By: ABP Desam | Updated at : 07 Sep 2023 06:03 PM (IST)
Photo Credit: Salaar/Twitter
'కే జి ఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న 'సలార్' మూవీని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో తాజా సంఘటన ద్వారా స్పష్టమవుతుంది. ప్రశాంత్ నీల్ తాజాగా 'సలార్' సినిమా హిట్ అవ్వాలని ఏకంగా గుడిలో పూజ చేయించాడు. ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. 'కే జీ ఎఫ్' సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో 'సలార్' అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాల నెలకొన్నాయి. సెప్టెంబర్ 28న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు.
కానీ గ్రాఫిక్స్ పనులు ఆలస్యం అవడంతో తాజాగా రిలీజ్ ని వాయిదా వేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 'సలార్' రిలీజ్ పోస్ట్ పోన్ కు సంబంధించి మేకర్స్ మరో రెండు, మూడు రోజుల్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు కొత్త రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 'సలార్' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉన్న డైరెక్టర్ ప్రశాంత్ తాజాగా ఓ టెంపుల్ ని దర్శించుకున్నారు. కృష్ణాష్టమి సందర్భంగా తన కుటుంబంతో కలిసి సత్యసాయి జిల్లాలోని తన సొంత ఊరు నీలకంఠపురం వెళ్లారు ప్రశాంత్ నీల్. అక్కడ తన తండ్రి సమాధికి నివాళులు అర్పించారు. అనంతరం ఆ గ్రామంలోని గుడిలో ప్రత్యేక పూజలు చేయించారు. అయితే పూజలో భాగంగా తన కుటుంబ సభ్యుల పేర్లతో పాటు 'సలార్' పేరును కూడా చెప్పారు.
#PrashanthNeel is telling His Film #Salaar name with his Family members names to "pujari". He visited his Father's Grave in Neelakantapuram, Satyasai District,He'll be participating in the Krishnashtami celebrations along with villagers#prabhas #SalaarTrailer #salaaronsep28th pic.twitter.com/PWOk7dRKvK
— RebelStar Prabhas (@CrazyError9) September 7, 2023
ఈ మేరకు సినిమా మంచి విజయం సాధించాలని ప్రార్థించారు. 'సలార్' సినిమాను కూడా తన ఫ్యామిలీ మెంబర్ లాగా భావించి ప్రశాంత్ నీల్ గుడిలో అర్చన చేయించడంపై డార్లింగ్ ఫాన్స్ ఫిదా అయిపోతున్నారు. దీంతో దీనికి సంబంధించిన వీడియోను ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ గుడిలో పూజ చేయిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే రీసెంట్గా ఈ సినిమా నుంచి విడుదల అయిన టీజర్ ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంది. అతి తక్కువ సమయంలోనే యూట్యూబ్లో 100 మిలియన్లకు పైగా వ్యూస్ అందుకొని సరికొత్త రికార్డు అందుకుంది.
దీంతో 'సలార్' పై అంచనాలు తారస్థాయికి చేరిపోయాయి. సినిమా కోసం డార్లింగ్ ఫాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. హోంబలే ఫిలిం పతాకంపై విజయ్ కిరంగదూర్ దాదాపు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోంది. అందులో పార్ట్-1 సీజ్ ఫైర్ త్వరలోనే విడుదల కాబోతోంది. ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ అగ్రహీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు విలన్స్ గా కనిపించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : పవర్ స్టార్ ఈజ్ బ్యాక్, గన్‌తో అదరగొట్టిన పవన్ - యాక్షన్‌లోకి దిగిన ఉస్తాద్ భగత్ సింగ్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Ganapath Teaser: టైగర్ ష్రాఫ్ ‘గణపథ్‘ టీజర్ చూశారా? యాక్షన్ సీన్లకు గూస్ బంప్స్ రావాల్సిందే!
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
Salaar Release Date: ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రోజు ప్రభాస్ అభిమానులకు పండగే
Raveena Tandon: ఆయన పెదాలు తాకగానే- షాకింగ్ విషయాన్ని వెల్లడించిన రవీనా టాండన్!
Devara Movie: రికార్డు ధర పలికిన ‘దేవర‘ డిజిటల్ రైట్స్, కొన్నది ఏ ఓటీటీ సంస్థో తెలుసా?
Narayana: భూమి వదులుకున్నోడిని, అవినీతి చేస్తానా? రాజకీయ కక్షలతోనే ఈ కేసులు - నారాయణ
YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి, కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్
తమిళనాడు కర్ణాటక మధ్య నిప్పు రాజేస్తున్న నీళ్లు, 150 ఏళ్లుగా కావేరి వాటాల వివాదం
బెంగళూరులో 44 విమానాలు రద్దు, కర్ణాటక బంద్ ఎఫెక్ట్ - ప్రయాణికుల ఇబ్బందులు
/body>