By: Suresh Chelluboyina | Updated at : 13 Apr 2023 08:51 PM (IST)
Image Credit: Ravi Babu/Instagram
‘అవును’, ‘అవును 2’... ఇప్పుడు ‘అసలు’. ఈ సినిమాల్లో కామన్‌గా కనిపించేది ‘అ’ మాత్రమే కాదు, పూర్ణ కూడా. ఎందుకంటే.. రవిబాబుకు ఆమె నటన అంటే అంత ఇష్టమట. కాదు.. కాదు.. ప్రేమంట. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. ఆమెతో తనకు లవ్ అఫైర్ ఉందని, కానీ అది మీరు అనుకొనేది కాదని స్పష్టం చేశారు. దీంతో ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘అసలు’ సినిమా.. ఇటీవలే ‘Etv Win’లో నేరుగా రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో రవిబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘అసలు’ సంగతులు చెప్పారు. ఇందులో భాగంగా పూర్ణ గురించి చెప్పుకొచ్చారు. ‘‘పూర్ణతో నాకు లవ్ అఫైర్ ఉంది. అలా అన్నానని ఇంకేదో అనుకోవద్దు. ప్రతి డైరెక్టర్‌కు తన నటులతో అలాంటి బంధమే ఉంటుంది. దర్శకుడు చెప్పేదాని కంటే పూర్ణ రెండు వందల శాతం యాడ్ చేసి నటిస్తుంది’’ అని తెలిపారు.
తన సినిమాలో హీరోయిన్ అనగానే అంతా పూర్ణాయే అనుకుంటారని, కానీ ఆమె అన్ని సినిమాలకు ఒకే చెప్పదని రవిబాబు స్పష్టం చేశారు. ఇటీవల తన కొత్త సినిమా ‘వాషింగ్ మెషీన్’ కోసం పూర్ణాను సంప్రదించానని తెలిపారు. ఏ మొహమాటం లేకుండా తాను ఆ సినిమాలో నటించనని చెప్పేసిందన్నారు. తాను ఆ పాత్రకు సరిపోతాను అనుకుంటేనే నటిస్తుందని, నా కోసం ప్రత్యేకంగా అంగీకరించదని తెలిపారు. అందుకే తనకు నచ్చిన సినిమాల్లోనే ఆమె నటించిందన్నారు.
పూర్ణ ఇప్పటికే పలు టీవీ షోస్‌లో బిజీ బిజీగా గడిపేస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది నెలల కిందట పెళ్లి చేసుకున్న పూర్ణ.. ఇటీవలే బిడ్డకు కూడా జన్మనిచ్చింది. దీంతో ఆమె షూటింగులకు విరామం ఇచ్చింది. మళ్లీ టీవీ షోస్‌లో బిజీ అయ్యేందుకు సిద్ధమవుతోంది. పూర్ణ 2007లో శ్రీహరి ప్రధాన పాత్రలో నటించిన ‘శ్రీ మహాలక్ష్మి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత 2011లో అల్లరి నరేష్‌తో ‘సీమటపాకాయ్’ సినిమా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో పూర్ణకు గుర్తింపు వచ్చినా.. అవకాశాలు మాత్రం రాలేదు. 2012లో రవిబాబు ‘అవును’ సినిమాతో పూర్ణకు తెలుగులో లైఫ్ ఇచ్చారు. ఆ తర్వాత ‘లడ్డు బాబు’, ‘అవును 2’, ‘అదుగో’ సినిమాల్లో నటించింది. ‘అఖండ’ మూవీలో కీలక పాత్రలో నటించి మరోసారి మెప్పించింది.
‘అసలు’ సినిమా ట్రైలర్ ప్రకారం.. ఇది ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ఓ దారుణమైన హత్యను చేధించే పనిలో ఉంటాడు ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ (రవిబాబు). ఈ క్రమంలో నలుగురు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తారు. ఈ హత్య వెనుక ఓ రహస్యాలు ఏమిటి ఆ నలుగురు అనుమానితులకు హత్యకు సంబంధం ఏంటి అనే అంశాలను సినిమాలో చూడొచ్చు. సాధారణంగా రవిబాబు సినిమాలలో సస్పెన్స్ అంశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఉత్కంఠతో పాటు ఒకింత భయం కూడా కలుగుతుంది. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ అలా ఉంటుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమవుతుంది.
Read Also: మంజు వారియర్ గొప్ప మనసు, తన కారు వెంట పరిగెత్తిన అభిమాని కోరిక తీర్చిందిలా!
Cannes 2023: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సత్తా చాటిన 'శాకుంతలం', ఏకంగా నాలుగు కేటగిరీల్లో అవార్డులు
Keerthy Suresh Dating: ఆ అసత్య వార్తలతో మనఃశాంతి కరువవుతోంది - కీర్తి సురేష్ తండ్రి ఆవేదన!
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్
గీతా ఆర్ట్స్‌లో అక్కినేని, శర్వానంద్‌కు యాక్సిడెంట్ - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!
NTR In Rest Mode : 'దేవర'కు ఇంకో వారం విశ్రాంతి - ఎన్టీఆర్ మళ్ళీ సెట్స్‌కు వచ్చేది ఎప్పుడంటే?
Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం
IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!
Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!
NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి