అన్వేషించండి

Sukumar On Baby: ఇలాంటి సినిమా చూసి చాలా రోజులైంది - ‘బేబీ’పై దర్శకుడు సుకుమార్ ప్రశంసలు

‘బేబీ’ మూవీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ మూవీపై దర్శకుడు సుకుమార్ స్పందించారు. మూవీపై ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Sukumar: దర్శకుడు సాయి రాజేష్ దర్శకత్వంతలో తెరెక్కిన మూవీ ‘బేబీ’. ఈ మూవీలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లు ప్రధాన పాత్రలు పోషించారు. చిన్న సినిమాగా విడుదలై సన్సేషనల్ హిట్ అందుకుంది ‘బేబీ’ మూవీ. ప్రస్తుత యువత లవ్ స్టోరీలను ఆధారంగా తీసుకొని ఎన్నో విభిన్నమైన కోణాల్లో చూపించి మెప్పించారు దర్శకుడు. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా యూత్ ను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ మూవీపై విమర్శకుల ప్రశంసలతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా సాయి రాజేష్ చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నారు. ఇటీవలే రవితేజ ఈ సినిమా గురించి చెబుతూ పోస్ట్ చేశారు. తాజాగా స్టార్ దర్శకుడు సుకుమార్ కూడా ఈ మూవీపై ప్రశంసలు కురింపించారు. ప్రస్తుతం సుకుమార్ చేసిన వ్యాఖ్యలు మూవీటీమ్ మరింత ఉత్సాహాన్ని నింపాయనే చెప్పాలి. 

సినిమాలో ప్రతీ సీన్ కూడా సస్పెన్స్ థ్రిల్లర్ లా ఉంది: సుకుమార్

‘బేబీ’ సినిమాపై దర్శకుడు సుకుమార్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక నోట్ రాసుకొచ్చారు. చాలా కాలం తర్వాత తాను ఒక అద్భుతమైన రచనను చూశానని అన్నారు సుకుమార్. ఇది కచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త వేవ్ ను క్రియేట్ చేసిందని అన్నారు. తనకు ప్రతీ సీన్ కూడా సస్పెన్స్ థ్రిల్లర్ లా అనిపించిందని వ్యాఖ్యానించారు. సినిమాలోని పాత్రలు కూడా చాలా బాగా చేశారని, హీరోయిన్ వైష్ణవి చైతన్య వందశాతం ఇచ్చిందని అన్నారు. అలాగే ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ లు కూడా చాలా బాగా చేశారని కితాబిచ్చారు. అలాగే విజయ్ బుల్గానిన్ సంగీతం చాలా బాగా వచ్చిందన్నారు. ఇక నిర్మాతలు ఎస్ కె ఎన్, మారుతీల అటెంప్ట్ ను కూడా మెచ్చుకున్నారు సుకుమార్. సుకుమార్ లాంటి స్టార్ దర్శకుడు తమ మూవీపై ప్రశంసలు కురిపించడంతో ‘బేబీ’ టీమ్ ఫుల్ ఖుషీ అవుతుందట. సుకుమార్ లాంటి టాప్ దర్శకుడు ‘బేబీ’ సినిమాపై ప్రశంసలు కురింపించడం నిజంగా మూవీ టీమ్ కు మంచి బూస్ట్ ఇచ్చే వార్తేనని కామెంట్ చేస్తున్నారు ఇది చూసిన నెటిజన్స్.

కలెక్షన్స్ లో దూసుకుపోతున్న ‘బేబీ’..

‘బేబీ’ సినిమా ప్రస్తుతం థియేటర్లలో మంచి టాక్ తో దూసుకుపోతోంది. విడుదల అయిన మొదటి రోజు నుంచీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. మూవీకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్లకు క్యూ కడుతున్నారు ప్రేక్షకులు. దీంతో మొదటి రెండు రోజుల్లోనే రూ.14 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. తర్వాత నుంచీ కూడా థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డ్ లు కనబడుతున్నాయి. దీంతో మొత్తంగా మూవీ రిలీజ్ అయిన 5 రోజుల్లోనే రూ.40 కోట్లకు చేరువలో వసూళ్లు రాబట్టింది. ఇది ఇలాగే కొనసాగితే ఈ వారాంతానికి మూవీ రూ.50 కోట్లు వసూళ్లు సాధించే అవకాశం ఉందని ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరి లాంగ్ రన్ లో మూవీ ఎంత మేరకు వసూళ్లు రాబడుతుందో చూడాలి. 

Also Read: దర్శకుడు శంకర్ హైటెక్ ప్రయోగం - చనిపోయిన ఆ ఇద్దరు కూడా ‘భారతీయుడు-2’లో నటిస్తారట!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Meeting: చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీ... అసలు అజెండా ఇదే, చర్చించే అంశాలివే
చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీ... అసలు అజెండా ఇదే, చర్చించే అంశాలివే
Maganti Gopinath Family Problem: మాగంటి గోపీనాథ్ కుటుంబ సమస్య తీరేదెన్నడు? న్యాయం అడుగుతున్న తల్లి, కుమారుడు
మాగంటి గోపీనాథ్ కుటుంబ సమస్య తీరేదెన్నడు? న్యాయం అడుగుతున్న తల్లి, కుమారుడు
Telangana cotton farmers Problems:  తేమ పేరుతో  పత్తి కొనని సీసీఐ - దృష్టి పెట్టని తెలంగాణ ప్రభుత్వం - ఆదుకునేది ఎవరు?
తేమ పేరుతో పత్తి కొనని సీసీఐ - దృష్టి పెట్టని తెలంగాణ ప్రభుత్వం - ఆదుకునేది ఎవరు?
Ustaad Bhagat Singh : 'మీసాల పిల్ల' To 'చికిరి చికిరి' సూపర్ ట్రెండ్ - పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?
'మీసాల పిల్ల' To 'చికిరి చికిరి' సూపర్ ట్రెండ్ - పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?
Advertisement

వీడియోలు

IPL Trade Deal CSK, RR | ఐపీఎల్ ట్రేడ్ డీల్ పై ఉత్కంఠ
Akash Choudhary Half Century | 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన ఆకాష్ చౌదరి
మహిళను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోతారా?  డిప్యూటీ సీఎంపై మండిపడుతున్న జనాలు
రియల్ లైఫ్ OG.. షూటింగ్ రేంజ్‌లో గన్ ఫైర్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Narmada Human: భారతదేశ చరిత్రని మార్చిన ఆ పుర్రె ఎవరిది?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Meeting: చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీ... అసలు అజెండా ఇదే, చర్చించే అంశాలివే
చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీ... అసలు అజెండా ఇదే, చర్చించే అంశాలివే
Maganti Gopinath Family Problem: మాగంటి గోపీనాథ్ కుటుంబ సమస్య తీరేదెన్నడు? న్యాయం అడుగుతున్న తల్లి, కుమారుడు
మాగంటి గోపీనాథ్ కుటుంబ సమస్య తీరేదెన్నడు? న్యాయం అడుగుతున్న తల్లి, కుమారుడు
Telangana cotton farmers Problems:  తేమ పేరుతో  పత్తి కొనని సీసీఐ - దృష్టి పెట్టని తెలంగాణ ప్రభుత్వం - ఆదుకునేది ఎవరు?
తేమ పేరుతో పత్తి కొనని సీసీఐ - దృష్టి పెట్టని తెలంగాణ ప్రభుత్వం - ఆదుకునేది ఎవరు?
Ustaad Bhagat Singh : 'మీసాల పిల్ల' To 'చికిరి చికిరి' సూపర్ ట్రెండ్ - పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?
'మీసాల పిల్ల' To 'చికిరి చికిరి' సూపర్ ట్రెండ్ - పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?
PCOS and Breast Cancer : PCOS ఉన్న మహిళలకు రొమ్ము క్యాన్సర్ ప్రమాదం ఎక్కువేనా? పరిశోధనలు ఏమి చెప్తున్నాయంటే
PCOS ఉన్న మహిళలకు రొమ్ము క్యాన్సర్ ప్రమాదం ఎక్కువేనా? పరిశోధనలు ఏమి చెప్తున్నాయంటే
Ande Sri : ప్రముఖ రచయిత అందెశ్రీ కన్నుమూత - సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
ప్రముఖ రచయిత అందెశ్రీ కన్నుమూత - సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
Nimmala RamaNaidu: భవన నిర్మాణ కూలీ అవతారమెత్తిన మంత్రి నిమ్మల రామానాయుడు.. ఎందుకిలా..
భవన నిర్మాణ కూలీ అవతారమెత్తిన మంత్రి నిమ్మల రామానాయుడు.. ఎందుకిలా..
Honda Activa Vs TVS Jupiter: హోండా యాక్టివా లేదా టీవీఎస్ జూపిటర్‌ స్కూటీలలో ఏది బెటర్.. ధర, ఫీచర్లు ఇవే
హోండా యాక్టివా లేదా టీవీఎస్ జూపిటర్‌ స్కూటీలలో ఏది బెటర్.. ధర, ఫీచర్లు ఇవే
Embed widget