అన్వేషించండి

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి ఆఖరి తెలుగు సినిమా అదేనా... ఈ ట్విస్టేంటి జక్కన్న?

ప్రస్తుతం మహేష్ బాబుతో చేసే చిత్రమే రాజమౌళి ఆఖరి తెలుగు చిత్రమా? ఇకపై ఆయన తెలుగులో సినిమాలు చేయరా? రాజమౌళి లక్ష్యం వేరే ఉందా? అసలు ఇండస్ట్రీలో, ముఖ్యంగా రాజమౌళి మనసులో ఏముంది? ఆయన ఏం చేయబోతున్నారు?

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)తో చేయబోతున్న చిత్రమే దర్శకధీరుడు రాజమౌళి ఆఖరి తెలుగు చిత్రమా? అంటే అవుననే వినిపిస్తోంది టాలీవుడ్ సర్కిల్స్‌లో. ఈ సినిమా తర్వాత ఆయన టాలీవుడ్‌లో సినిమాలు చేసే అవకాశంలేదని.. ఆయన ఆలోచనా విధానం వేరేలా ఉందనేలా టాక్ వినిపిస్తోంది. దీంతో రాజమౌళి అభిమానులు.. ఈ ట్విస్టేంటి జక్కన్న అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది కదా.. మరెందు ఆలస్యం విషయంలోకి వెళదాం పదండి.. 

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ థ్రిల్లర్‌ని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2025 ప్రారంభంలో ఈ మూవీ గ్రాండ్‌గా ప్రారంభోత్సవం జరుపుకోనుందనేలా వార్తలు వినిపిస్తున్నాయి. మేకర్స్ నుండి అయితే అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఈ లోపు ఈ సినిమాపై రకరకాలుగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా క్యాస్టింగ్ విషయంలో రోజుకో పేరు వినబడుతూనే ఉంది. ఈ మధ్య రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ సినిమా స్టోరీ గురించి చెప్పే మాటలు బాగా వైరల్ అవుతూ.. సినిమాపై అంచనాలను పెంచేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇదే రాజమౌళి ఆఖరి తెలుగు సినిమా అంటే.. ఆయనతో సినిమా చేయాలని కోరుకున్న హీరోలు, తెలుగు సినిమా అభిమానులు డిజప్పాయింట్ అవుతారు కదా.. అందులో డౌటే లేదు.

Read Also : Pushpa 2 OTT Release Date: 'పుష్ప 2' ఓటీటీ రిలీజ్ డేట్ అదేనా... ఒకే టైమ్‌లో ఓటీటీలో పుష్పరాజ్, థియేటర్లలో 'గేమ్ ఛేంజర్' హంగమా

అయితే రాజమౌళి ప్లానింగ్ వేరేలా ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ టైమ్‌లో పలువురు హాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు. నువ్వు అక్కడెక్కడో ఉండాల్సిన వాడివి కాదు.. వచ్చెయ్ హాలీవుడ్‌కు అంటూ ఆఫర్లు కూడా ఇచ్చారు. అయితే అప్పుడేం మాట్లాడని రాజమౌళి.. ఇప్పుడు మాత్రం హాలీవుడ్‌ వెళ్లేందుకు మార్గం రెడీ చేసుకుంటున్నాడనేలా టాక్ వినిపిస్తోంది. ఓ ప్రముఖ హాలీవుడ్ స్టూడియో ఇప్పటికే రాజమౌళితే సంప్రదింపులు జరిపినట్లుగా సమాచారం. అంతేకాదు, ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సైతం గ్లోబల్ ప్రాజెక్ట్స్ కోసం రాజమౌళితో భాగస్వామ్యానికి చర్చలు జరుపుతుందనేలా ఆల్రెడీ ఇండస్ట్రీలో వార్తలు సంచరిస్తున్నాయి. ‘బాహుబలి’ విడుదల తర్వాత నుండి రాజమౌళి‌తో నెట్‌ఫ్లిక్స్‌ యాజమాన్యం ప్రత్యేక స్నేహబంధాన్ని కొనసాగిస్తూ వస్తుంది. దీంతో హాలీవుడ్ సినిమాల నిర్మాణంలో రాజమౌళి బిజీ కావాలని చూస్తున్నారని, అందుకు ఏర్పాట్లు కూడా మొదలయ్యాయనేది వినిపిస్తున్న వార్తలలోని సారాంశం. 

అంతేకాదు, దీనిపై మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది. రాజమౌళి హాలీవుడ్‌పై దృష్టి పెట్టడానికి కారణం, ఆయన మొదటి నుండి తను నెంబర్ వన్‌గా ఉండాలనే మనస్థత్వంతో కష్టపడే మనిషి. కానీ ఇప్పడు ఇండస్ట్రీలో రాజమౌళి నెంబర్ వన్ అని చెప్పడానికి వీలు లేకుండా.. సుకుమార్, సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకులు కలెక్షన్లతో ఆయనకు పోటీనిస్తున్నారు. అందుకే ఇతర భారతీయ దర్శకులతో ఇకపై పోటీ పడకూడదని, హాలీవుడ్ లేదంటే.. గ్లోబల్ స్టూడియోలతో మాత్రమే పనిచేయాలనేదే ఆయన లక్ష్యమనేలా వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉంది? నిజంగా రాజమౌళి లక్ష్యం అదేనా? వంటి వాటికి సమాధానం తెలియాలంటే మాత్రం ఇంకొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే, మహేష్‌తో చేసే SSMB29 సినిమా ఎప్పుడు పూర్తవుతుందో ఇప్పుడప్పుడే చెప్పలేం కాబట్టి.. అది విషయం.

Also Readఅనారోగ్యంతో 'బలగం' మొగిలయ్య కన్నుమూత... జానపద కళాకారుడు ఇకలేరు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Letter: అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
Today Headlines: రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana News: ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Letter: అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
Today Headlines: రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana News: ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
BJP MP Pratap Sarangi Injured: రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Amit Shah: అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
Kohli Vs Media: ఆసీస్ మీడియాపై కోహ్లీ గుస్సా - మాటల యుద్ధానికి దిగిన స్టార్ బ్యాటర్, అసలు ఏం జరిగిందంటే?
ఆసీస్ మీడియాపై కోహ్లీ గుస్సా - మాటల యుద్ధానికి దిగిన స్టార్ బ్యాటర్, అసలు ఏం జరిగిందంటే?
Embed widget