అన్వేషించండి

SSMB29: వీఎఫ్ఎక్స్‌కు తోడుగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్... మహేష్ బాబు సినిమాతో వెండితెరపై మాయ చేయబోతున్న దర్శక ధీరుడు

మహేష్ బాబు, రాజమౌళి ప్రతిష్టాత్మక అడ్వెంచర్ మూవీ త్వరలో సెట్స్ మీదకు రాబోతోంది. AI టెక్నాలజీతో జక్కన్న ప్రేక్షకులను మాయ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

SS Rajamouli - Mahesh Babu Movie: రాజమౌళి సినిమా అనగానే ప్రేక్షకులలో అంచనాలు హైలో ఉంటాయి. ఎవరూ ఊహించని కథలతో వెండితెరపై విజువల్ వండర్స్ చేయడంలో ఆయన తర్వాతే మరెవరైనా అని చెప్పుకొవచ్చు. టెక్నాలజీని అద్భుతంగా వినియోగించుకుంటూ కళాఖండాలను తెరకెక్కించడంలో జక్కన్న దిట్ట. ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కించబోతున్నారు. అడ్వెంచర్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ అల్యుమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్స్ నిర్మించడంతో పాటు వర్క్ షాపులు జరుగుతున్నాయి.

AI టెక్నాలజీ క్లాసులు వింటున్న రాజమౌళి, మహేష్ బాబు

రాజమౌళి సినిమా అంటేనే వీఎఫ్ఎక్స్‌తో నిండిపోయి ఉంటుంది. మహేష్ బాబుతో చేయబోయే సినిమాలో వీఎఫ్ఎక్స్‌కు AI టెక్నాలజీ తోడు కాబోతోంది. ఈ సినిమాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను హై లెవెల్ లో ఉపయోగించాలని జక్కన్న భావిస్తున్నారట. టెక్నాలజీ సాయంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం AI టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న ఓ న్యూజిలాండ్ సంస్థతో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. వరల్డ్ క్లాస్ విజువల్స్ కోసం లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించబోతున్నారట. గత కొంతకాలంగా AI టెక్నాలజీ డిజిటల్ ప్రపంచంలో సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. సినిమా పరిశ్రమలోనూ విస్తృతంగా వినియోగిస్తున్నారు. రీసెంట్ గా AI సాయంతో ‘కంగువా’ సినిమాలో సూర్య పాత్రకు ఏకంగా 30కి పైగా భాషల్లో డబ్బింగ్ చెప్పించారు. ఇప్పుడు రాజమౌళి కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ తో మాయ చేసేందుకు రెడీ అవుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ అవుట్ ఫుట్ పొందే అవకాశం ఉండటంతో ఆయన AI టెక్నాలజీ సాయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

‘ఇండియానా జోన్స్’ తరహాలో SSMB29

రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపొందబోతోంది. ‘ఇండియానా జోన్స్’ తరహాలో ఈ సినిమా ఉండబోతున్నట్లు కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తయ్యాయన్నారు. ఈ సినిమా కథ కోసం రెండు సంవత్సరాలుగా కష్టపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2025 జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోంది. కెఎల్ నారాయణ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటున్నారు? ఇతర నటీనటులు ఎవరు? అనే విషయంపై చిత్రబృందం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెండు నుంచి మూడు సంవత్సరాలు పట్టే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.  

Read Also: మాకూ హార్ట్ ఉంది... రెస్పెక్ట్ ఇవ్వండి - ఫీమేల్ జర్నలిస్టుకు అనన్య నాగళ్ల ఇన్‌డైరెక్ట్‌ కౌంటర్?

టాప్ హెడ్ లైన్స్

Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Embed widget