌గా దిశా పటానీ నటించింది. తాజాగా ప్రభాస్‌తో షూటింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి బయటపెట్టింది ఈ భామ.

Disha Patani About Prabhas: ప్రస్తుతం ఏ భాషా ఇండస్ట్రీలో చూసినా ‘కల్కి 2898 AD’ గురించే హాట్ టాపిక్ నడుస్తోంది. అసలు ఇప్పటివరకు ఈ సినిమా ఎలా వచ్చింది, ఔట్‌పుట్ ఎలా ఉండబోతుంది అని ప్రేక్షకులకు కొంచెం కూడా ఐడియా లేదు. కానీ ట్రైలర్ విడుదలయిన తర్వాత ఒకసారిగా దీని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ప్రేక్షకులు. ఇక ఇందులో నటించిన నటీనటులు కూడా ఈ ట్రైలర్‌ను షేర్ చేస్తూ దీనిపై తమ అభిప్రాయాలను బయటపెడుతున్నారు. ఈ మూవీలో ప్రభాస్ గర్ల్‌ఫ్రెండ్ పాత్రలో నటించిన దిశా పటానీ కూడా ‘కల్కి 2898 AD’ షూటింగ్ అనుభవాలు గురించి చెప్పుకొచ్చింది.

ట్రైలర్‌తో ఫోకస్..

టాలీవుడ్‌లో హీరోయిన్స్‌గా పరిచయమయ్యి ఆ తర్వాత బాలీవుడ్‌లోనే సెటిల్ అయిపోయిన వారిలో దిశా పటానీ కూడా ఒకరు. తెలుగులో తను నటించిన ‘లోఫర్’ కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేదు. అదే సమయంలో తనకు బాలీవుడ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చాయి. ఇప్పటికీ హిందీ సినిమాల్లోనే దిశా బిజీ అయిపోయింది. ఇన్నాళ్ల తర్వాత ఒక పాన్ ఇండియా మూవీలో, ఒక పాన్ ఇండియా స్టార్‌తో నటించే ఛాన్స్ కొట్టేసింది దిశా. ‘కల్కి 2898 AD’ ట్రైలర్‌లో దిశా ఒక సీన్‌లో కనిపించి అందరిలో ఫోకస్ అయ్యింది. ఇక ‘కల్కి 2898 AD’ గురించి, ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ హాట్ బ్యూటీ.

చాలా మంచి వ్యక్తి..

తాను కలిసి పనిచేసిన అందరు నటీనటుల్లో ప్రభాస్ చాలా మంచి యాక్టర్ అని ఇప్పటికే చాలాసార్లు తన అభిప్రాయాన్ని బయటపెట్టింది దిశా పటానీ. అంతే కాకుండా ‘కల్కి 2898 AD’ షూటింగ్‌లో మొదటిరోజు ఎలా గడిచిందో తను గుర్తుచేసుకుంది. ‘‘ప్రభాస్ చాలా మంచి వ్యక్తి. తనతో కలిసి నటించడం చాలా ఈజీగా అనిపిస్తుంది. మొదటిరోజు షూటింగ్‌లో నాకు మాత్రమే కాదు మూవీ టీమ్ మొత్తానికి తను ఇంటి నుంచి భోజనం తీసుకొచ్చాడు. తను చాలా మంచి వ్యక్తి, ఎప్పుడూ తనలో గర్వం అనేది కనిపించదు’’ అంటూ ప్రభాస్‌ను ప్రశంసలతో ముంచేసింది దిశా పటానీ. ఇక వీరిద్దరి మధ్య జరిగిన సాంగ్ షూటింగ్‌కు సంబంధించి అప్పట్లో ఫోటోలు కూడా షేర్ చేసింది దిశా. ఆన్ స్క్రీన్‌పై వీరిద్దరి కెమిస్ట్రీ చూడాలని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

పక్కా హిట్..

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ‘కల్కి 2898 AD’ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ పలుమార్లు పోస్ట్‌పోన్ అయినా ఫైనల్‌గా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. కల్కి సినిమాటిక్ యూనివర్స్‌కు సంబంధించి ‘కల్కి 2898 AD’ మొదటి సినిమాగా రానుంది. ఇప్పటికే ఈ సినిమా గురించి ప్రేక్షకులకు తెలియడం కోసం అమెజాన్ ప్రైమ్‌లో చిన్న యానిమేషన్ సిరీస్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్. దాంతో పాటు తాజాగా విడుదలయిన ట్రైలర్‌కు కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమా పక్కా హిట్ అని ప్రభాస్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also Read: కల్కి టికెట్ రేట్లు... ఏపీలో భారీగా పెరుగుతాయ్, కానీ తెలంగాణ కంటే రేటు తక్కువేనా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
Embed widget