Ajith Kumar - Shankar Shanmugam: 'గేమ్ ఛేంజర్' ఫ్లాప్ తరువాత మరో స్టార్ హీరోపై కన్ను... ఆ సీనియర్ హీరో కోసం శంకర్ వెయిటింగా?
Shankar Shanmugam Next Movie: 'గేమ్ ఛేంజర్' డిజాస్టర్ తరువాత డైరెక్టర్ శంకర్ ఓ సీనియర్ హీరోతో నెక్స్ట్ మూవీ చేయాలని చేస్తున్నట్టు వార్తలు విన్పిస్తున్నాయి.

ఒకప్పుడు దేశంలోని బెస్ట్ డైరెక్టర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న టాప్ డైరెక్టర్ శంకర్. కానీ ఇప్పుడు ఆయన టైమ్ ఏమాత్రం బాగాలేదు. 'ఇండియన్ 2', 'గేమ్ ఛేంజర్' వంటి పాన్ ఇండియా సినిమాలతో వరుస డిజాస్టర్లను తన ఖాతాలో వేసుకున్నారు శంకర్. ఈ రెండు సినిమాలు అంచనాలను అందుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. ఆయన సెలెక్ట్ చేసుకుంటున్న రొటీన్ స్టోరీస్, కాలం చెల్లిన స్క్రీన్ ప్లేపై విమర్శలు విన్పిస్తున్నాయి. అయితే 'గేమ్ ఛేంజర్' వంటి డిజాస్టర్ తరువాత శంకర్ చేయబోయే నెక్స్ట్ మూవీ ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు డైరెక్టర్ శంకర్ ఓ సీనియర్ హీరో కోసం వేచి చూస్తున్నాడని తెలుస్తోంది.
సీనియర్ స్టార్ పై శంకర్ కన్ను
కోలీవుడ్ మీడియాలో విన్పిస్తున్న వార్తల ప్రకారం, శంకర్ స్టార్ హీరో అజిత్ కుమార్ తో కలిసి నెక్స్ట్ సినిమా చేయాలని చూస్తున్నాడు. కానీ ఇప్పుడైతే దీనికి సంబంధించిన చర్చలు ముందుకు కదిలే ఛాన్స్ లేదు. శంకర్ ఇంకా అజిత్ ని కలవలేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు స్పెయిన్ లో రేసింగ్ పోటీలో పాల్గొంటున్నారు. శంకర్ కి అజిత్ అవకాశం ఇస్తారా లేదా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు శంకర్ పరిస్థితి గతంలోలా లేదు. అప్పట్లో ప్రతి స్టార్ హీరో ఆయనతో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలని కలలు కానే వారు. శంకర్ తో సినిమా చేయాలంటే ఖచ్చితంగా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. 'గేమ్ ఛేంజర్' ప్రమోషన్ల సందర్భంగా శంకర్ తన తదుపరి చిత్రం 'వేల్పారి' నవల ఆధారంగా ఉంటుందని వెల్లడించాడు. ఇప్పుడు విన్పిస్తున్న రూమర్లను దృష్టిలో పెట్టుకుని చూస్తే శంకర్ అజిత్ తోనే 'వేల్పారి' సినిమా చేయాలని అనుకుంటున్నారా? అనే డౌట్స్ మొదలవుతున్నాయి. మరి శంకర్ ఆలోచన ఏంటనే దానికి కాలమే సమాధానం చెప్పాలి. 'ఇండియన్ 3' విడుదల చేయాల్సిన బాధ్యత కూడా శంకర్ మీద ఉంది.
శంకర్ ఆస్తులు జప్తు
అసలే 'గేమ్ ఛేంజర్' డిజాస్టర్ తో నిరాశలో ఉన్న శంకర్ మెడకు మరో వివాదం చుట్టుకుంది. దర్శకుడు శంకర్ పై మనీలాండరింగ్ కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో ఉండగానే, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రూ.10.11 కోట్ల విలువైన శంకర్ ఆస్తులను జప్తు చేసింది. 2011 మే 19న చెన్నైలోని ఎగ్మోర్‌లోని 13వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో శంకర్‌పై తమిళ రచయిత ఆరూర్ తమిళనాదన్ దాఖలు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన తర్వాత ఈడీ ఇలాంటి చర్యలు తీసుకుంది. శంకర్ సూపర్ హిట్ సినిమా ఎంథిరన్ (రోబో) తన కథ 'జిగుబా' నుంచి దొంగిలించారని తమిళనాదన్ ఆరోపించారు. విచారణ సమయంలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదికలో కూడా రెండు కథల మధ్య చాలా పోలికలు ఉన్నట్టు తేలింది. కానీ శంకర్ మాత్రం ఆ కేసును కోర్టు కొట్టేసిందని, అయినప్పటికీ ఈడీ ఇలాంటి చర్యలకు పూనుకోవడం తనను నిరాశ పరిచిందని అన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

