కమల్ హాసన్ 'ఇండియన్ 2' ఆడియో లాంచ్ హైలైట్స్‌లో ఈ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఒకటి.

'ఇండియన్ 2' డైరెక్టర్ శంకర్ కుమార్తె, హీరోయిన్ కమ్ సింగర్ అదితి శంకర్ స్టేజిపై పెర్ఫార్మన్స్ ఇచ్చారు. 

'ఇండియన్ 2' ఆడియో లాంచ్ స్టేజిపై పెర్ఫార్మన్స్ ఇస్తున్న అదితి శంకర్ వీడియో!

తన తండ్రి (శంకర్)కు ట్రిబ్యూట్ ఇస్తూ 'ఇండియన్ 2' స్టేజి మీద పెర్ఫార్మన్స్ చేశానని అదితి శంకర్ పేర్కొన్నారు.

స్టేజి మీద ప్రతి పాట, బీటుకు తాను పెర్ఫార్మన్స్ ఇవ్వడం తనకు దక్కిన అదృష్టంగా అదితి పేర్కొన్నారు.

బాబా భాస్కర్ అండ్ టీమ్ తన పెర్ఫార్మన్స్ కొరియోగ్రఫీ చేశారని అదితి శంకర్ తెలిపారు.

శంకర్ కుమార్తెగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అదితిలో కథానాయిక, గాయని ఉన్నారు.

కార్తీ 'విరుమాన్'లో హీరోయిన్ రోల్ చేసిన అదితి, ఆ మూవీలో ఓ పాట పాడారు.

శివకార్తికేయన్ 'మావీరన్' (తెలుగులో 'మహావీరుడు')లోనూ కథనాయికగా నటించిన అదితి, ఓ పాట కూడా పాడారు. 

వరుణ్ తేజ్ 'గని'లో 'రోమియో జూలియట్' పాడింది కూడా అదితినే. (all images courtesy: aditishankarofficial / instagram)