అన్వేషించండి

Krishnamma Release Date: ఎట్టకేలకు కొరటాల శివ సినిమాకి విముక్తి - 'కృష్ణమ్మ' రిలీజ్ డేట్ ఫిక్స్!

కొరటాల శివ సమర్పణలో సత్య దేవ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం 'కృష్ణమ్మ'. అప్పుడెప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ తాజాగా ప్రకటించారు.

హీరో సత్యదేవ్ వైవిధ్యమైన కథలు, విలక్షణమైన పాత్రలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఓవైపు ప్రధాన పాత్రలు పోషిస్తూనే.. మరోవైపు అవకాశం వచ్చినప్పుడు మంచి క్యారెక్టర్ రోల్స్ చేయడానికి కూడా వెనుకాడటం లేదు. చివరిసారిగా 'గుర్తుందా శీతాకాలం' సినిమాతో పలకరించిన విలక్షణ నటుడు.. కాస్త గ్యాప్ తీసుకొని బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ తో అలరించడానికి రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా ముందుగా 'కృష్ణమ్మ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు. 

సత్య దేవ్ కథానాయకుడిగా తెరకెక్కిన రా అండ్ రస్టిక్ యాక్షన్ మూవీ 'కృష్ణమ్మ'. ఇందులో అధిరా రాజ్, కృష్ణ తేజా రెడ్డి, మీసాల లక్ష్మణ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాతో వి.వి. గోపాల కృష్ణ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు. అగ్ర దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. అప్పుడెప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. వివిధ కారణాలతో లేట్ అవుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఇప్పుడు విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది. 2024 మే 3న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా అనౌన్స్ మెంట్ వీడియోని ఆవిష్కరించారు. 

'కృష్ణమ్మ' రిలీజ్ డేట్ వీడియో గ్లింప్స్ లోకి వెళ్తే.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఖైదీగా స‌త్య‌దేవ్ కనిపిస్తుండగా, అక్కడికి వచ్చిన మరో ఖైదీ లక్ష్మణ్ ''భద్రా.. రిలీజ్ అవ్వ‌బోతున్నాం రా'' అంటాడు. దీనికి స‌త్య‌దేవ్ 'ఎప్పుడు?' అని అడగ్గా.. మే 3వ తారీఖున ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నట్లు వెల్లడించడం ఆసక్తిని కలిగిస్తుంది. ఇందులో సత్యదేవ్ పెద్ద కత్తి పట్టుకొని కోపంగా ఎవరి మీదనో దాడి చేయడానికి పరుగెత్తడం, జైల్లో పోలీసులు అతన్ని హింసించడం వంటి కొన్ని యాక్షన్ సన్నివేశాల షాట్స్ చూపించారు. దీనికి బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 

డైరెక్టర్ గోపాల కృష్ణ ఒక వైవిధ్యమైన ఇంటెన్స్ థ్రిల్లర్‌ కథాంశంతో 'కృష్ణమ్మ' సినిమాని రూపొందించినట్లు తెలుస్తోంది. స్నేహానికి ఉన్న విలువను, స్నేహితుల మధ్య ఉండే అనుబంధాన్ని ఈ చిత్రంలో ప్రత్యేకంగా చూపించబోతున్నారు. సినిమా కథంతా విజయవాడ కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో జరుగుతుంది. అందుకే బ్యాక్ డ్రాప్ కు తగ్గట్టుగా కృష్ణమ్మ అనే టైటిల్ పెట్టినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, రెండు సాంగ్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ లో సత్యదేవ్‌ ఇంతకుముందెన్నడూ చూడని విధంగా మాస్ యాక్షన్ అవతార్‌ లో, చాలా వైలెంట్ గా కనిపించాడు.

'కృష్ణమ్మ' సినిమాలో అర్చన, రఘుకుంచె, నంద గోపాల్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. కాల భైరవ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ నిర్వహించారు. రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా వర్క్ చేసారు. సమ్మర్ స్పెషల్ గా కొరటాల శివ సమర్పణలో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. 

Also Read: నాని బ్లాక్ బస్టర్ సినిమాలకు దారుణమైన టీఆర్పీ - బుల్లితెరపై నేచురల్ స్టార్‌కు ఆదరణ తగ్గుతోందా?

టాప్ హెడ్ లైన్స్

Toxic Trailer Review : టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్, యాక్షన్, వయలెన్స్ అంతకు మించి...
టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్, యాక్షన్, వయలెన్స్ అంతకు మించి...
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Agadha Story : అగధ ఓ సరికొత్త ప్రపంచం - సీక్వెల్ ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు... హీరో శ్రవణ్ రెడ్డి రియాక్షన్
అగధ ఓ సరికొత్త ప్రపంచం - సీక్వెల్ ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు... హీరో శ్రవణ్ రెడ్డి రియాక్షన్
Sanjeev Movie OTT : నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్
నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget