అన్వేషించండి

Jailer Sequel: ‘జైలర్’ సీక్వెల్ కోసం టైటిల్ ఫిక్స్ - ప్రీ ప్రొడక్షన్‌కు అంతా సిద్ధం

Jailer Sequel: రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘జైలర్’ ఓ రేంజ్‌లో హిట్‌ను సాధించింది. ఇప్పుడు దీని సీక్వెల్‌కు సంబంధించిన వర్క్ జరుగుతుండగా తాజాగా టైటిల్ ఫైనల్ అయ్యిందని తెలుస్తోంది.

Jailer Sequel Title Finalised: సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలను ఫ్యాన్స్ ఎగబడి చూసినా.. ఆయన రేంజ్‌కు తగిన హిట్‌ను చూసి చాలాకాలం అయ్యింది. ఇక గతేడాది విడుదలయిన ‘జైలర్’ మూవీతో మళ్లీ బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో నిరూపించారు సూపర్ స్టార్. ‘జైలర్’ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ పరంగా మాత్రమే కాకుండా ఫ్యాన్స్‌కు నచ్చే విధంగా ఉండడంతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది. దీంతో దీనికి సీక్వెల్ కూడా తెరకెక్కిస్తానని దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ అప్పుడే ప్రకటించారు. ప్రస్తుతం ‘జైలర్’ సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగా.. దీని టైటిల్‌ను తాజాగా ఫిక్స్ చేశారట మేకర్స్.

అదే టైటిల్..

2023లో విడుదలయిన ‘జైలర్’.. అత్యధిక కలెక్షన్స్ సాధించిన తమిళ చిత్రంగా రికార్డును సొంతం చేసుకుంది. దీంతో అప్పటినుండే ప్రేక్షకుల్లో సీక్వెల్ కోసం ఎదురుచూపులు మొదలయ్యాయి. గత కొన్ని నెలలుగా ఈ సీక్వెల్‌కు సంబంధించిన ఎన్నో రూమర్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతేడాది ఆగస్ట్ నుండి ‘జైలర్’ సీక్వెల్‌పై దృష్టిపెట్టడం మొదలుపెట్టాడట దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్. ప్రస్తుతం ఇంకా ఈ సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ స్టేజ్‌లోనే ఉండగా.. దీని టైటిల్‌కు సంబంధించిన రూమర్స్.. రజినీకాంత్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాయి. ఇక ఈ సీక్వెల్‌కు ‘హుకుమ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.

స్క్రిప్ట్ పూర్తయ్యింది..

ప్రస్తుతం కోలీవుడ్‌లో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ‘జైలర్ 2’కు సంబంధించిన బేసిక్ స్క్రిప్ట్ పని పూర్తయ్యిందని తెలుస్తోంది. దీనికోసం నెల్సన్ దిలీప్‌కుమార్ అందించిన కాన్సెప్ట్‌తో టీమ్‌కు చాలా నచ్చిందని సమాచారం. టైగర్ అలియాస్ ముత్తువేల్ పాండియన్‌గా ‘జైలర్ 2’తో రజినీకాంత్‌ను మరింత కొత్తగా చూపించాలనే ఆలోచనలో ఉన్నాడట దర్శకుడు. ఇప్పటికే ఈ స్టోరీ ఐడియాను రజినీకాంత్‌కు, సన్ పిక్చర్స్‌కు వినిపించగా.. వారు కూడా నెల్సన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 2024 జూన్‌లో ‘జైలర్ 2’కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ను ప్రారంభిస్తారు మేకర్స్. ఇక ఈ సీక్వెల్‌ను కూడా సన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించనుందని ఇప్పటికే స్పష్టమయ్యింది.

పాటకు ఫ్యాన్స్..

త్వరగా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకొని ఈ ఏడాది చివరిలోపు ఎలాగైనా ఈ సీక్వెల్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాడట నెల్సన్ దిలీప్‌కుమార్. ప్రస్తుతం రజినీకాంత్.. లోకేశ్ కనకరాజ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న తలైవార్ 171 షూటింగ్‌లో బిజీగా ఉండగా.. అది పూర్తయిన తర్వాత ‘జైలర్’లో కోసం సమయాన్ని కేటాయిస్తారు రజినీకాంత్. ‘జైలర్’ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించానికి అనిరుధ్ అందించిన సంగీతం కూడా ఒక ముఖ్య కారణంగా నిలిచింది. ఇక అందులోని ‘హుకుమ్’ పాటను ప్రేక్షకులు రిపీట్ మోడ్‌లో విన్నారు. అందుకే ఈ సీక్వెల్‌కు ‘హుకుమ్’ అనే టైటిల్‌నే ఫిక్స్ చేస్తే బాగుంటుందని మూవీ టీమ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే టైటిల్ అయితే ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీ అవుతారని మేకర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌ ఎప్పుడో కూడా చెప్పేశారు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
AP Assembly: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
Karnataka:  సినీ పరిశ్రమకు చెప్పినట్లుగానే నట్లు బిగిస్తున్న కర్ణాటక ప్రభుత్వం  - మల్టీప్లెక్స్‌ల్లో అయినా సరే టిక్కెట్ రేటు రూ. 200 మాత్రమే !
సినీ పరిశ్రమకు చెప్పినట్లుగానే నట్లు బిగిస్తున్న కర్ణాటక ప్రభుత్వం - మల్టీప్లెక్స్‌ల్లో అయినా సరే టిక్కెట్ రేటు రూ. 200 మాత్రమే !
TGPSC: టీజీపీఎస్సీ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్, గ్రూప్-1,2,3 రిజల్ట్స్ ఎప్పుడంటే?
టీజీపీఎస్సీ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్, గ్రూప్-1,2,3 రిజల్ట్స్ ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Malala returned to Pak after 13 years | పాకిస్తాన్ కు వచ్చిన మలాలా | ABP DesamTamilisai arrested by police | తమిళసైని అడ్డుకున్న పోలీసులు | ABP DesamCadaver Dogs for SLBC Rescue | SLBC రెస్క్యూ ఆపరేషన్‌కు కేరళ కుక్కల సహాయం | ABP DesamJr NTR Family in Chakalipalem | కోనసీమలో సందడి చేసిన Jr NTR కుటుంబం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
AP Assembly: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
Karnataka:  సినీ పరిశ్రమకు చెప్పినట్లుగానే నట్లు బిగిస్తున్న కర్ణాటక ప్రభుత్వం  - మల్టీప్లెక్స్‌ల్లో అయినా సరే టిక్కెట్ రేటు రూ. 200 మాత్రమే !
సినీ పరిశ్రమకు చెప్పినట్లుగానే నట్లు బిగిస్తున్న కర్ణాటక ప్రభుత్వం - మల్టీప్లెక్స్‌ల్లో అయినా సరే టిక్కెట్ రేటు రూ. 200 మాత్రమే !
TGPSC: టీజీపీఎస్సీ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్, గ్రూప్-1,2,3 రిజల్ట్స్ ఎప్పుడంటే?
టీజీపీఎస్సీ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్, గ్రూప్-1,2,3 రిజల్ట్స్ ఎప్పుడంటే?
Tesla: ట్రంప్ దెబ్బకు పడిపోతున్న టెస్లా షేర్లు -ఎలాన్ మస్క్ ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారో తెలుసా ?
ట్రంప్ దెబ్బకు పడిపోతున్న టెస్లా షేర్లు -ఎలాన్ మస్క్ ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారో తెలుసా ?
Telangana Latest News: వ్యూహం మార్చిన రేవంత్ రెడ్డి- రేపు కీలక భేటీ- బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి వస్తాయా?
వ్యూహం మార్చిన రేవంత్ రెడ్డి - రేపు కీలక భేటీ- బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి వస్తాయా?
RAPO22 Title: రామ్ కొత్త సినిమా టైటిల్ ఇదే... పవన్ కళ్యాణ్ ట్యాగ్ గుర్తుకు వచ్చేలా!
రామ్ కొత్త సినిమా టైటిల్ ఇదే... పవన్ కళ్యాణ్ ట్యాగ్ గుర్తుకు వచ్చేలా!
Southern Stalin: దక్షిణాదికి అన్యాయంపై స్టాలిన్ ఉద్యమం - కేసీఆర్, రేవంత్, చంద్రబాబు, జగన్‌లకు ఆహ్వానం
దక్షిణాదికి అన్యాయంపై స్టాలిన్ ఉద్యమం - కేసీఆర్, రేవంత్, చంద్రబాబు, జగన్‌లకు ఆహ్వానం
Embed widget