అన్వేషించండి

Shankar: సేనాపతికి 103 ఏళ్లు, మార్షల్ ఆర్ట్స్ ఎలా సాధ్యం - ప్రేక్షకుల సందేహానికి శంకర్ క్లారిటీ

Director Shankar: కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లోని ‘ఇండియన్ 2’పై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఇందులో కమల్ చేసిన సేనాపతి పాత్ర వయసు గురించి ట్రోల్స్ మొదలవ్వగా వాటికి దర్శకుడు క్లారిటీ ఇచ్చారు.

Shankar About Indian 2: కోలీవుడ్ నుంచి పాన్ ఇండియన్ మూవీ వచ్చి.. హిట్ కొట్టి చాలాకాలమే అయ్యింది. అందుకే కోలీవుడ్ ప్రేక్షకుల ఆశలన్నీ ఇప్పుడు ‘ఇండియన్ 2’పైనే ఉన్నాయి. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కాంబినేషన్‌పై ఇప్పటికే చాలా హైప్ క్రియేట్ అయ్యింది. 1996లో విడుదలయిన ‘భారతీయుడు’ మూవీకి ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. ఆ మూవీలో కమల్ హాసన్ చేసిన సేనాపతి పాత్ర వయసు 75 ఏళ్లు. ఈ లెక్క ప్రకారం.. 2024లో సేనాపతి వయసు 103 ఏళ్లు. అయితే 103 ఏళ్లు ఉన్న వ్యక్తి మార్షల్ ఆర్ట్స్, ఫైట్స్ అంత సులువుగా ఎలా చేస్తున్నాడు అనే ప్రశ్నకు దర్శకుడు శంకర్ సమాధానమిచ్చారు.

నాకు గుర్తులేదు..

103 ఏళ్లు ఉన్న సేనాపతి అలాంటి స్టంట్స్ ఎలా చేయగలడు అని నన్ను చాలామంది అడిగారు అంటూ శంకర్ చెప్పుకొచ్చారు. సేనావతి వృద్ధుడే కానీ సూపర్ మ్యాన్ అని అన్నారు. ‘‘నేను భారతీయుడు చేసినప్పుడు దాని సీక్వెల్ గురించి ఆలోచించలేదు. ఆ ఒక్క సినిమా మాత్రమే అనుకొని దానికి తగినట్టుగా కథను రాసుకున్నాను. సేనాపతిని ఫ్రీడమ్ ఫైటర్‌గా చూపించాలనుకున్నాను. అందుకే అందులో తను ఎప్పుడు పుట్టాడో భారతీయుడులో క్లియర్‌గా చూపించాను. ఆ సినిమాలో సేనాపతి గురించి పోలీసులు విచారిస్తున్నప్పుడు తను పుట్టిన తేదీ తెలిసే సీన్ ఉంటుంది. అది నాకు అసలు గుర్తులేదు’’ అని ‘భారతీయుడు’లోని సేనాపతి క్యారెక్టర్ గురించి మరోసారి వివరించారు శంకర్.

ప్రాక్టీస్‌తోనే సాధ్యం..

‘‘ఇండియన్ 2లో సేనాపతి.. చైనాలో ఉండే ఒక మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా కనిపిస్తాడు. ఎక్కువ సంఖ్యలో మార్షల్ ఆర్ట్స్ ఫైటర్స్ అనేవాళ్లు అక్కడే ఉన్నారు. చైనాకు చెందిన లు జిజియన్ అనే ఫైటర్ వయసు ఇప్పుడు 108 ఏళ్లు. అయినా ఇప్పటికీ యాక్టివ్‌గానే ఉంటూ గాల్లో ఎగురుతూ కిక్ కొడతారు. అది వాళ్లు నిరంతరం చేసే ప్రాక్టీస్‌తోనే సాధ్యమయ్యింది. సేనాపతి కూడా మర్మకళలో మాస్టర్. అందుకే తను నాకు ఒక సూపర్ హీరో’’ అని ‘ఇండియన్ 2’లో సేనాపతి క్యారెక్టర్ గురించి క్లారిటీ ఇచ్చారు శంకర్. అయితే ఇప్పటికే ఈ మూవీ ఎన్నో అడ్డంకులు దాటుకొని విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఫైనల్‌గా జులై 12న విడుదలకు సిద్ధమయ్యింది.

శంకర్ డిమాండ్ చేశాడు..

‘ఇండియన్ 2’లో ముసలివాడిగా కనిపించడం కోసం ప్రాస్థటిక్ మేకప్‌ను ధరించారు కమల్ హాసన్. అయితే ప్రాస్థటిక్ మేకప్ వేసుకోవడం అంత సులభం కాదు. దీంతో ఈ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో కమల్ బయటపెట్టారు. ‘ఇండియన్ 2’ కథ ఆసక్తిగా ఉండడం వల్ల, దర్శకుడు శంకర్ డిమాండ్ చేయడం వల్లే తాను ప్రాస్థటిక్ మేకప్ వేసుకోవడానికి ఒప్పుకున్నానని అన్నారు. ఇక అలాంటి మేకప్ వద్దని చాలాసార్లు అనుకున్నా కూడా కథలు డిమాండ్ చేయడం వల్లే మళ్లీ మళ్లీ అలాంటివి చేయాల్సి వస్తుందని తెలిపారు. ‘ఇండియన్ 2’లో కమల్ హాసన్‌తో పాటు సిద్ధార్థ్ కూడా మరో హీరోగా నటించాడు. రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జే సూర్య, బాబీ సింహా.. ఇతర కీలక పాత్రలు పోషించారు.

Also Read: నేను బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నా- షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రముఖ నటి హీనా ఖాన్

టాప్ హెడ్ లైన్స్

Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Korean Kanakaraju Collections Day 2 : కొరియన్ కనకరాజు రెండు రోజుల కలెక్షన్స్ - ఫస్ట్ డేతో కంపేర్ చేస్తే...
కొరియన్ కనకరాజు రెండు రోజుల కలెక్షన్స్ - ఫస్ట్ డేతో కంపేర్ చేస్తే...
Mahesh Babu Looks : రుద్ర అంటే రౌద్రమే ఉండాలా? - అడ్వెంచరర్, హ్యాండ్సమ్‌గా మహేశ్ బాబు... రాజమౌళి క్యాప్షన్ చెప్పిన స్టోరీ
రుద్ర అంటే రౌద్రమే ఉండాలా? - అడ్వెంచరర్, హ్యాండ్సమ్‌గా మహేశ్ బాబు... రాజమౌళి క్యాప్షన్ చెప్పిన స్టోరీ
Mahesh Babu Varanasi : వారణాసి స్పెషల్ సర్‌ప్రైజ్ వచ్చేసింది - మన రుద్ర మహేశ్ బాబు
వారణాసి స్పెషల్ సర్‌ప్రైజ్ వచ్చేసింది - మన రుద్ర మహేశ్ బాబు

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget